ఆన్‌లైన్‌ సేల్స్ కోసం ఇండియాలో ఇ-స్టోర్ ను ప్రారంభించిన ACER

|

ఇండియాలో తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రముఖ తైవానీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ (Acer) ఎసెర్ ఇప్పుడు తన సొంత ఆన్‌లైన్ స్టోర్ 'e-store' ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఆన్‌లైన్‌
 

ఈ రోజుల్లో చాలా కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరియు తమ సేల్స్ పెంచుకోవడానికి ఆన్‌లైన్‌లోకి వెళ్తున్నారు. ఆన్‌లైన్ స్థలంలో బలమైన సామర్థ్యంను పెంచుకోవడానికి అన్ని కంపెనీలు తమ సొంత ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నారు.

ఒకే సారి మూడు ఫోన్లను ఛార్జ్ చేసే షియోమి 60W ఫాస్ట్ ఛార్జర్‌

సిఎంఓ

"మేము మా వినియోగదారులకు డిజిటల్ షాపింగ్ అనుభవాన్ని అందించాలని నిర్ణయించుకున్నాము. మా అభిమానులు ఎప్పుడైనా మా తాజా ఉత్పత్తులను వారి చేతివేళ్ల వద్ద యాక్సెస్ చేసి ఆర్డర్‌ చేయడం కోసం మొదటిసారిగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నాము. దీనిని ఉపయోగించి వినియోగదారులు దేనినైనా ఆర్డర్ చేయవచ్చు. మేము వాటిని నేరుగా వారి ఇంటికి పంపిస్తాము "అని సిఎంఓ మరియు కన్స్యూమర్ బిజినెస్ హెడ్ చంద్రహాస్ పానిగ్రాహి తెలిపారు.

జియోను మించిన BSNL న్యూ ఇయర్స్ ఆఫర్స్....

ల్యాప్‌టాప్‌లు

ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు మరియు ఇతర అక్సిస్సోరీస్ లలో బ్రిక్ మరియు మోర్టార్ దుకాణాలలో రిటైల్ చేయబడిన అన్ని తాజా ఉత్పత్తులను ఈస్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ స్టోర్ ప్రోడక్ట్ యొక్క అన్ని వివరాలను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ఏదైనా వస్తువును కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకునే ముందు ఉత్పత్తులపై మంచి అవగాహన పొందడానికి సహాయపడుతుంది.

జియో "హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌" వివరాలు

ఎసెర్
 

ఎసెర్ యొక్క ఈస్టోర్ ప్రధానంగా వినియోగదారుల యొక్క ఉత్సుకతను సంతృప్తిపరిచే ప్రయత్నం. అదే సమయంలో వారికి విస్తృత శ్రేణి ఉత్పత్తులు మరియు ఆకర్షణీయమైన ఆఫర్లకు యాక్సిస్ ను అందిస్తుంది. అదనంగా ఇ-స్టోర్‌లో చేసే ప్రతి కొనుగోలుకు ప్రమాదవశాత్తు నష్టం కలిగించే ఉత్పత్తులకు 3 సంవత్సరాల వారంటీ ఆఫర్ వంటి పరిమిత సమయం వరకు కంపెనీ ఒప్పందాలు మరియు ప్రత్యేక ప్రారంభ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. అలాగే వినియోగదారులు ఎంచుకున్న ఎసెర్ ఉత్పత్తుల కోసం 55 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

ఏసర్ కాన్సెప్ట్ డి సిరీస్‌

గత వారం కంపెనీ ఇండియాలో వినియోగదారు మరియు వాణిజ్య ఉపయోగం కోసం ఏసర్ కాన్సెప్ట్ డి సిరీస్‌ను ప్రారంభించింది. కొత్త కాన్సెప్ట్ డి బ్రాండ్ అనేది గ్రాఫిక్ డిజైనర్లు, సినిమానిర్మాతలు, ఇంజనీర్లు మరియు డెవలపర్ల వంటి వృత్తిపరమైన సృష్టికర్తల కోసం ఆప్టిమైజ్ చేయబడిన హై-ఎండ్ డెస్క్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు మరియు మానిటర్ల సమాహారం.

యూట్యూబ్‌లో 2019 లో అధిక వ్యూస్‌లను సాధించిన వీడియోలు

కాన్సెప్ట్ డి 500

కాన్సెప్ట్ డి 500 బ్రాండ్ జనవరి 2020 నుండి 99,999 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది. సృష్టికర్తల కోసం కాన్సెప్ట్ CP 3 మానిటర్ వచ్చే నెల నుండి లభిస్తుందని ఎసెర్ తెలిపారు. కాన్సెప్ట్ D 9 ల్యాప్‌టాప్ వచ్చే నెల నుంచి రూ.3,59,999 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. కాన్సెప్ట్ Dప్రో లైనప్‌లో నాలుగు ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు NVIDIA's RTX స్టూడియో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లో భాగం. ఇది వివిధ అవసరాలు మరియు ధర పాయింట్లను లక్ష్యంగా చేసుకుంటాయి.

2019 లో U.S ఆర్మీ యొక్క అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ

కాన్సెప్ట్ D 7 సిరీస్‌

కాన్సెప్ట్ D 7 సిరీస్‌ 2020 జనవరి నుండి ఎసెర్ యొక్క ఇ-స్టోర్ మరియు ఎసెర్ మాల్స్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఈ సిరీస్ లో కాన్సెప్ట్ D 3 ప్రో, కాన్సెప్ట్ D 5 ప్రో, కాన్సెప్ట్ D 7 ప్రో మరియు కాన్సెప్ట్ D9 ప్రో కూడా ఉంటుందని కంపెనీ గుర్తించింది. వీటి యొక్క డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
ACER Launches it's Own Online e-Store in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X