కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ACT Fibernet
ACT Fibernet కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. తన కస్టమర్లకు 100GB అదనపు డేటా ప్రయోజనాలను అందించడం ప్రారంభించింది.
ACT Fibernet కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. తన కస్టమర్లకు 100GB అదనపు డేటా ప్రయోజనాలను అందించడం ప్రారంభించింది.దీంతో పాటు Amazon Fire TV Stick విత్ Alexa Voice Remote అందించడం ప్రారంభిస్తామని ACT Fibernet ప్రత్యేకంగా ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్ బెంగళూరు, చెన్నై, ఢిల్లీ మరియు హైదరాబాద్ లో ఎంపిక చేసిన బ్రాడ్ బాండ్ ప్లాన్స్ లో అందుబాటులో ఉంది.

ACT Fibernet
భారతదేశంలో బ్రాడ్ బాండ్ సబ్ స్క్రైబ్ర్లకు అదనంగా 100GB డేటాను అందించడం ప్రారంభించిందని ACT Fibernet తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.ఈ ఉచిత డేటాను ACT Fibernet యాప్ ద్వారా చూడవచ్చు.

1,500GB అదనపు డేటా...
ACT Fibernet ఆపరేట్ చేస్తున్న 16 నగరాలలో 1,500GB అదనపు డేటాను ఈ సర్వీస్ ప్రొవైడర్ అందిస్తోంది.ఎంపిక చేసుకున్న ప్లాన్స్ తో , ఫిబ్రవరి 28 వరకు చెల్లుబాటులో ఉంది.

Amazon Fire TV Stick విత్ Alexa Voice Remote
ACT Fibernet మరో బంపర్ ఆఫ్ కూడా ప్రకటించింది.రూ.3,999 విలువ చేసే Amazon Fire TV Stick విత్ Alexa Voice Remote ను ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపింది.అయితే ఇది సెలెక్టెడ్ ప్లాన్స్ ను తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.ఈ ఆఫర్ బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ లో సబ్ స్క్రైబ్ర్లకు ఆఫర్ అందుబాటులో ఉంది.

బెంగళూరులో
ముక్యంగా బెంగళూరులో, ACT Storm ( రూ .1,049 నెలకు ) ప్లాన్ , ACT Lightning (రూ . 1,399 నెలకు) ప్లాన్ ,లేదా ACT Incredible (Rs. 1,999 నెలకు )ప్లాన్ 12నెలలు సబ్ స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులకు Amazon Fire TV Stick విత్ Alexa Voice Remote ను ACT Fibernet ఉచితంగా ఆఫర్ చేస్తుంది. ACT Lightning లేదా తీసుకునే కస్టమర్లకు ఒక నెల అదనపు ఉచిత బ్రాడ్ బాండ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.అలాగా ACT Incredible తీసుకునే కస్టమర్లకు రెండు నెలల ఉచిత బ్రాడ్ బాండ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది

చెన్నైలో
చెన్నైలో ACT Blaze (రూ. 999 నెలకు) 12 నెలల ప్లాన్ లేదా ACT Blast Promo (రూ . 1,049 నెలకు ), ACT Storm (రూ . 1,099నెలకు ), ACT Lightning (రూ .1,299 నెలకు ), ACT Thunder (రూ . 1,499 నెలకు ), ACT Incredible (రూ . 1,999 నెలకు) మరియు ACT Giga (Rs. 2,999 నెలకు) 6 నెలల ప్లాన్ సబ్ స్క్రైబ్ చేసుకునే కస్టమర్లకు కాంప్లిమెంటరీగా Amazon Fire TV Stick ను ఉచితంగా ACT Fibernet అందిస్తుంది.

హైదరాబాద్ లో
హైదరాబాద్ లో నివసించేవారు Amazon Fire TV Stick విత్ Alexa Voice Remote ను ఉచితంగా పొందాలంటే Max 1050 (రూ . 1,050 నెలకు ) ప్లాన్ ను 12 నెలలు సబ్ స్క్రైబ్ చేసుకోవాలి లేదా A-Max 1299 (రూ . 1,299 నెలకు ) ప్లాన్ ను 11 నెలలు సబ్ స్క్రైబ్ చేసుకోవాలి లేదా ACT Incredible (రూ.1,999 నెలకు) ప్లాన్ ను 11 నెలలు సబ్ స్క్రైబ్ చేసుకోవాలి లేదా ACT Giga (రూ . 5,999 నెలకు)ప్లాన్ ను ఒక నెల సబ్ స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది.

ACT Fibernet వినియోగదారులు
హైదరాబాద్ లో ACT Fibernet వినియోగదారులు ACT GIGA ప్లాన్ ను ఎంచుకోవడం ద్వారా ACT TV స్టిక్ తో పాటు రెండు నెలల ఉచిత ఇంటర్నెట్ బ్రాడ్ బాండ్ పొందవచ్చు అలాగే కాంప్లిమెంటరీ గా Amazon Fire TV Stick ను పొందవచ్చు.

ఢిల్లీలో
ఢిల్లీలో ACT Platinum Promo (రూ.999 నెలకు) మరియు ACT Diamond (రూ.1,249 నెలకు) ప్లాన్లను షబ్ సబ్ స్క్రైబ్ చేసుకున్నవారికి కాంప్లిమెంటరీగా Amazon Fire TV Stick విత్ Alexa Voice Remote ఉచితంగా ACT Fibernet అందిస్తుంది.


Click it and Unblock the Notifications








