Home
News

ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి చివరి తేదీ మారింది! వివరాలు

మీ ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి గడువు తేదీని కేంద్రం ఇప్పుడు జూన్ 14 , 2024 వరకు పొడిగించింది. అంతకుముందు గడువు తేదీ మార్చి 14 వరకు ఉండేది. అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మంగళవారం ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని జూన్ 14 వరకు పొడిగించింది.

జూన్ 14 వరకు MyAadhaar పోర్టల్‌లో మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంటుందని UIDAI తెలిపింది. గడువు ముగిసిన తర్వాత ఆధార్‌ కార్డులోని వివరాలను అప్‌డేట్‌ (Aadhaar Update 2024) చేసేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

Aadhaar Card Free Update Deadline Extended To June 14  Here Are Complete Details

అయితే ప్రాథమిక వివరాలతోపాటు అన్ని వివరాలను మార్చుకొనే అవకాశం కల్పిస్తున్నారు. మీరు గత పదేళ్లనాటి వివరాలతోనే ఆధార్‌ కార్డును వినియోగిస్తుంటే.. అడ్రస్‌ సహా ఇతర గుర్తింపు పత్రాలను కూడా అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆధార్‌ కార్డు కేవలం గుర్తింపు కార్డుగానే కాకుండా అనేక నిత్యవసర సేవలు మరియు ఇతర ప్రయోజనాల కోసం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాల నుంచి ప్రభుత్వ పరమైన ప్రయోజనాలు, ప్రభుత్వం నుంచి సహాయం చేసేందుకు ఆధార్ కార్డును ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ కారణంగా ఆధార్‌ కార్డులో సరైన వివరాలు ఉండడం తప్పనిసరి.

ఆధార్‌ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్‌ చేయాలి?
* తొలుత ఆధార్‌ వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ( https://myaadhaar.uidai.gov.in/ ) అనంతరం ఆధార్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి.
* అనంతరం 'అప్‌డేట్‌ అడ్రస్‌'ను ఎంచుకోండి. మీ ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేయబడిన మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTP ను అక్కడ నమోదు చేయండి.
* తర్వాత అక్కడ కనిపించిన 'డాక్యుమెంట్‌ అప్‌డేట్‌' వద్ద క్లిక్‌ చేసి, మీ వివరాలను తనిఖీ చేసుకోవాలి.
* అనంతరం అక్కడ మీ గుర్తింపునకు చెందిన డాక్యుమెంట్లు మరియు అడ్రస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఎంచుకొని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
* ఈ డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసిన తర్వాత Submit బటన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఒక 14 అంకెల నంబర్‌ కనిపిస్తుంది. ఆ నంబర్‌ను వినియోగించి మీ ఆధార్‌ కార్డు వివరాల అప్‌డేట్‌ స్థితిని తెలుసుకోవచ్చు.

కేవలం myAadhaar పోర్టల్ లో మాత్రమే జూన్ 14 వరకు డాక్యుమెంట్ల ఆధార్ అప్‌డేట్‌లను ఉచితంగా అందిస్తుంది. ఈ సేవలు ఆధార్ కేంద్రాలలో ₹50 రుసుము తో ఆధార్ సెంటర్లలో కూడా అప్డేట్ చేయవచ్చు.

ఆధార్ సేవల కోసం ఎవరైనా ఆపరేటర్ ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే సస్పెండ్ చేయబడుతుందని మరియు అతనిని నియమించిన రిజిస్ట్రార్ కు ₹ 50,000 జరిమానాను విధిస్తారని గత సంవత్సరం ప్రభుత్వం తెలిపింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి.మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Aadhaar Card Free Update Deadline Extended To June 14. Here Are Complete Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X