Aarogya Setu Appను ఉద్యోగులందరు డౌన్‌లోడ్‌ చేయాల్సిందే ...ప్రభుత్వ ఆదేశం

|

కరోనా వైరస్ లేదా కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడే ప్రయత్నాలలో భాగంగా ఇండియా ప్రభుత్వం గత నెలలో 'ఆరోగ్య సేతు' యాప్ ను కనుగొన్నది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ , ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించడం తప్పనిసరి చేసింది. అలాగే COVID -19 నిరోధక మండలాల్లో నివసించే ప్రజలు తప్పనిసరిగా ఈ మొబైల్ అప్లికేషన్ ను వాడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా వైరస్ లాక్ డౌన్

కరోనా వైరస్ లాక్ డౌన్

కరోనా వైరస్ కారణంగా మార్చి చివరి వారంలో మొదటి సారిగా ఇండియా మొత్తాన్ని లాక్ డౌన్ గా ప్రకటించారు. ఇప్పటికీ లాక్ డౌన్ ను రెండు సార్లు పొడిగించిన ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సర్దుబాటులతో లాక్ డౌన్ ను మళ్ళి మే 17 వరకు పొడిగించింది. కొంత మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులను బయట తిరిగి వారి యొక్క పనులను చేయడానికి అనుమతిని ఇచ్చింది. కాకపోతే బయట తిరుగుతున్న ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లలో "ఆరోగ్యా సేతు" యాప్ ను ఖచ్చితంగా వాడాలని నిబంధనలను ఉంచింది.

క్యాటగిరి జోన్

క్యాటగిరి జోన్

ఇండియాలోని అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలను మూడు రకాల క్యాటగిరిలుగా విభజించారు. ఇందులో కరోనా బాధితుల సంఖ్య అధికంగా ఉన్న వాటిని రెడ్ జోన్ గా మరియు తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులను కలిగిన జిల్లాలను ఆరంజ్ జోన్ గాను చివరిగా ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని వాటిని గ్రీన్ జోన్ గా విభజించారు. రెడ్ జోన్ గల ప్రాంతాలలో పూర్తిగా లాక్ డౌన్ అమలవుతుంది. అలాగే ఆరంజ్ జోన్ గల ప్రాంతంలో ఉదయం 11 గంటల వరకు అన్ని రకాల అవసరాల కోసం తిరగడానికి అనుమతి ఉంటుంది. చివరిగా గ్రీన్ జోన్ గల ప్రాంతంలో సజావుగా తిరగడానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుత సమయంలో ఎటువంటి జోన్ లలో అయిన సరే మనుషుల మధ్య దూరంను పాటించాలని ప్రభుత్వం సూచించింది.

ఆరోగ్యా సేతు మొబైల్ యాప్

ఆరోగ్యా సేతు మొబైల్ యాప్

ఆరోగ్యా సేతు మొబైల్ యాప్ ప్రైవేట్ మరియు పబ్లిక్ ఉద్యోగులందరికీ తప్పనిసరి అవుతుంది. ఉద్యోగులలో ఈ అనువర్తనం యొక్క 100% కవరేజీని నిర్ధారించడం సంబంధిత సంస్థల అధిపతి యొక్క బాధ్యత" అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతుకుముందు మే 3 వరకు ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని రకాల సడలింపులతో మరొక రెండు వారాల పాటు పొడిగించింది.

ఆరోగ్యా సేతు యాప్ ఫీచర్స్

ఆరోగ్యా సేతు యాప్ ఫీచర్స్

దేశంలో COVID-19 యొక్క వ్యాప్తిని తెలుసుకోవడానికి ఆరోగ్యా సేతు యాప్ దాని విధులను నిర్వర్తించడానికి వినియోగదారులు బ్లూటూత్ మరియు లొకేషన్ యాక్సిస్ ను అందించాలి. కరోనావైరస్ యొక్క ప్రమాదం ఉందో లేదో గుర్తించడానికి ఇది వినియోగదారులకు ప్రశ్నల సమితిని అడుగుతుంది. వినియోగదారుల సమాధానాలను బట్టి COVID-19 పాజిటివ్‌ను పరీక్షించిన వారితో కలిసినట్లయితే వారికి తెలియజేస్తుంది. అలాగే ఇది కరోనావైరస్ సంక్రమణను నివారించే మార్గాలు మరియు దాని లక్షణాలతో సహా ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తుంది .

ఆరోగ్యా సేతు యాప్ ఇన్‌స్టాల్‌ల సంఖ్య ‌

ఆరోగ్యా సేతు యాప్ ఇన్‌స్టాల్‌ల సంఖ్య ‌

ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్యా సేతు యాప్ ప్రారంభించిన 13 రోజుల్లోనే ఐదు కోట్ల మంది వినియోగదారుల మైలురాయిని చేరుకుంది. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి పరిమితం చేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్‌ను ఎనేబుల్ చేసే ఈ యాప్ ఏప్రిల్ 2 న విడుదలైంది. ఈ యాప్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే 50 లక్షల ఇన్‌స్టాల్‌ల మైలురాయిని దాటింది.

Best Mobiles in India

English summary
Aarogya Setu App compulsory For All Employees : Governament Announced

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X