అద్భుత అవకాశం:ఆధార్ కార్డు ద్వారా రూ.30 వేలు గెలుచుకోండి

By Gizbot Bureau
|

మీకు ఆధార్ కార్డు ఉందా. అయితే మీరు రూ. 30 వేల వరకు గెలుచుకోవచ్చు. ఈ అద్భుత అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది. ఇందుకు యూజర్లు చేయాల్సిందల్లా యూఐడీఏఐ నిర్వహించే మై ఆధార్ ఆన్‌లైన్ కంటెస్ట్‌లో పాల్గొనడమే..

అద్భుత అవకాశం:ఆధార్ కార్డు ద్వారా రూ.30 వేలు గెలుచుకోండి

 

ఎలా పాల్గొనాలి అందుకు కావాల్సిన అర్హతలు ఏంటి ఓ సారి చూద్దాం. దేశీ పౌరులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. విదేశాల్లో ఉన్న వారికి అవకాశం లేదు. జూన్ 9 వరకు ఈ కంటెస్ట్ నడుస్తుంది.

పోటీలో ఎలా పాల్గొనాలి?

పోటీలో ఎలా పాల్గొనాలి?

1 ఆధార్ డౌన్‌లోడ్

2 ఆధార్ అప్‌డేట్ స్టేటస్

3 లోకేట్ ఆధార్ కేంద్రం

4 ఆన్‌లైన్‌లో అడ్రస్ అప్‌డేట్

5 అడ్రస్ వాలిడేషన్ లెటర్ రిక్వెస్ట్

6 ఆధార్ అప్‌డేట్ హిస్టరీ

7 యూఐడీ, ఈఐడీ రికవరీ

8 ఆధార్ రిప్రింట్ ఆర్డర్

9 ఆధార్ లాక్, అన్‌లాక్

10 ఆధార్ అథంటికేషన్ హిస్టరీ

11 ఆధార్ ఆన్‌లైన్ వెరిఫికేషన్

12 మొబైల్ నెంబర్, ఈమెయిల్ వెరిఫికేషన్

13 వర్చువల్ ఐడీ జనరేషన్

14 బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్

15 ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్ స్టేటస్

షార్ట్ వీడియో

షార్ట్ వీడియో

పైన తెలిపిన అంశాలపై యూజర్లు షార్ట్ వీడియో తీసి యూఐడీఏఐకి పంపాలి. వీడియో 30 సెకన్ల నుంచి 120 సెకన్ల మధ్యలో ఉండాలి. ఒక వీడియోలో పైన పేర్కొన్న ఏదో ఒక అంశాన్ని మాత్రమే తెలియజేయాలి. యానిమేషన్ వీడియోలు కూడా చెయొచ్చు.

అప్‌లోడ్
 

అప్‌లోడ్

యూట్యూబ్‌ లేదా గూగుల్ డ్రైవ్ లేదా ఆన్‌లైన్ ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు తీసిన వీడియోని అప్‌లోడ్ చేయాలి. లింక్‌ను ఈమెయిల్ రూపంలో media.division@uidai.net.inకు పంపాలి. లింక్‌తోపాటు మీ ఆధార్ నెంబర్, సంప్రదించాల్సిన అడ్రస్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు కూడా అందించాలి.

ఆగస్ట్ 31 లోపు

ఆగస్ట్ 31 లోపు

పోటీలో గెలుపొందిన వారిని ఆగస్ట్ 31 లోపు ఈ-మెయిల్ రూపంలో యూఐడీఏఐ సంప్రదిస్తుంది. వారి నుంచి మీకు ఎలాంటి రిప్లే రాకపోతే మీరు పోటీలో ఓడినట్లు అర్ధం చేసుకోవాలి. అంతేకాని వారి నుంచి ఎలాంటి మెసేజ్ లు మీకు రావు.

 15 కేటగిరిలు

15 కేటగిరిలు

మొత్తం 15 కేటగిరిలు ఉన్నాయి. ప్రతి కేటగిరిలో టాప్ 3 వీడియోలకు బహుమతి ఇస్తారు. తొలి స్థానంలో ఉన్న వీడియోకి రూ.20,000, 2వ స్థానం వీడియోకి రూ.10,000, మూడో స్థానం వీడియోకి రూ.5,000 చెల్లిస్తారు. మళ్లీ 15 కేటగిరీలకు సంబందించిన వీడియోల్లో టాప్ 3 వాటికి మళ్లీ మనీ ఇస్తారు. తొలి స్థానంలోని వీడియోకి రూ.30,000, రెండో స్థానంలోని వీడియోకి రూ.20,000, మూడో స్థానం వీడియోకి రూ.10,000 అందజేస్తారు. ఆధార్‌‌తో లింకైన బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు వస్తాయి. విజేతలను సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
aadhaar online contest you can win up to rs 30000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X