మళ్లీ ఆధార్ వెరిఫికేషన్, వివరాలు చెప్పకపోతే

ప్రస్తుతం వినియోగంలో ఉన్న మొబైల్ నెంబర్లతో పాటు, భవిష్యత్ లో వినియోగంలోకి రాబోయే అన్ని మొబైల్ ఫోన్ నెంబర్లకు సంబంధించి ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేయాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం (DoT) టెలికం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Read More : మార్చి 31 కాదు ఏప్రిల్ 30 వరకు Jio Prime గడువు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

eKYC వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా..

ఆధార్ ఆధారిత eKYC వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్న అన్ని మొబైల్ కనెక్షన్‌లను మరోమారు పరిశీలించాలని టెలికం శాఖ కోరింది.

ఫిబ్రవరి 6, 2018 నాటికి పూర్తి చేయ్యాలి...

పోస్ట్‌పెయిడ్ చందాదారులతో పాటు ప్రీపెయిడ్ చందాదారుల మొబైల్ కనెక్షన్‌ల రీ-వెరిఫికేషన్‌ను eKYC ప్రాసెస్ ద్వారా ఫిబ్రవరి 6, 2018 నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్ట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రీ-వెరిఫికేషన్ సమాచారాన్ని...

టెల్కోలు ఆధార్ రీ-వెరిఫికేషన్ సమాచారాన్ని తమ చందాదారులకు మెసేజెస్ రూపంలో వాణిజ్య ప్రకటనలో రూపంలో తెలియజేయవచ్చు. సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విజయవంతమవ్వాలని కోరుకుందాం.

గతంలో కొత్త సిమ్ తీసుకోవాలంటే..

గతంలో కొత్త సిమ్ తీసుకోవాలంటే నానా తంటాలు పడాల్సి వచ్చేది. యూజర్‌కు సంబంధించిన ఫొటోతో పాటు సరైన ధ్రువీకరణ పత్రాలు క్లారిటీగా ఉంటేనే యాక్టివేషన్ ప్రక్రియ జరిగేది. ఈ తతంగా మొత్తం పూర్తి అయి, కనెక్షన్ యాక్టివేట్ అయ్యే పాటికి ఒకటి రెండు రోజులు పట్టేది.

రెండే నిమిషాల్లో సిమ్ యాక్టివేషన్ ..

కొత్తగా అందుబాటులోకి వచ్చిన eKYC వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా కేవలం రెండే నిమిషాల్లో సిమ్ యాక్టివేషన్ పక్రియ పూర్తవుతోంది. దాదాపుగా అన్ని టెల్కోలు ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చేసాయి. eKYC వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో ఓ సారి చూద్దాం..

టెల్కోల దగ్గర ఇప్పటికే eKYC టెక్నాలజీ..

ఎయిర్‌టెల్, రిలయన్స్, ఐడియా, వొడాఫోన్ వంటి ప్రముఖ టెలికం ఆపరేటర్లు ఇప్పటికే eKYC విధానాన్ని అమలు చేస్తున్నాయి. వినయోగారుడు కొత్త మొబైల్ కనెక్షన్ నిమిత్తం తన ఆధార్ కార్డును మాత్రమే తీసుకెళితే చాలు, సిమ్ రెండే నిమిషాల్లో యాక్టివేట్ అవుతుంది.

ఆధార్ కార్డు ఇవ్వగానే

అవుట్ లెట్‌లలో ఉన్న సిబ్బందికి ఆధార్ కార్డు ఇవ్వగానే వారి వద్ద ఉన్న ప్రత్యేక ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్ఫోన్లలో ఆధార్ నంబరును టైప్ చేస్తారు. ఆ వెంటనే వినియోగదారుడి వివరాలు ప్రత్యక్షమవుతాయి. కస్టమర్ వేలిముద్రలను వివరాలు ప్రత్యక్షం కాగానే మరో పరికరంలో కస్టమర్ వేలిముద్రలను సిబ్బంది తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియకు రెండు నుంచి మూడు నిమిషాల సమయం పడుతుంది.

తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండదు..

eKYC విధానంలో కొత్త సిమ్ దరఖాస్తు దాదాపు తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉండదని, దీంతో పాటు సిమ్‌లు పక్కదారి పట్టే అవకాశం కూడా ఉండదని కంపెనీలు చెబుతున్నాయి.

పనిభారం బాగా తగ్గింది..

ఈ-కేవైసీ వల్ల పనిభారం చాలా వరకు తగ్గిపోతుందని కంపెనీలు చెబుతున్నాయి. సరికొత్త విధానం వల్ల వచ్చే ఐదేళ్లలో టెలికం కంపెనీలకు రూ .10 వేల కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Aadhaar to be mandatory to buy mobile connections. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot