Home
News

Acer నుంచి కొత్త గేమింగ్‌ ల్యాప్‌టాప్‌.. ధర, స్పెసిఫికేషన్లు

ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ Acer కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. Aspire 5 పేరిట కొత్త గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. 13వ జనరేషన్‌ ఇంటెల్‌ ప్రోసెసర్‌ మరియు అధునాతర ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌ కలిగి ఉందని ఏసర్‌ వెల్లడించింది. ప్రత్యేకంగా గేమ్స్‌ ఆడేవారికి, క్రియేటర్లకు, పవర్‌ పీసీ యూజర్లకు ఏసర్‌ ఆస్పైర్‌ 5 ఎంతో సౌకర్యంగా ఉంటుందని సంస్థ తెలిపింది.

ఏసర్‌ ఆస్పైర్‌ 5 ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు WUXGA 1920*1200 రిజల్యూషన్‌తో వస్తుంది. 16:10 యాస్పెక్ట్‌ రేషియాతో 170 డిగ్రీల వరకు డిస్‌ప్లేను వీక్షించవచ్చు. మెర్యూరీ ఫ్రీ డిస్‌ప్లే మరియు మెటల్‌ ఛాసిస్‌ కలిగి ఉంటుందని ఏసర్‌ తెలిపింది.

Acer Aspire 5

ఈ ల్యాప్‌టాప్‌ 13 జనరేషన్‌ ఇంటెల్‌ ప్రోసెసర్‌ను కలిగి ఉంటుంది. Nvidia GeForce RTX 2050 గ్రాఫిక్స్‌ యూనిట్‌తో వస్తుంది. గేమింగ్‌ కోసం ఏఐ ఫీచర్లు మరియు రే ట్రేసింగ్‌ సామర్థ్యాలను అందిస్తుంది. ఏఐ ప్రత్యేకమైన టెన్సర్‌ కోర్‌ గిఫోర్‌ ఆర్‌టీఎక్స్‌ జీపీయూ.. గేమ్స్‌ ఆడేవారికి స్పీడ్‌ బూస్ట్‌ మరియు అధునాతన ఇమేజ్‌ క్వాలిటీతో సాయపడతాయి. Nvidia ఆప్టిమస్‌ టెక్నాలజీ ల్యాప్‌టాప్‌ మెరుగైన పనితీరును అందిస్తుంది. మరియు బ్యాటరీ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఏసర్‌ అస్పైర్‌ 5 ల్యాప్‌టాప్‌ అనేక పోర్టులను కలిగి ఉంటుంది. USB టైప్‌ సీ పోర్టు మరియు థండర్‌బోల్ట్‌ 4 పోర్ట్‌ ఉంటాయి. ఇవి ఇతర డివై‌స్‌లతో కనెక్ట్‌ కావడానికి మరియు ఫైల్స్‌ను షేర్‌ చేసేందుకు ఉపయోగపడతాయి. మరియు ఈ ల్యాప్‌టాప్‌ Wi-Fi 6E మరియు బ్లూటూత్‌ 5.2 టెక్నాలజీని కలిగి ఉంటుంది. MU-MiMO టెక్నాలజీ సాయం అనేక రకాలైన డివైస్‌లను ఒకేసారి కనెక్ట్‌ చేసుకోవచ్చు.

ఏసర్‌ ఆస్పైర్‌ 5 ల్యాప్‌టాప్‌ ఇంటెల్‌కోర్‌ i5-1335U మరియు i7-1355U ప్రోసెసర్‌లతో అందుబాటులో ఉంది. 16GB ర్యామ్‌ మరియు 1TB అంతర్గత స్టోరేజీతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ HDMI 2.1 పోర్ట్‌తో వస్తుంది. ఇది గరిష్ఠంగా 8k వీడియాలను సపోర్టు చేస్తుంది.

మల్టీ టచ్‌ Gesture, టచ్‌ ప్యాడ్‌ను కలిగి ఉంటుంది. 50Wh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 65W ఛార్జర్‌తో వస్తుంది. విండోస్‌ 11 OS ఆధారంగా పనిచేస్తుంది. మరియు ప్రస్తుతం గ్రే (Gray) కలర్‌లో అందుబాటులో ఉంది. ఏసర్‌ ఆస్పైర్‌ 5 గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ బరువు 1.57 కేజీలు ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.70,990 లకు ఏసర్‌ ఎక్లూజివ్‌ స్టోర్‌, ఈ-స్టోర్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌ సహా అమెజాన్‌లో అందుబాటులో ఉందని తెలిపింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Acer launches its gaming laptop Aspire 5 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X