వాహనదారులకు శుభవార్త, ఇకపై ఎల‌క్ట్రానిక్ ఫార్మాట్‌లో డాక్యుమెంట్లు

|

యూనియ్ ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ వాహనదారులకు శుభవార్తను అందించింది. వాహనాదారులకు ఇకపై ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అంగీకరించాలని కోరింది. డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఇతర డాక్యుమెంట్లు, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫ్ కేట్స్ లాంటివి ఇకపై పేపర్ ద్వారా కాకుండా ఎల‌క్ర్టానిక్ ఫార్మాట్‌లో enforcement agencies ద్వారా చేపట్టాలని కోరింది. దీని ద్వారా వాహనాదారులకు మరింత ఊరట కలగనుంది.

మళ్ళీ దుమ్ము రేపిన జియో

కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ
 

కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ

ఎల‌క్ట్రానిక్ ఫార్మాట్‌లో డ్రైవింగ్ లైసెన్సు, ఇత‌ర ప‌త్రాల‌ను అంగీక‌రించే సౌల‌భ్యం క‌ల్పించాల‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. ఈ మేర‌కు రాష్ట్రాల‌కు ఒక స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసిజిర్‌ను మంత్రిత్వ‌శాఖ జారీ చేసింది.

Digilocker లేక mParivahan app

Digilocker లేక mParivahan app

వాహ‌నాల య‌జ‌మానులు త‌మ డ్రైవింగ్ లైసెన్స్‌, ఆర్సీ, బీమా స‌ర్టిఫికెట్ లాంటివి Digilocker లేక mParivahan app వంటి మొబైల్ యాప్‌లో చూపించ‌వ‌చ్చ‌ని పేర్కొంది.

Digilocker లేక mParivahan app

Digilocker లేక mParivahan app

ఈ- చ‌లాన్ యాప్‌లో ఈ వివ‌రాల‌ను ట్రాఫిక్ ర‌వాణా సంస్థ‌లు అధికారిక సంస్థ‌లు ఏక కాలంలో అందుబాటులో ఉంచ‌వ‌చ్చు. వాహ‌నాలు, వాటి లైసెన్స్ స్టేట‌స్ వంటి స‌మాచారం ఆన్‌లైన్లో ప‌రిశీలించ‌వ‌చ్చు.

ఆన్‌లైన్లో ప‌రిశీలించ‌డానికి

ఆన్‌లైన్లో ప‌రిశీలించ‌డానికి

ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థ‌లు ఈ ప‌త్రాల‌ను భౌతికంగా ప‌రిశీలించ‌డానికి బ‌దులు ఆన్‌లైన్లో ప‌రిశీలించ‌డానికి వీలుప‌డాల‌నే లక్ష్యంతో ఈ చ‌ర్య తీసుకుంటున్న‌ట్లు మంత్రిత్వ‌శాఖ తెలిపింది.

వాహనాదారులకు ఊరట
 

వాహనాదారులకు ఊరట

ఈ రకమైన నిర్ణయం ద్వారా వాహనాదారులకు భారీ ఊరట కలగనుంది. ఇకపై పత్రాలను వారు వెంట తీసుకెళ్లనవసరం లేదు. ప్రభుత్వం ప్రకటించిన యాప్ ల ద్వారా ఈ పత్రాలను వారికి చూపించవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆప్ లైన్ వెరిఫికేషన్

ఆప్ లైన్ వెరిఫికేషన్

ఈ యాప్ ల ద్వారా ఆఫ్ లైన్ వెరిఫికేషన్ కూడా అందుబాటులో ఉంది. క్యూ ఆఱ్ కోడ్ ద్వారా mParivahan appలో వాహనదారుల వివరాలు అందుబాటులో ఉంటాయి. కాగా సాధారన మొబైల్ యాప్ లను ఈ పద్దతికి enforcement agencies వాడుతున్నాయి. అయితే రాష్ట్రాలు ఈ డేటాను ఎంత వరకు సేఫ్ గా ఉంచుతాయనే దాని మీద చర్చలు నడుస్తున్నట్లు సమాచారం.

Most Read Articles
Best Mobiles in India

English summary
Accept vehicle documents, driving licence in electronic format: Centre asks states more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X