Aadhaar Update ఆధార్ కార్డు వివరాలను ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా... అయితే ఈ విషయం మీకోసమే..?
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకొనే గడువును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరోసారి పొడిగించింది. గత సంవత్సర కాలం నుంచి అనేక సార్లు గడువును పొడిగించిన ఆధార్ ప్రాధికార సంస్థ.. తాజాగా మరో ఆరు నెలలపాటు పొడిగించింది. అయితే మై ఆధార్ వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని, అయితే ఆధార్ సేవా కేంద్రాల ద్వారా మాత్రం అప్‌డేట్ చేసుకొనేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
తాజాగా గడువు పొడిగింపుతో 2025 జూన్ 14 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (Aadhaar Update) ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. తాజా నిర్ణయం ద్వారా కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు మేలు జరుగుతుందని UIDAI తన సోషల్ మీడియా అకౌంట్‌ల ద్వారా తెలిపింది. ఆధార్ సేవా కేంద్రాల ద్వారా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

అయితే గత 10 సంవత్సరాలుగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయని (Aadhaar free update date extended) వాళ్లు కచ్చితంగా చేసుకోవాలని UIDAI సూచించింది. ప్రస్తుతం ఆధార్ కార్డులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఉపయోగిస్తున్నాయి.
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకొనే గడువును UIDAI ఇప్పటికే అనేక సార్లు పొడిగించింది. 2023 డిసెంబర్ 15 నుంచి మార్చి 14 వరకు తొలిసారి గడువును పొడిగించింది. అనంతరం 2024 జూన్ 14 వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అనంతరం సెప్టెంబర్ 14 మరియు డిసెంబర్ 14 వరకు గడువును పెంచింది. ప్రస్తుతం ఈ గడువును జూన్ 14 2025 వరకు పొడిగించింది.
ఉదాహరణకు ఆధార్ కార్డులోని అడ్రస్ వివరాలను అప్‌లోడ్ చేసేందుకు మై ఆధార్ వెబ్‌సైట్ మరియు ఆధార్ సేవా కేంద్రాల్లో ప్రస్తుతం అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం జూన్ 14 వ తేదీ వరకు మైఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే అందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డులోని పేరును జీవిత కాలంలో రెండు సార్లు మాత్రమే అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
స్టెప్ 1 : తొలుత http://myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.
స్టె్‌ప్ 2 : అనంతరం ఆధార్ నంబర్, OTP ని ఉపయోగించి లాగిన్ కావాలి.
స్టెప్ 3 : ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, జెండర్ వంటి వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.
స్టెప్ 4 : అనంతరం అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకొనేందుకు.. అక్కడున్న అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ (Update Aadhaar Online) పైన క్లిక్ చేయాలి.
స్టె్ప్ 5 : ఆ తర్వాత అనుమతించిన ఫార్మాట్‌లో అడ్రస్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 6 : ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు సర్వీస్ రిక్వస్ట్ (SRN) వస్తుంది. ఆ నంబర్ ద్వారా ఆధార్ అప్‌డేట్ పరిస్థితిని తెలుసుకోవచ్చు.
ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ విజ్ఞప్తులను వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 90 శాతం రిక్వెస్ట్‌లను తొలి 30 రోజుల్లోనే పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలోగా ఆధార్ కార్డులోని వివరాలు అప్‌డేట్ కాకుంటే 1947 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








