సుప్రీంకోర్టు తీర్పుతో జియోకి దిమ్మతిరిగింది, పతనం దిశగా..
ప్రైవేట్ సంస్థలు, టెలికాం సర్వీసుల కంపెనీలు ఆధార్ డేటాను సేకరించడం తగదని, ఆయా కంపెనీలకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి కాదని రెండో రోజుల క్రితం సుప్రీం కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దేశ అత్యున్నత న్యాయస్థానం ఆధార్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ... ప్రైవేట్ సంస్థలు, టెలికాం సర్వీసుల కంపెనీలు ఆధార్ డేటాను సేకరించడం తగదని, ఆయా కంపెనీలకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి కాదని రెండో రోజుల క్రితం కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సెక్షన్ 33(2)ను, సెక్షన్ 57, 47లోని కొన్ని భాగాలను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కాగా ఈ తీర్పు టెలికాం మార్కెట్‌లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియోకు చెంపపెట్టులా మారింది. దీనికి కారణం లేకపోలేదు.

ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌తో...
జియో మార్కెట్‌లోకి ప్రవేశించిన సమయంలో, సులభతరమైన ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌తో క్షణాల్లో జియో సిమ్‌లను కస్టమర్లకు ఆఫర్ చేసింది.

జియో సిమ్ కార్డులు..
దీంతో కస్టమర్లకు జియో సిమ్ కార్డులు ఎంతో సులభంగా లభించాయి. ఫలితంగా యూజర్ల సంఖ్య కూడా జియోకు భారీగా పెరిగింది.

కొత్త కస్టమర్లను..
అప్పుడు మొదలైన జియో సంచలనం, ఇప్పటికీ మార్కెట్లో కొనసాగుతూనే ఉంది. కొత్త కస్టమర్లను వెంటవెంటనే యాడ్ చేసుకోవడంలో జియో ఎల్లప్పుడు ముందంజలో ఉంటూ వచ్చింది.

ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌ను..
ఇప్పుడు ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, జియోకు కొత్త కస్టమర్ల సంఖ్య భారీగానే పడిపోనుంది. వచ్చే నెలల్లో జియో కస్టమర్ల అడిక్షన్ బాగా తగ్గిపోనుందని విదేశీ బ్రోకరేజ్ విశ్లేషకుడు చెప్పారు.

సిమ్ కార్డు కొనుక్కోవాలంటే..
సిమ్ కార్డు కొనుక్కోవాలంటే, వెరిఫికేషన్ ప్రక్రియకు ఇక కస్టమర్లు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుందని, దీంతో అటు కస్టమర్లకు ఖర్చు కూడా పెరగనుందని తెలుస్తోంది.

స్టమర్లు జియోను ఎంపిక చేసుకునే ఆసక్తిని..
దీంతో కస్టమర్లు జియోను ఎంపిక చేసుకునే ఆసక్తిని కోల్పోతారని విశ్లేషకులు చెబుతున్నారు. జియోను విస్తరించడం కూడా ఆ కంపెనీకి క్లిష్టతరంగానే మారనుందని అంటున్నారు.

జియోకు మాత్రమే కాక..
కేవలం జియోకు మాత్రమే కాక, ఇతర కంపెనీలు పేటీఎం, మొబిక్విక్ లాంటి డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు, ఇతర థర్డ్ పార్టీ కంపెనీలకు కూడా సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదేనన్నారు.

ఆధార్ ఆధారిత అథెంటికేషన్ రద్దు
సుప్రీంకోర్టు పూర్తిగా ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌ను రద్దు చేయడంతో, ఆయా కంపెనీలకు కూడా ప్రతికూలంగా మారనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications