గూగుల్ కొత్త సర్వీస్ 'ఎకౌంట్ యాక్టివిటీ టూల్' గురించి తెలుసా..!

Posted By: Super

గూగుల్ కొత్త సర్వీస్ 'ఎకౌంట్ యాక్టివిటీ టూల్' గురించి తెలుసా..!

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్త సర్వీస్‌ని ప్రారంభించింది దాని పేరే 'గూగుల్ ఎకౌంట్ యాక్టివిటీ'. ఈ గూగుల్ ఎకౌంట్ యాక్టివిటీ టూల్ సహాయంతో వెబ్ హిస్టరీలో ప్రతి నెలా మీరు ఎన్ని మెయిల్స్‌ని పంపుతున్నారు లేదా రిసీవ్ చేసుకుంటున్నారనే విషయాలను కూలంకుషంగా తెలుసుకోవచ్చు. మీ గూగుల్ ఎకౌంట్‌ని ఏవిధంగా ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గూగుల్ ఈమెయిల్ ద్వారా అందిస్తుంది. వీటితో పాటు గూగుల్ ఇతర సర్వీసులైన యూట్యూబ్ లలో మీయొక్క ఎకౌంట్ యాక్టివిటీని చెక్ చేయవచ్చు.

గూగుల్ ఈ టూల్‌ని విడుదల చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం యూజర్స్ వారియొక్క గూగుల్ ఎకౌంట్‌ని ఏవిధంగా ఉపయోగిస్తున్నారో తెసుకునేందుకేనని గూగుల్ ప్రతినిధి తెలిపారు. గూగుల్ యూజర్ ఖాతాలు రోజుకీ వేల సంఖ్యంలో హ్యాక్ చేయకుండా కాపాడేందుకు ఇదోక ముఖ్యమైన భద్రత విషయం. మీ ఎకౌంట్‌ని మీకు తెలియకుండా వేరే దేశంలో ఎవరైనా ఉపయోగిస్తుంటే.. ఈ ఎకౌంట్ యాక్టివిటీ టూల్ ద్వారా వెంటనే మీయొక్క పాస్‌వర్డ్‌ని మార్చుకోవచ్చు.

ఇంటర్నెట్లో ప్రతి రోజూ మీరు బ్రౌజ్ చేసే వెబ్ హిస్టరీని కూడా ఈ టూల్ ద్వారా చెక్ చేయవచ్చు. మీ ఎకౌంట్‌లో మరింత వివరణాత్మక సమాచారం కోసం, డాష్ బోర్డులో సైన్ ఇన్ అవ్వండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot