ఆధార్ నెంబర్, మీ వేలి ముద్ర చాలు!

దేశవ్యాప్తంగా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) త్వరలో ఆండ్రాయిడ్ ఆధారిత ఆధార్ ఎనేబిల్డ్ పేమెంట్ సిస్టం (AEPS)యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read More : నోకియా, రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌లలో AEPS యాప్‌

TCS సహాయంతో ఈ యాప్‌ను అభివృద్థి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ సౌలభ్యతతో కూడిన తమ స్మార్ట్‌ఫోన్‌లలో AEPS యాప్‌ను ఉపయోగించుకునే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం.

ఎటువంటి కార్డ్స్ అవసరం ఉండదు..

ఈ యాప్ ద్వారా జరిగే నగదు లావాదేవీలకు ఎటువంటి కార్డ్ నెంబర్స్ గానీ, పిన్ నెంబర్స్ గానీ అవసరం ఉండదు. వ్యాపారస్తులు, ఈ AEPS యాప్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నేరుగా తమ ఫోన్‌ల నుంచే నగదు లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్వైపింగ్ మిషన్లకు డిమాండ్..

దేశవ్యాప్తంగా నగదురహిత లావాదేవీలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్వైపింగ్ మిషన్లకు డిమాండ్ పెరిగింది. ఇంతే కాకుండా.. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ద్వారా లావాదేవీలు జరిపే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయలో పేటీఎమ్, ఫ్రీఛార్జ్, మొబీవిక్ వంటి మొబైల్ వాలెట్ యాప్‌లను ఉపయోగించుకునే వారిక సంక్య రెట్టింపు అయినట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ మార్గాల ద్వారా..

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వ శాఖలు సైతం పన్నులు, బిల్లులను ఆన్‌లైన్ మార్గాల ద్వారానే వసలూ చేయటం మొదలు పెట్టాయి.

నగదు రహిత లావాదేవీలు..

గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గ్రామీణాభివృద్థి శాఖ కూడా బ్యాంకులతో కలిసి ముందకు వెళుతోంది. గ్రామ పంచాయితీల్లో స్వైపింగ్ మెషీన్లను ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తోంది.

ఆధార్ కార్డ్ ఆధారంగా ఏటీఎమ్

ఆధార్ కార్డ్ ఆధారంగా ఏటీఎమ్ నుంచి డబ్బలు విత్‌డ్రా చేసుకునే సరికొత్త టెక్నాలజీని ఇటీవల ఓ బ్యాంక్ అందుబాటులోకి తీసుకువచ్చింది తెలిసిందే. ఈ ఆధార్ బేసిడ్ ఏటీఎమ్ సర్వీస్ ద్వారా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అలానే మీ ఫింగర్ ప్రింట్ (బయోమెట్రిక్)ను ఉపయోగించి మెచీన్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఏటీఎమ్ కార్డ్ అలానే పిన్ నెంబర్లతో అసలు పని ఉండదు.

డీసీబీ (డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్)

ఈ విప్లవాత్మక సర్వీసును తొలత డీసీబీ (డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్) ముంబైలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ 2016లో, ఈ సర్వీసును విజయవంతంగా పరీక్షించి చూసిన తరువాత ఒడిస్సా, పంజాబ్, బెంగుళూరు రాష్ట్రాలో ఈ ఏటీఎమ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి.

 

ఆధార్ కార్డ్ ఆధారంగా..

ఆధార్ కార్డ్ ఆధారంగా నగదును విత్ డ్రా చేసుకునే సదుపాయం ప్రస్తుతానికి DCB Bank ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏటీఎమ్ సర్వీసును ఉపయోగించుకునే క్రమంలో డీసీబీ బ్యాంక్ ఖాతాదారులు ముందుగా తమ ఆధార్ కార్డ్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోవల్సి ఉంటుంది.

12 అంకెల నెంబర్‌..

మెచీన్‌లో ముందుగా మీ ఆధార్ కార్డ్‌కు సంబంధించిన 12 అంకెల నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత మీ బయోమెట్రిక్ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్ రీడర్ పై వేలి ముద్రను ప్రెస్ చేసి కావల్సిన మొత్తంలో నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

డీసీబీ బ్యాంక్ తరహలో..

డీసీబీ బ్యాంక్ తరహలో అన్ని బ్యాంకులు ఆధార్ బేసిడ్ ఏటీఎమ్ మెచీన్లను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఆర్థిక లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించుకునే వీలుంటుంది. అంతేకాకుండా ప్రతిఒక్కరు సులువుగా ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. డీసీబీ బ్యాంక్ తరహాలోనే ఈ తరహా పరిజ్ఞానాన్ని మిగిలిన బ్యాంకులు కూడా త్వరగా అందిపుచ్చుకుని దేశవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షిద్దాం.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Aadhar-Enabled Payment System to Be Rolled Out Shortly. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot