Home
News

ACT Broadband Plans: నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలతో అద్భుతమైన ఆఫర్లు...

ఇండియాలోని బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ACT ఫైబర్నెట్ మొదటి వరుసలో ఉంది. ఈ సర్వీస్ ప్రొవైడర్‌ అధిక సంఖ్యలో భారతీయులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా మంది తమ ఇళ్లలో కూర్చొని పనిచేయడం మరియు వినోదం కోసం అధికంగా OTT కంటెంట్‌ ఫార్మాట్ లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.

ACT ఫైబర్నెట్ OTT స్ట్రీమింగ్‌

ACT ఫైబర్నెట్ OTT స్ట్రీమింగ్‌

OTT స్ట్రీమింగ్‌ను మరింత సులభతరం చేయడానికి ACT ఫైబర్నెట్ యొక్క హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్‌లు తన వినియోగదారులకు OTT ప్రయోజనంతో పాటు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనంతో వచ్చే ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనంను ఉచితంగా అందించే ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలతో ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలతో ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ACT ద్వారా వినియోగదారులకు OTT ప్రయోజనాలతో కొన్ని ప్లాన్లను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ మాదిరిగా కాకుండా దేశంలోని వివిధ టెలికాం సర్కిల్‌లలో వేర్వేరు ధరల వద్ద ACT బ్రాడ్‌బ్యాండ్ తన ప్లాన్ లను అందిస్తుంది. ACT వినియోగదారులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనంతో లభించే ప్రత్యేక ప్లాన్లు నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందించవు కాని నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కొనుగోలుపై రూ.500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి.

 

ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు బెంగళూరులో

ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు బెంగళూరులో

బెంగళూరు ప్రాంతంలో ఉండే వారు ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో స్టోర్మ్, బ్లేజ్, లైటింగ్, గిగా మరియు ఇన్క్రెడిబుల్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లన్నీ కూడా మీకు నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాన్ని అందిస్తాయి. అలాగే డేటా మరియు స్పీడ్ గురించి ఎటువంటి ఆందోళన లేకుండా స్ట్రీమింగ్‌లో మీకు సహాయపడతాయి. ఈ ప్లాన్‌ల యొక్క డేటా స్పీడ్ 100 Mbps నుండి 1 Gbps వరకు ఉంటుంది. అలాగే నెలవారి డేటా ప్రయోజనం 450GB నుండి 3,500GB వరకు ఉంటుంది. ఈ ప్లాన్‌ల యొక్క నెలవారీ ధర రూ.1,085 నుండి రూ.5,999 మధ్య ఉంటుంది. డేటా అయిపోయిన తర్వాత ఈ ప్లాన్‌ల యొక్క డేటా స్పీడ్ 1Mbps మరియు 5 Mbpsకు తగ్గించబడుతుంది.

ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు హైదరాబాద్ లో

ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు హైదరాబాద్ లో

హైదరాబాద్ ప్రాంతంలో నివసించే వారి యొక్క విషయానికొస్తే ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు రూ.1,075 మరియు రూ.1,325 ధర వద్ద లభించే మల్టీ A-మాక్స్ ప్లాన్ల నుంచి మొదలవుతుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనం కోరుకునే వారికి రూ.1,999 వద్ద ఇన్క్రెడిబుల్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లపై స్పీడ్ రేంజ్ 100Mbps మరియు 1Gbps మధ్య ఉంటుంది. అలాగే డేటా యొక్క ప్రయోజనానికి వస్తే 1,000GB మరియు 2,000GB డేటాతో వస్తుంది. వీటి యొక్క FUP డేటా ముగిసిన తరువాత డేటా వేగం 3 Mbps మరియు 10 Mbps కు తగ్గించబడుతుంది.

ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు చెన్నైలో

ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు చెన్నైలో

చెన్నైలో నివసిస్తున్న వారి కోసం ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఎంచుకోవడానికి స్టోర్మ్, బ్లేజ్ ప్రోమో, ఇన్క్రెడిబుల్ మరియు లైటింగ్ వంటి ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లు వినియోగదారులకు నెలకు 1,000GB నుండి 2,000GB డేటాను 150 Mbps నుండి 350 Mbps వేగంతో పొందవచ్చు. ఈ ప్లాన్‌ల యొక్క నెలవారీ ధర రూ.1,075 మరియు రూ.1,999 మధ్య ఉంటుంది. ఇవి డేటా అయిపోయిన తర్వాత డేటా యొక్క వేగం 1 Mbps మరియు 2 Mbps కు తగ్గించబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
ACT Broadband Plans Offers Netflix Benefits: Check for More Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X