ఆధార్ అప్‌డేట్స్.. రేపటి నుంచి కొత్త రూల్స్.. పూర్తి వివరాలు..!
Aadhaar New Rules : ఆధార్ వివరాల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాల్లో లబ్దిదారులను ఎంపిక చేస్తున్నాయి. అందువల్ల ఆధార్ కార్డుల్లో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధార్ లో అనేక వివరాలను అప్‌డేట్ చేసుకొనేందుకు అనేక అవకాశాలు ఇచ్చింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. కొన్నింటి ఉచితంగా, మరికొన్ని వివరాలను అప్‌డేట్ చేసుకొనేందుకు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఆధార్‌లో డాక్యుమెంట్స్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకొనే గడువు 2026 జూన్ 14 వరకు ఉంది. అయితే నవంబర్ 1 నుంచి ఆధార్ సంస్థ (UIDAI - యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొన్ని మార్పులు చేయనుంది. ఫలితంగా మరింత సులభంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇవన్నీ ఆన్‌లైన్ ద్వారానే :
ఆధార్ వివరాలను చాలా వరకు ఆన్‌లైన్ ద్వారానే అప్‌డేట్ చేసుకొనే అవకాశం ఉంటుంది. పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి కార్డులతో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పేరు, పుట్టిన తేదీ. మొబైల్ నంబర్, అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.
అయితే ఐరిస్, వేలిముద్రల వంటి అప్‌డేట్ కోసం ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతోపాటు అప్‌డేట్ ఛార్జీల్లో మార్పులు వచ్చాయి. పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ ను అప్‌డేట్ చేయాలంటే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫోటో, ఐరిస్, వేలిముద్రలు అప్‌డేట్ కోసం రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే 5 నుంచి 7 సంవత్సరాలు, 15 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్నవారు బయోమెట్రిక్ వివరాలను ఉచితంగానే అప్‌డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్ లో డాక్యుమెంట్ అప్‌డేట్స్‌ను ఉచితంగా చేస్తుండగా.. జూన్ 14, 2026 తర్వాత ఇందుకోసం రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి :
పాన్‌కార్డులు కలిగి ఉన్న వారు డిసెంబర్ 31, 2025 నాటికి తమ పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే జనవరి 1, 2026 నుంచి పాన్‌కార్డులు పనిచేయవు.
KYC కోసం :
బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన KYC ప్రక్రియను ఆధార్ ద్వారా ఇక సులభంగా పూర్తి చేయవచ్చు. మొత్తంగా మూడు విధాలుగా కేవైసీని పూర్తి చేయవచ్చు. ఆధార్ ఓటీపీతోపాటుగా వీడియో ధ్రువీకరణ, ఫేస్ టు పేస్ ధ్రువీకరణ ఉన్నాయి.
* ఆధార్ కార్డుల్లో వివరాలను అప్‌డేట్ చేసుకొనేందుకు ఆధార్ ప్రాధికార సంస్థ అనేక అవకాశాలు ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేకసార్లు గడువును పొడిగించింది. తొలుత 2023 డిసెంబర్ 15 నుంచి 2024 మార్చి 14 వరకు తొలిసారి గడువును పొడిగించింది.
ఆ తర్వాత 2024 జూన్ 14 వ తేదీ వరకు ఉచిత అప్‌డేట్‌కు అవకాశం కల్పించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 వరకు ఈ గడువును పొడిగించింది. అనంతరం డిసెంబర్ 14, జూన్ 14 2025 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా డాక్యుమెంట్స్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకొనే గడువు.. 2026, జూన్ 14 వరకు ఉంది.


Click it and Unblock the Notifications








