ఆధార్‌పై నాలుగు డెడ్‌లైన్లు, మిస్ అయితే మీకే నష్టం !
నాలుగింటికి ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కేంద్రం గడువునిచ్చింది. లేకుంటే బ్లాక్ అవుతాయట.
ఆధార్.. ఇప్పుడు చాలా పాపులర్ అయిన పదం. ప్రతి ఒక్కదానికి గుర్తింపు చిహ్నంగా దీనిని ఉపయోగిస్తున్నారు.. బ్యాంకు అకౌంట్లకు, సిమ్ కార్డులకు, పాన్ కార్డులకు ఇలా...చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి దీన్ని లింక్ చేసుకోవాలని లేకుంటే అవి పనిచేయవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా నాలుగింటికి ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కేంద్రం గడువునిచ్చింది. అవేంటో ఓ సారి చూడండి.

ఆధార్- పాన్ లింక్
2017 డిసెంబర్ 31 వరకు గడువు. ఈ గడవు దాటితే ఐటీ రిటర్న్స్ చెల్లవు

ఆధార్- సిమ్ కార్డు లింక్
2018 ఫిబ్రవరి 18 వరకు గడువు. దాటితే మీ సిమ్ కార్డులు చెల్లవు

ఆధార్- బ్యాంకు ఖాతాల లింక్
2017 డిసెంబర్ 31 వరకు గడువు, ఇది దాటితే మీ బ్యాంకు ఖాతాలు చెల్లవు.

ఆధార్- కేంద్ర సంక్షేమ పథకాల లింక్
2017 డిసెంబర్ 31 వరకు గడువు. ఇది దాటితే పెన్సన్, స్కాలర్ షిప్పులు, గ్యాస్ సబ్సిడీలు లభించవు.

ఆధార్- డ్రైవింగ్ లైసెన్స్ లింక్
దీనిపై ఇంకా డెడ్‌లైన్ విధించలేదు. కేంద్రం దీన్ని ఎలాగైనా ఆచరణలోకి తీసుకురావాలని భావిస్తోంది. అన్నీ కుదిరితే ఇది అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications