ఇండియాలో లాంచ్ అయిన ఏసర్ క్రోమ్‌బుక్ 314: ధరల వివరాలు

|

IFA 2019 ముందు ఎసెర్ సంస్థ విద్యార్థులు మరియు చిన్న వ్యాపార యజమానుల కోసం తన కొత్త 'క్రోమ్‌బుక్ 314' ను విడుదల చేసింది. కొత్త ఎసెర్ క్రోమ్‌బుక్ 314 (CB314-1H/1HT) 14-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది మరియు ఫుల్-హెచ్‌డి (1920 x 1080 రిజల్యూషన్) IPS డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇది టచ్ మరియు నాన్-టచ్ వంటి రెండు మోడళ్లలో లభిస్తుంది. ఈ నోట్బుక్ పెద్ద డిస్ప్లేతో చుట్టూ సన్నని బెజెల్స్‌తో కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది అని కంపెనీ పేర్కొంది.

 

Chromebook

డేటాను సురక్షితంగా ఉంచడానికి ఏసర్ క్రోమ్‌బుక్ వినియోగదారులను అనేక రకాల సైన్-ఆన్‌కు మద్దతు ఇస్తాయి. కుటుంబ సభ్యులు కూడా దీనిని లాగిన్ చేయవచ్చు మరియు వారి ప్రాజెక్టులను నిర్ధారించడానికి వారి ప్రత్యేక ఖాతాల్లోకి లాగిన్ అవ్వవచ్చు. Chromebook పాడైపోయినా లేదా దొంగిలించబడినా Gmail అకౌంట్ నుండి వారి డేటాను తిరిగి పొందడానికి డేటాను సురక్షితంగా ఉంచబడుతుంది అని ఏసర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

ధర వివరాలు

ధర వివరాలు

కొత్త ఎసెర్ క్రోమ్‌బుక్ 314 (CB314-1H/1HT) 2019 డిసెంబర్ నుండి భారతదేశంలో 42,000 రూపాయల వద్ద లభిస్తుంది. ప్రాంతానికి అనుగుణంగా ఖచ్చితమైన లక్షణాలు, ధరలు మరియు లభ్యత మారుతూ ఉంటాయి.

స్పెసిఫికేషన్స్
 

క్రోమ్‌బుక్ 314 ఫుల్-HD (1920 x 1080 రిజల్యూషన్) IPS డిస్ప్లే తో మరియు 14-అంగుళాల రిజల్యూషన్‌తో టచ్ మరియు నాన్-టచ్ డిస్ప్లేలతో వస్తుంది. ఇవి సరికొత్త డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ N4100 లేదా క్వాడ్-కోర్ ఇంటెల్ సెలెరాన్ N4100 ప్రాసెసర్‌లను అందిస్తాయి. ఇందులో 128GB eMMC స్టోరేజ్‌తో మరియు 8 జిబి డ్యూయల్-ఛానల్ SDRAMతో కాన్ఫిగర్ చేయబడి ఉంది.

కనెక్టివిటీ

కొత్త ఎసెర్ క్రోమ్‌బుక్ 314 లో రెండు USB 3.1 ప్రతి వైపు ఒకటి Type-C జెన్ 1 పోర్ట్‌లు ఉన్నాయి . ఈ పోర్టులు పరికరాన్ని ఛార్జ్ చేయడానికి అలాగే డేటా బదిలీ మరియు కనెక్టివిటీకి కూడా ఉపయోగపడతాయి. అదనంగా నోట్బుక్ రెండు USB 3.1 పోర్టులను మరియు మైక్రో SD కార్డ్ రీడర్ను కూడా అందిస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో ఇంటెల్ గిగాబిట్ వై-ఫై మరియు వైర్‌లెస్ కనెక్షన్ కోసం 2 × 2 MU-MIMO తో 802.11ac వైర్‌లెస్ యాంటెన్నా మరియు బ్లూటూత్ 5.0 ఉన్నాయి. ఏసర్ 12.5 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది అని కంపెనీ తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Acer launched Chromebook 314 in India: Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X