Home
News

ఆకాష్-3 (వాయిస్ కాలింగ్ సపోర్ట్‌తో)

By Prashanth
Aakash 3


ప్రపంచపు చవక ధర ట్యాబ్లెట్ ‘ఆకాష్’ కొత్త రూపును సంతరిచుకోనుంది. మూడవ తరం ఆకాష్ ట్యాబ్లెట్ మొబైల్ కాలింగ్ స్లిమ్‌స్లాట్ ఇంకా అధునాతన అప్లికేషన్‌లతో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వర్షన్ ట్యాబ్లెట్ ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వేగవంతమైన ప్రాసెసర్, లైనక్స్ ఇంకా ఆండ్రాయిడ్ సపోర్ట్, మెమరీ ఆప్షన్స్, సిమ్‌కార్డ్ స్లాట్ వంటి ప్రత్యేక స్పెసిఫికేషన్‌‌లను ఆకాష్-3లో చూడొచ్చు. ధర ఇంకా విడుదలకు సంబంధించి కీలక వివరాలు త్వరలో వెల్లడవతాయి.

ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆకాష్-2 స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై కనెక్టువిటీ,

3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

ఇండియా అధికారిక బడ్జెట్ టాబ్లెట్ ఆకాష్-2ను యూకే ఆధారిత సంస్థ డేటావిండ్ రూపొందించింది. విద్యార్థులకు ఈ ఆధునిక టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రత్యేక సబ్సిడీ పై రూ.1130కి విక్రయించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆకాష్-2 లభ్యంకానుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X