ఆపిల్ ఐప్యాడ్ 2కి పోటీగా ఏసర్ హానీకొంబ్ టాబ్లెట్ ఏ500

Posted By: Super

ఆపిల్ ఐప్యాడ్ 2కి పోటీగా ఏసర్ హానీకొంబ్ టాబ్లెట్ ఏ500

ప్రపంచంలో ఉన్న లీడింగ్ కంప్యూటర్ల తయారీ సంస్ద ఏసర్ తన మొట్టమొదటి 10-ఇంచ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ని ఇండియాలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనితో పాటు ఏసర్ కంపెనీ వేరే ఐకానిక్ ప్రోడక్ట్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇండియాలో ఇప్పటికే ఆపిల్ కంపెనీ ఐప్యాడ్ 2ని విడుదల చేసి హాల్‌చల్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆపిల్ ఐప్యాడ్ 2కి పోటీగా ఏసర్ కంపెనీ ఆండ్రాయిట్ 3.0 హానీ కొంబ్ టాబ్లెట్‌ని ఇండియాలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

త్వరలో ఇండియాలో విడుదల చేయనున్న ఐకానిక్ టాబ్లెట్ ఏ500, 10.1 ఇంచ్ డిప్లే టచ్ స్క్రీన్ కలిగిఉండి, 1280 X 800 పిక్సల్ రిజల్యూషన్ ఉంటుందన్నారు. ఇంత పెద్దగా ఉన్నటువంటి స్క్రీన్ వల్ల ఉపయోగం ఏమిటంటే ఎంటర్టైన్మెంట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఏ500 చుట్టూ ఉన్నటువంటి అల్యూమినియమ్ మెటాలిక్ ఫినిషింగ్ ఇండియాలో ఇప్పటివరకు విడుదలైనటువంటి ఏటాబ్లెట్‌లో కూడా లేక పోవడం విశేషం.

ఆండ్రాయిడ్ 3.0 హానీకొంబ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగినటువంటి ఈ టాబ్లెట్ 1 GHz NVIDIA Tegra dual core processorని కలిగి ఉంటుంది. ఇంత పవర్‌పుల్ ప్రాసెసర్‌ని వాడడం వల్ల అప్లికేషన్స్ చాలా ఈజీగా రన్ అవుతాయి. మోటరోలా జూమ్ టాబ్లెట్ మాదిరే దీనికి కూడా రెండు కెమెరాలు కలిగి ఉంటుంది. ఇక వెనుక భాగాన ఉన్నటువంటి కెమెరా 5మెగా ఫిక్సల్ కెమెరాతోపాటు, ఎల్‌ఈడి ప్లాష్‌ని కూడా కలిగి ఉంటుంది. ఇక ముందు భాగాన ఉన్న కెమెరా 2మెగా ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే రూ 27,990 మాత్రమే.

Acer Iconia Tab A500 Specifications & Features:

* 10.1 inch touchscreen display with 1280 X 800 resolution
* Android 3.0 Honeycomb OS
* 1 GHz NVIDIA Tegra dual core processor
* 5 MP rear camera with flash
* 2 MP front-facing camera
* Dolby Mobile technology audio
* WiFi 802.11 b/g/n
* Bluetooth 2.1
* Adobe Flash 10.1 support
* HDMI port
* 3.5mm Audio Jack
* 16 GB internal memory
* 32 GB memory expansion
* Li-polymer battery

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot