ఇండియాకి 155మిలియన్ డాలర్ల అధీకృత ధనం..

Posted By: Staff

ఇండియాకి 155మిలియన్ డాలర్ల అధీకృత ధనం..

గ్లోబల్ వెంచర్ సంస్ద అయిన 'ఏసెల్ పాట్నర్స్' ఇండియాలో 155 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. మూడు సంవత్సరాల క్రితం ఏసెల్ ఇండియా వెంచర్ ఫండ్ II పేరు మీద 60 మిలియన్ డాలర్లను పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. 'ఏసెల్ పాట్నర్స్' నార్త్ అమెరికా, యూరప్, ఆసియాలో ఉన్న టాప్ సంస్దలలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, డిజిటల్ మీడియా, ఇంటర్నెట్ సర్వీసెస్, ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీస్, మొబైల్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ మొదలగున రంగాలలో పెట్టుబడులు పెట్టడం జరిగింది.

ఇండియా మొత్తం మీద 'ఏసెల్ పాట్నర్స్' 34 కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇక 'ఏసెల్ పాట్నర్స్' విషయానికి వస్తే 1983లో ప్రారంభించడం జరిగింది. 'ఏసెల్ పాట్నర్స్'లలో ప్రముఖ కంపెనీలు డ్రాప్ బాక్స్, ఫేస్‌‌‌‌బుక్, గ్రూపాన్, కయాక్, మాడ్‌క్లోత్, స్పోటిపై లాంటివి కేటిగిలకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. అదే ఇండియా విషయానికి వస్తే ఇంటర్నెట్ కంపెనీలైన ప్లిఫ్‌కార్ట్, మైంత్రా, లెట్స్‌బై, హెల్త్ కేర్ మ్యాజిక్, సుబ్రతా మిత్రా లాంటివి భాగస్వాములుగా ఉన్నారు.

ఇండియాకు సంబంధించిన పదకొండు మంది పెట్టుబడిదారులు ఇందులో పాట్నర్స్‌గా కొనసాగుతున్నారు. వారిలో మనం ముఖ్యంగా చూసినట్లైతే మహేంద్రన్ బాలచంద్రన్, శేఖర్ కిరానీ, సుబ్రతా మిత్రా, ప్రశాంత్ ప్రకాష్ మొదలగున వారు ముఖ్యులు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈక్విటీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న పెట్టుబడిదారులలో 'ఏసెల్ పాట్నర్స్' ఒకటి. ఇటీవలే 'ఏసెల్ పాట్నర్స్' అమెరికా, జర్మనీ, ప్రాన్స్, ఫిల్ ల్యాండ్, రష్యా, చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ లాంటి దేశాలలో పెట్టుబడులు పెట్టడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot