కేవలం ఆడవారి కోసమే.. మగవారు ప్రవేశించ లేరు

Posted By: Prashanth

కేవలం ఆడవారి కోసమే.. మగవారు ప్రవేశించ లేరు

 

30 సంవత్సరాల వయసు కలిగిన ఓ కెనడియన్ స్త్రీ కేవలం ఆడవారి కోసం ప్రత్యేకంగా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. ఆమె ప్రారంభించిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ పేరు 'Luluvise.com'. ఈ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మగవారికి ఇందులో ప్రవేశం లేదు. ప్రపంచంలో ఉన్న వేరే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ ఫేస్‌బుక్, లింక్డ్ ఇన్ లాంటి వాటి నుండి కూడా ఈ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌కి కనెక్టు కావచ్చు.

ఈ నెట్ వర్క్‌ని బుధవారం అధికారకంగా విడుదల చేయగా, 69 దేశాల నుండి ఇందులో సుమారు 1,000 మంది వరకు భాగస్వాములు వరకు చేరడం జరిగింది. 'Luluvise.com' ఎకౌంట్ సృష్టికర్త అయిన అలెగ్జాండ్రా ఛాంగ్ మాట్లాడుతూ ఇందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ ఈజీగా ఉండేందుకు గాను ఫేస్‌బుక్‌కి సంబంధించిన యూజర్స్ డిటేల్స్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. 'Luluvise.com' వెబ్ సైట్‌లో యూజర్స్ పోస్ట్ చేసుకునే వాల్ కామెంట్స్ కానీ, పోస్టులు కానీ బయట వ్యక్తులకు తెలియకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇక్కడ నవ్వు వచ్చే విషయం ఏమిటంటే ఇందులో రిజస్టర్ కావాలని 500 పురుషులు ప్రయత్నించగా, వారు మెంబర్స్ కాలేరని సమాధానం వచ్చింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot