Home
News

ఆధార్‌ కొత్త యాప్‌ విడుదల.. మొబైల్ నంబర్‌ను ఇలా సులభంగా అప్‌డేట్‌ చేసుకోండి..!

Aadhaar New App : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ - ఉడాయ్‌ (UIDAI) నుంచి నిన్న (జనవరి 27) కీలక ప్రకటన చేసింది. ఆధార్‌ యాప్‌ కొత్త వెర్షన్‌ను జనవరి 28 వ తేదీన లాంచ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనకు అనుగుణంగానే ఆధార్‌ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఆధార్‌ కార్డులో మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకొనేందుకు ఆధార్‌ కేంద్రాలకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేది. తాజాగా వచ్చిన కొత్త వెర్షన్‌తో మొబైల్‌ నంబర్‌ను ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా సులభంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఇవాళ్టి నుంచే ఈ అవకాశం అందుబాటులోకి వచ్చినట్లు ఉడాయ్‌ తెలిపింది. ఉడాయ్‌ X హ్యాండిల్‌ లో ఈ వివరాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకొనేందుకు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది.

Aadhaar new app launched with mobile number update feature  full details

> ఆధార్‌ కొత్త యాప్‌ ద్వారా మొబైల్‌ నంబర్‌ను సులభంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.
> QR కోడ్‌ తో సులభంగా వెరిఫికేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు.
> సరైన ధ్రువీకరణ పత్రాలతో ఆధార్‌ కార్డుదారుని పేరు, అడ్రస్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.
> ఇతరుల ఆధార్‌ వెరిఫికేషన్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు.
> ఆధార్‌ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే డిజిటల్‌ రూపంలో వెరిఫికేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు.

ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ను ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలి :
> ఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి
> మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది.
> అనంతరం అప్‌డేట్‌, సర్వీసులపై క్లిక్‌ చేయాలి. తర్వాత My Aadhaar Update పైన క్లిక్‌ చేయాలి.
> ఆ తర్వాత మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ పైన క్లిక్‌ చేయాలి.
> అక్కడ కొత్త మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి.
> ఆ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ను నమోదు చేయాలి. అనంతరం వెరిఫై పైన క్లిక్‌ చేయాలి.
> అనంతరం ఫేస్‌ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
> ఫేస్‌ వెరిఫికేషన్‌ సమయంలో అక్కడ కనిపించిన సర్కిల్‌లో మీ ముఖం ఉండేలా చూసుకోవాలి.
> ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి, అంటే గ్రీన్‌ కలర్ సింబల్‌ వచ్చే వరకు ఫోన్‌ను స్థిరంగా ఉంచాలి.
> ఫేస్‌ వెరిఫికేషన్ పూర్తయ్యేక, మీకు పేమెంట్‌ పేజీ కనిపిస్తుంది.
> మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌కు సంబంధించిన పేమెంట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన వెర్షన్‌ దుర్వినియోగం కాకుండా ఉండేలా ఉడాయ్‌ అనేక చర్యలు తీసుకుంది. అంటే కొత్త మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయాలంటే. అప్పటికే మీ ఆధార్‌ లింక్‌ చేసి ఉన్న మొబైల్ నంబర్‌ కూడా యాక్టివ్‌గా ఉండాలి.

2 స్టెప్‌ వెరిఫికేషన్‌ :
ఆధార్‌ కార్డులోని మొబైల్‌ నంబర్‌ నంబర్‌ను లింక్‌ చేసేందుకు యూజర్లు 2 స్టెప్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే అప్పటికే లింక్‌ చేసి ఉన్న మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTP తోపాటు ఫేస్‌ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే, కొత్త మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Aadhaar new app launched with mobile number update feature, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X