నోట్ 7 మంటలు ఆరకముందే శాంసంగ్‌కు మరో భారీ షాక్

Written By:

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మంటలు ఇంకా ఆరకుండానే తగిలిన మరో ఎదురుదెబ్బతో శాంసంగ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.ఊహించని పరిణామానికి బిత్తరపోతోంది. ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 తో కోట్ల నష్టాలను మూటగట్టుకున్న కంపెనీ, ఇప్పుడు తనకు లాభాలు తెచ్చిపెట్టిన గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ కూడా పేలిపోయిందనే వార్తలతో తల్లడిల్లిపోతోంది. అదీగాక ఈ ఫోన్ గెలాక్సీ నోట్ 7కు రీ ప్లేస్ మెంట్ ఫోన్ కావడంతో కంపెనీ ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్

శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ పేలిపోయందని అక్కడి స్థానికి పత్రికలు వెల్లడించాయి. అమెరికాలోని ఓ వ్యక్తి ఈ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా పేలిపోయిందని 'ఫోన్ ఎరినా' పేర్కొంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒరిజినల్ చార్జర్ తో

ఒరిజినల్ చార్జర్ తో రాత్రంతా పెట్టడంతో ఫోన్ పేలిందని, ఈ ఘటనలో బాధితుడికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాలని తెలిపింది.

శాంసంగ్ నోట్ 7కు బదులుగా గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్

రెండు వారాల క్రితమే శాంసంగ్ నోట్ 7కు బదులుగా గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ తీసుకున్నాడని వెల్లడించింది. ఇందులో బ్యాటరీ సురక్షితమైందని కంపెనీ తనకు భరోసాయిచ్చిందని బాధితుడు చెప్పాడు.

శాంసంగ్ నోట్ 7 వినియోగదారులు

కాగా, శాంసంగ్ నోట్ 7 వినియోగదారులు అమెరికాలో పలుచోట్ల కోర్టుల్లో దావాలు వేశారు. 

తాము ఇబ్బందులకు

శాంసంగ్ నోట్ 7 మోడల్ ను నిలిపివేయడం.. ఈ ఫోన్లను మార్చుకోవాలని కోరడంతో తాము ఇబ్బందులకు, మానసిక కుంగుబాటుకు గురయ్యామని న్యాయస్థానాలను ఆశ్రయించారు.

పరిహారం చెల్లించాలని డిమాండ్

తమకు శాంసంగ్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గెలాక్సీ నోట్ 7 రేపిన మంటలతో శాంసంగ్ కు వచ్చే ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్లుపైగా నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
A Samsung Galaxy S7 Edge explodes while charging in the US read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot