బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయాల్సిందే, RBI,ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి

సవరించిన కెవైసి (Know your customer) మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ తప్పనిసరిగా జత చేయాల్సిందేనని భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ) స్పష్టం చేసింది.

|

సవరించిన కెవైసి (Know your customer) మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ తప్పనిసరిగా జత చేయాల్సిందేనని భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ) స్పష్టం చేసింది. అయితే ఇది సుప్రీం కోర్టు తుది ఆదేశాలకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఇప్పటిదాకా బ్యాంకు ఖాతాకు కస్టమర్‌ చిరునామాను ధృవీకరించే పత్రంతోపాటు శాశ్వత ఖాతా నెంబర్‌ (పాన్‌), పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో కెవైసి డాక్యుమెంట్లలో కీలకమైనవిగా ఉన్నాయి. ఇంతకు ముందు బ్యాంకులు కస్టమర్ల నుంచి ఆధార్‌ను తీసుకుని ఖాతాలకు అనుసంధానం చేశాయి. ఇందుకు ప్రభుత్వం తుది గడువును కూడా విధించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ గడువును పొడిగించారు. కానీ సవరించిన కస్టమర్ డ్యూ డెలిగెన్స్ (సీడీడీ) ప్రక్రియ అనుసరించి ఆధార్ నంబర్, పాన్ లేదా ఫాం నంబర్ 60 సైతం ముఖ్యమని ఆర్బీఐ సదరు ప్రకటనలో తెలిపింది. లింక్ విధానం గురించి ఓ సారి తెలుసుకోండి.

మీ ఇంటి దగ్గర నుంచే సిమ్ ఆధార్ వెరిఫికేషన్, IVR ద్వారా..మీ ఇంటి దగ్గర నుంచే సిమ్ ఆధార్ వెరిఫికేషన్, IVR ద్వారా..

మీ SBI అకౌంట్‌కి ఆధార్ అనుసంధానం చేయండిలా..( సింపుల్ ట్రిక్స్ )

మీ SBI అకౌంట్‌కి ఆధార్ అనుసంధానం చేయండిలా..( సింపుల్ ట్రిక్స్ )

ఆన్‌లైన్ ద్వారా ఆధార్ నమోదు
ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ క్లిక్ చేసి మీ యూజర్ నేమ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేశాక ఈ-సర్వీసుపై క్లిక్ చేయండి. అనంతరం ‘లింక్ యువర్ ఆధార్ నంబరు' లింక్ ను క్లిక్ చేసి ప్రొఫైల్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. అనంతరం ఆధార్ నంబరు ఎంటర్ చేస్తే మీ ఎస్బీఐ ఖాతాకు మీ ఆధార్ అనుసంధానం అవుతుంది.

ఎసెమ్మెస్ ద్వారా నమోదు

ఎసెమ్మెస్ ద్వారా నమోదు

మీ రిజిస్టర్ మొబైల్ నుంచి UID (space) Aadhaar number (space) Account number టైప్ చేస్తే మీకు ఓ మెసేజ్ వస్తుంది..అది వాలిడ్ అని ఉంటే మీ పని విజయవంతమయినట్లే..రిజిస్టర్ మొబైల్ నంబరు నుంచి మాత్రమే చేయాలి.

ఏటీమ్ ద్వారా నమోదు

ఏటీమ్ ద్వారా నమోదు

ఎస్ బిఐ ఏటీఎంలో మీ ఎటీఎం కార్డు స్వైప్ చేయగానే పిన్ అనే ఆప్సన్ వస్తుంది. అది ఎంటర్ చేసిన తరువాత "Service - Registrations"లో కెళ్లి Aadhaar Registration చేసుకోవచ్చు. అక్కడి మీకు వచ్చే సూచనలు ఫాలో కావాల్సి ఉంటుంది.

బ్రాంచ్ ల ద్వారా నమోదు

బ్రాంచ్ ల ద్వారా నమోదు

మీకు దగ్గరలో ఉన్న SBI బ్రాంచ్ కెళ్లి అక్కడ మీరు ఆధార్ కాపీ ఇస్తే సరిపోతుంది. అక్కడ ప్రాసెస్ పూర్తి కాగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

ఆన్ లైన్ లో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ గుర్తించడం ఎలా?

ఆన్ లైన్ లో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ గుర్తించడం ఎలా?

ఇండియాలో బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్లతో సహా 25,000కేంద్రాలు ఉన్నాయి. DIDAI వెబ్ సైట్ (https://uidai.gov.in/) ను ఫాలో అవ్వండి. మీకు కావాలసిన ఎన్రోల్మెంట్ సెంటర్ ను సెర్చ్ చేయవచ్చు. తర్వాత అప్ డేట్ సెంటర్స్ పై క్లిక్ చేయండి. మీరు మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిని ద్వారా మీరు సెర్చ్ చేయవచ్చు.

1.రాష్ట్రం నుంచి సెర్చ్ చేయడం.

2.పిన్ కోడ్ సహాయంతో సెర్చ్ చేయడం

3.సెర్చ్ బాక్స్ ను ఉపయోగించడం.

 

Search Criteria – State

Search Criteria – State

మీరు రాష్ట్రం నుంచి సెర్చ్ చేయడాన్ని సెలక్ట్ చేసుకున్నట్లయితే..మీరు రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్, VTC(గ్రామం, టౌన్, సిటీ) కావాల్సిన ఆప్షన్ సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. దీనికోసం డ్రాప్ డౌన్ మెను జాబితా కనిపిస్తుంది. పర్మినెంట్ సెంటర్స్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే..మీరు చెక్ బాక్స్ ను తనిఖీ చేయండి. పూర్తి చేసిన తర్వా...వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.

Search Criteria - Pin Code

Search Criteria - Pin Code

ఈ స్టెప్ చాలా సులభంగా ఉంటుంది. మీరు మీ పిన్ కోడ్ ద్వారా మీ ప్రాంతంలో ఆధార్ కేంద్రాన్ని గుర్తించవచ్చు. మీ లోకేషన్ను గుర్తించిన తర్వాత...వేరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి..సెర్చ్ పై క్లిక్ చేయండి. ఇఫ్పుడు పర్మినెంట్ కేంద్రాల గురించి మీరు వెతుకుతున్నట్లయితే...చెక్ బాక్స్ ను సెర్చ్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత...జీమ్యాప్స్ నుంచి లొకేషన్ తోపాటు కాంటాక్ట్ పర్సన్, ఫోన్ నెంబర్, అడ్రెస్ ను పొందుతారు.

Search Criteria - Search box

Search Criteria - Search box

పైన పేర్కొన్న వివరాల గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోయినట్లయితే...డైరెక్టుగా సెర్చ్ బాక్స్ కు వెళ్లి...నగరం పేరు లేదా మీ ప్రాంతాన్ని టైప్ చేయండి. ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పై క్లిక్ చేయండి. పర్మినెంట్ కేంద్రాల్లో మీరు వెతుకుతున్నట్లయితే...చెక్ బాక్స్ను సెర్చ్ చేయండి.

ఆధార్ కార్డ్ అడ్రస్ ఛేంజ్ చేయాలా? ఈ సింపుల్ టిప్స్‌తో మీరే సరిచేసుకోండి

ఆధార్ కార్డ్ అడ్రస్ ఛేంజ్ చేయాలా? ఈ సింపుల్ టిప్స్‌తో మీరే సరిచేసుకోండి

ముందుగా UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి Address Update Request (Online) ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓ కొత్త టాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ పేజీలోని ఇన్‌స్ట్రక్షన్స్‌ను పూర్తిగా చదువుకుని పేజీ క్రింది భాగంలో కనిపించే ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి. తరువాత ఓపెన్ అయ్యే మెనూలో మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే ఓ టెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే వన్‌‌టైమ్ పాస్‌వర్డ్ మీ మొబైల్ నెంబర్‌కు అందుతుంది.

ఫోన్‌కు అందిన ఓటీపీని ఎంటర్ చేయటం ద్వారా...

ఫోన్‌కు అందిన ఓటీపీని ఎంటర్ చేయటం ద్వారా...

ఫోన్ అందిన వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసినట్లయితే డేటా అప్‌డేట్ రిక్వెస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అడ్రస్ తాలూకా మార్పుచేర్పులను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ పేజీలోకి వెళతారు. ఇక్కడ అడ్రస్ ధృవీకరణకు అవసరమైన డాక్యుమెంట్ ప్రూఫ్‌‌‌‌ను మీరు అప్‌లోడ్ చేయవల్సి ఉంటుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా బీపీఓ సర్వీస్ ప్రొవైడర్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా ప్రొసీజర్ మొత్తం పూర్తవుతుంది.

మొబైల్ నెంబర్ మనుగడలో లేకపోయినట్లయితే..

మొబైల్ నెంబర్ మనుగడలో లేకపోయినట్లయితే..

ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది.

సబ్మిట్ చేసిన అప్లికేషన్‌ను ట్రాక్ చేసుకోవాలంటే

సబ్మిట్ చేసిన అప్లికేషన్‌ను ట్రాక్ చేసుకోవాలంటే

ఆన్‌లైన్ ద్వారా మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ వెరిఫికేషన్ అలానే అథెంటికేషన్ ప్రాసెస్‌లను ముగించుకున్న తరువాత UIDAI రికార్డులలో అప్‌డేట్ కాబడుతుంది. అప్ డేట్ అయిన వివరాలను https://ssup.uidai.gov.in/web/guest/check-status పేజీలోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఈ పేజీలో ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు.

ఆధార్ కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

ఆధార్ కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

ముందుగా https://eaadhaar.uidai.gov.in/ లింక్ ఓపెన్ చేయాలి. ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్‌వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Aadhaar Seeding Mandatory For Bank Accounts Under KYC, Says RBI. Five Things To Know more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X