Home
News

ఆన్‌లైన్‌లో మందు కొనడానికి వెళ్లి RS.1.27లక్ష కోల్పోయిన మేధావి

ఆన్‌లైన్‌లో మద్యం కొనడానికి వెళ్లిన 40 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒక మోసగాడి చేతిలో సుమారు రూ.1.27 లక్షలు మోసపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని యలినహల్లి నివాసి అయిన అర్జున్ జగన్నాథన్ గత వారం చివరిలో తన ఇంట్లో జరుగుతున్న పార్టీ కోసం ఆన్‌లైన్‌ ద్వారా మద్యం కొనాలని ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగినట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 అవుట్ లెట్

పోలీసులకు తెలిపిన వివరాలలోకి వెళ్తే బెంగుళూరుకు చెందిన అర్జున్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీక్ ఎండ్ రోజున ఆన్‌లైన్‌లో ఇంటికి మద్యం పంపిణీ చేసే అవుట్ లెట్ల కోసం సెర్చ్ చేస్తున్నపుడు తన ఏరియా సమీపంలో ఒక నెంబర్ ను కనుగొన్నాడు. అతను ఆ నెంబర్ కు ఫోన్ చేసి మద్యంను సరఫరా చేయాలనీ కోరాడు.

 

ఆన్-డెలివరీ

మద్యం కోసం అవుట్‌లెట్‌లో గల నంబర్‌కు డయల్ చేసి తనను తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా జగన్నాథన్ పరిచయం చేసుకుని ఆర్డర్ తీసుకునే వ్యక్తితో మాట్లాడాడు. రూ.1,500 బిల్లుకు సమానమైన ఆర్డరును ఇచ్చాడు. డబ్బుల కోసం క్యాష్ ఆన్ డెలివరీ ఎంపిక లేదు అని తెలిపాడు. ఆన్-డెలివరీ ఎంపిక లేనందున హోమ్ డెలివరీ కోసం ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి ఆ వ్యక్తి తన అవుట్‌లెట్‌ వివరాలు తెలపాలని జగన్నాథన్‌ను కోరాడు. అతనిని నమ్ముతూ జగన్నాథన్ తన క్రెడిట్ కార్డు వివరాలను తెలిపాడు. పేమెంట్ ను పూర్తి చేయడానికి OTP ను షేర్ చేయవలసినదిగా కోరాడు. జగన్నాథన్ అన్ని రకాల వివరాలు తెలిపిన తరువాత అతడి మొబైల్ కు రూ.1,500 చెల్లించినట్లు మెసేజ్ వచ్చింది.

 

 

పేమెంట్

మోసగాడు అంతటితో ఆగకుండా పేమెంట్ లో సాంకేతిక సమస్య ఉందని చెప్పి తాను పంపిన తాజా OTP ని తెలపాలని జగన్నాథన్‌ను కోరాడు. జగన్నాథన్ OTP వివరాలను తెలపగానే తన అకౌంట్ నుండి రూ.6,000 డెబిట్ చేయబడినట్లు టెక్స్ట్ మెసేజ్ ను అందుకున్నాడు. మోసగాడు మళ్ళి అతనికి ఫోన్ చేసి ఇది మరొక సాంకేతిక లోపం అని పేర్కొన్నాడు. ఇప్పుడు తాజాగా పంపిన OTPను షేర్ చేయాలని కోరాడు. అతనికి తెలిపిన వెంటనే 78,742 రూపాయలు డెబిట్ అయినట్లు మరొక మెసేజ్ అందుకున్నాడు.

 

 

సాంకేతిక లోపాలపై

మోసగాడు జగన్నాథన్‌కు మరోసారి క్షమాపణలు చెప్పి సాంకేతిక లోపాలపై నిందించాడు. జగన్నాథన్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చాడు. అలా కాకపోతే వెంటనే కావాలి అనుకుంటే తన వాట్సాప్ కు పంపిన పేటీఎం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని కోరాడు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వెంటనే తాను కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పంపుతాను అని నమ్మబలికాడు.

 

 

అకౌంటు పెమెంట్స్

ఫోన్ కాలర్ మాటలు నమ్మిన జగన్నాథన్‌ నిస్సందేహంగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసాడు. అలా చేయగానే వెంటనే తన యుపిఐ-లింక్డ్ సేవింగ్స్ అకౌంట్ నుండి రూ.49,001 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. తరువాత జగన్నాథన్‌ మోసపోయినట్లు గ్రహించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. జగన్నాథన్‌ మోసపోయినట్లు గ్రహించిన వెంటనే తన అకౌంటు నుండి పెమెంట్స్ ఆపడానికి బ్లాక్ చేయడానికి బ్యాంకుకు ఫిర్యాదు చేసాడు. కాని వారు క్రెడిట్ కార్డు పెమెంట్స్ మరియు యుపిఐ లావాదేవీలను ఆపలేరని అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్

ఆన్‌లైన్ మనీ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎత్తిచూపిన దర్యాప్తు అధికారి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద పోలీసులు ఈ కేసును చేపట్టారని మోసగాడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మోసగాడి బ్యాంక్ ఖాతా జమ్మూ శాఖలో ఉందని అధికారులు తెలిపారు.

Best Mobiles in India

English summary
A Techie In Bengaluru Lost Rs. 1.27 lakh In A Fraud case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X