TSPSC లీకేజీ కేసు.. ChatGPT ద్వారా పరీక్షలు రాసిన నిందితులు..!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సహా మరిన్ని పరీక్షల లీకేజీ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక విషయాన్ని బయటపెట్టింది. నిందితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ChatGPT సాయంతో పరీక్షలు రాసినట్లు గుర్తించినట్లు తెలిపింది.
ప్రశ్నాపత్రాల లేకేజీ కేసులో భాగంగా తెలంగాణ స్టేట్ నార్తన్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెద్దపల్లి జిల్లా డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పూల రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన సిట్.. కొందరు నిందితులు చాట్‌జీపీటీ ఆధారంగా పరీక్ష రాసినట్లు తెలిపింది.

సిట్ తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన కొన్ని పరీక్షల్లో మూడింటికి సంబంధించిన ప్రశ్నాపత్రాలను పూల రమేష్ సంపాదించాడు. అందులో రెండు పరీక్షలకు చాట్‌జీపీటీ ద్వారా సమాధానాలను సేకరించిన, పరీక్ష కేంద్రాల్లోని అభ్యర్థులకు చేరవేశాడు.
జనవరి 22 మరియు ఫిబ్రవరి 26న టీఎస్‌పీఎస్సీ రెండు పరీక్షలకు నిర్వహించింది. డివిజనల్ ఇంజినీర్ రమేష్ సుమారు ఏడుగురు అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారందరికి బ్లూటూత్ మైక్రోఫోన్లు అందించారు. వాటిని బెల్టుల్లో పెట్టుకొని పరీక్ష కేంద్రంలోని వెళ్లారు. పరీక్ష కేంద్రంలోని ఓ వ్యక్తి ద్వారా పరీక్ష ప్రారంభానికి సుమారు 10 నిమిషాల ముందు ప్రశ్నా పత్రాల ఫోటోలను రమేష్ సంపాదించారు.
మరో నలుగురు అనుచరులతో మరోచోట కూర్చొని.. ChatGPT ద్వారా సమాధానాలు వెతికి, వారికి బ్లూటూత్ మైక్రో ఫోన్ ద్వారా సమాధానాలు చేరవేసినట్లు.. సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఇందుకోసం ఒక్కక్కరి దగ్గర నుంచి సుమారు రూ.40 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.
టీఎస్‌పీఎస్సీ మార్చి 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పరీక్షలు చాట్‌జీపీటీని వినియోగించలేదని సిట్ తెలిపింది. ఆ పరీక్షలు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన బంధువు అయిన పూల రవికిషోర్ నుంచి ముందస్తుగానే సంపాదించినట్లు సిట్ అధికారులు వెల్లడించారు.
అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రాన్ని సుమారు 30 మందిపైగా అభ్యర్థులకు విక్రయించినట్లు మరియు ఒక్కక్కరి నుంచి సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సహా 35 మంది నుంచి సుమారు రూ.10 కోట్ల సంపాదించాలని పూల రమేష్ ఆశించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తెలిపారు. కానీ లీకేజీ స్కాం బయటపడడంతో రమేష్‌కు కేవలం రూ.1.1 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు.
గత సంవత్సరం చివర్లో ఓపెన్ ఏఐ స్టార్టప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీని లాంచ్ చేసింది. ఏఐ రంగంలో ఇదో కీలక మలుపుగా నిపుణులు భావిస్తారు. తాజాగా జరిగిన మైక్రోసాఫ్ట్ వార్షిక సమావేశంలో బింగ్ సెర్ట్ ఇంజిన్‌ను చాట్‌జీపీటీకి అనుసంధానం చేశారు. ఫలితంగా బింగ్ కూడా రియల్‌టైం యాక్సెస్‌తో సమాచారం అందించగలుగుతుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








