ఆధార్ సురక్షితం కాదు , బాంబు పేల్చిన ఎడ్వర్డ్ స్నోడెన్ !

Written By:

ఆధార్..ఇప్పుడు ఇండియాలో మార్మోగుతున్న పదం. ప్రతి పనికి ఇప్పుడు ఆధార్ ముఖ్యమైపోయింది. అన్ని రకాల పనులకు ఆధార్ ను గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే దీన్ని సులువుగా హ్యాక్ చేయవచ్చంటూ విజిల్ బ్లోయెర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఇండియా మీద ట్విట్టర్ బాంబు ప్రయోగించారు. ఇది అంత సురక్షితం కాదని తేల్చి చెప్పారు.

మళ్ళీ ఆ రెండింటికి ఝలక్, 2 రోజులకే జియో ప్లాన్లలో మార్పు, జోరులో అధినేత !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎడ్వర్డ్ స్నోడెన్..

ఎడ్వర్డ్ స్నోడెన్.. ఈ పేరు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును రట్టుచేసిన ఈ విజిల్ బ్లోయెర్ ఇప్పుడు ఆధార్‌ గోప్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను..

ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ వ్యాఖ్యలను ఖండిస్తూ వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్‌ చేయడం చాలా సులువని వెల్లడించారు.

 

డేటాహ్యాకింగ్‌కు గురి కావడం సాధారణ విషయమే..

ప్రజల డేటాను సురక్షితంగా ఉంచామని ప్రభుత్వాలు చెబుతుంటాయి, కానీ ఆ డేటాహ్యాకింగ్‌కు గురి కావడం సాధారణ విషయమే అన్నారు. చట్టాలు ఉన్నా, దుర్వినియోగాన్ని ఆపలేకపోయిందని చర్రిత చెబుతోందనంటూ కలవరాన్ని రేకెత్తిస్తున్నారు.

జాక్ విట్టేకర్ వ్యాఖ్యలకు స్నోడెన్ స్పందిస్తూ..

భారతదేశంలో ఆధార్ డాటాబేస్ ఉల్లంఘనపై సీబీఎస్‌ విలేఖరి జాక్ విట్టేకర్ వ్యాఖ్యలకు స్నోడెన్ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. వ్యక్తిగత జీవితాల సంపూర్ణ రికార్డులను తెలుసుకోవడం ప్రభుత్వాల సహజ ధోరణి అంటూ ఆధార్ గోప్యతను ప్రశ్నార్థకం చేశారు.

ఇటీవల్ ఆధార్ కార్డు వివరాలు..

కాగా ఇటీవల్ ఆధార్ కార్డు వివరాలు రూ.500కే అందిస్తామంటూ వచ్చిన నివేదికలు కలవరం రేపిన విషయం విదితమే. ట్రిబ్యూన్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో చాలాసులువుగా ఆధార్ డేటా వచ్చేస్తుందనే నిజాలు బయటకొచ్చాయి.

యూఐడీఏఐ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే..

కాగా ఈ విషయాన్ని ప్రభుత్వం, యూఐడీఏఐ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అలా ఎన్నటికీ జరగదని ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ స్పష్టం చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Aadhaar data breach: Despite UIDAI assurance, Edward Snowden warns Aadhaar not safe from 'government abuse' more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot