ఆధార్ కార్డ్ మీకు ఉందా? అన్ని రకాల సేవలను ఇంటివద్దనుండే యాక్సెస్ చేయవచ్చు..

|

ఆధార్ కార్డును కలిగి ఉండడం అనేది ప్రస్తుతం చాలా ముఖ్యమైనది. అయితే ఇందులో ఏవైనా తప్పులు ఉంటే కనుక వాటిని సరిచేయడానికి అనేక రోజులు తిరుగుతూ ఉంటారు. అయితే ఆధార్ కార్డ్ హోల్డర్‌లు త్వరలో UIDAIకి సంబంధించిన అన్ని రకాల సేవలను తమ ఇంటి వద్ద నుండే పొందగలుగుతారు. సాధారణంగా ఆధార్ కార్డులోని ఏవైనా క్లిష్టమైన వివరాలను అప్‌డేట్ చేయడానికి లేదా ఆధార్ ని ఎన్‌రోల్ చేయడానికి మీరు మీ సమీపంలోని ఆధార్ కేంద్రం వద్దకు వెళుతూ ఉంటారు. ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి మీరు ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా UIDAI సేవలను మీ ఇంటి వద్దకే అందించేందుకు పని చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

UIDAI

ఆధార్ యొక్క సేవలను ఇంటి వద్దే అందించడానికి UIDAI తమ సిబ్బందికి శిక్షణను ఇస్తోంది. ఇంటింటికి ఆధార్ సేవలను అందించడం కోసం UIDAI తమ పోస్ట్‌మెన్‌లకు శిక్షణ ఇస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో పనిచేస్తున్న 48,000 మంది పోస్ట్‌మెన్‌లు ఆధార్ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కోసం శిక్షణ పొందుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సేవలలో ముఖ్యంగా మొబైల్ నంబర్‌కు ఆధార్‌ను లింక్ చేయడం, ప్రాథమిక వివరాలను అప్‌డేట్ చేయడం మరియు ఆధార్ డేటాబేస్‌లోకి పిల్లలను చేర్చడం వంటి సేవలను దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రజలకు పోస్ట్‌మెన్ సహాయకారిగా ఉంటాడు. ఈ సేవలు అన్ని కూడా ఆన్‌లైన్‌లో లేదా టెలిఫోనీ ద్వారా బుక్ చేయబడతాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు.

ఎయిర్‌టెల్ 1 సంవత్సరం లాంగ్ టర్మ్ ప్లాన్‌!! తక్కువ ధరలోనేఎయిర్‌టెల్ 1 సంవత్సరం లాంగ్ టర్మ్ ప్లాన్‌!! తక్కువ ధరలోనే

UIDAI డేటాబేస్‌

ఆధార్ యొక్క సేవలను అందించడానికి కొత్తగా శిక్షణ పొందిన సిబ్బందికి UIDAI డేటాబేస్‌లో నమోదులను నమోదు చేయడానికి లేదా సరిదిద్దడానికి అవసరమైన కొన్ని ప్రాథమిక పరికరాలను అందించనున్నది. ఆధార్ సేవలను అందించడానికి వారికి అవసరమయ్యే ల్యాప్‌టాప్ మరియు బయోమెట్రిక్ స్కానర్ వంటి హార్డ్‌వేర్ పరికరాలను అందించనున్నది. UIDAI ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క కామన్ సర్వీస్ సెంటర్‌తో పనిచేస్తున్న దాదాపు 13,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను కూడా ఈ విభాగంలోకి తీసుకురావచ్చు.

ఆపిల్ నుంచి 15-ఇంచ్ & 12-ఇంచ్ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్‌లు రానున్నాయిఆపిల్ నుంచి 15-ఇంచ్ & 12-ఇంచ్ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్‌లు రానున్నాయి

UIDAI సేవా కేంద్రాలు

ఇండియాలో ప్రస్తుతం మొత్తం 755 జిల్లాల్లో ఉన్న అన్ని ఆధార్ సర్వీస్ కేంద్రాలు కూడా అలాగే ఉంటాయి. అయితే సేకరణ పాయింట్ నుండి మెయిన్‌ఫ్రేమ్‌కు డేటాను సేకరించి అప్‌డేట్ చేయడానికి పోస్ట్‌మెంట్ కోసం ఈ కేంద్రాలు కేంద్రంగా పనిచేస్తాయి. ఇది త్వరగా అప్ డేట్లను అందించడమే కాకుండా నమోదు వేగాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటివరకు 72 నగరాల్లో 88 UIDAI సేవా కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం UIDAI కార్డ్ హోల్డర్ల కోసం కొన్ని ఆన్‌లైన్ సేవలను అందిస్తోంది. ఉదాహరణకు మీరు UIDAI వెబ్‌సైట్ నుండి ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. VID అనే టోకెన్ నంబర్‌ను జారీ చేస్తున్నప్పుడు మీ వ్యక్తిగత ఆధార్ డేటాను సురక్షితంగా ఉంచడానికి మీరు వర్చువల్ ID లేదా VIDని కూడా రూపొందించవచ్చు. మీరు ఆధార్ భౌతిక కేంద్రాలలో ఒకదానిని సందర్శించిన తర్వాత మీ సేవా అభ్యర్థనలను కూడా ట్రాక్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Aadhaar Card Users Very Soon Will be Able to All types of Services Can be Accessed From Home

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X