Home
News

ACT Fibernet దీపావళి ఆఫర్: రూ.100 క్యాష్‌బ్యాక్‌ పొందే గొప్ప అవకాశం...

ఇండియాలో దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) ACT ఫైబర్నెట్ దీపావళి కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆఫర్‌లో భాగంగా కొత్త కనెక్షన్‌లో ఎంచుకున్న ACT ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మీద రూ.100 క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి అర్హులు అవుతారు. ఇప్పటికే ఉన్న ACT ఫైబర్నెట్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదని గమనించండి. క్రొత్త వినియోగదారులు actcorp.in వెబ్‌సైట్‌లో సులభంగా కనెక్షన్‌ను బుక్ చేసుకోవచ్చు. ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న అన్ని నగరాల్లో అక్టోబర్ 10 నుండి పరిమిత కాలానికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ACT ఫైబర్నెట్ దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్

ACT ఫైబర్నెట్ దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్

ACT ఫైబర్నెట్ గురించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఆఫర్ 100 Mbps లేదా అంతకంటే ఎక్కువ వేగంతో గల ఎంచుకున్న కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై మాత్రమే అందుబాటులో ఉంది. ACT ఫైబర్నెట్ అనేక నగరాల్లో 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది కాబట్టి ఈ ఆఫర్ అన్నింటికీ వర్తిస్తుంది.

 

ACT ఫైబర్నెట్ దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ షరతులు

ACT ఫైబర్నెట్ దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ షరతులు

ACT ఫైబర్నెట్ దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను పొందడం కోసం కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి. ఇందులో మొదటిది వెబ్‌సైట్‌ ద్వారా చేసే పేమెంట్ లపై మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఒక కస్టమర్ ACT ఫైబర్నెట్ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే కొత్త కనెక్షన్‌ను బుక్ చేసుకోవాలి. అలాగే కనెక్షన్ బుక్ చేసే సమయంలో వినియోగదారులు రూ.100 తక్షణ క్యాష్‌బ్యాక్ ను పొందడానికి ‘ACT100' కోడ్‌ను నమోదు చేయాలి. ఈ ఆఫర్ 2020 అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 20 అర్ధరాత్రి మధ్య మాత్రమే లభిస్తుంది.

ACT ఫైబర్నెట్ సర్వీస్ ప్రాంతాలు

ACT ఫైబర్నెట్ సర్వీస్ ప్రాంతాలు

ACT ఫైబర్నెట్ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, ఏలూరు, గుంటూరు, జైపూర్, కాకినాడ, లక్నో, మదురై, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు వరంగల్ వంటి అనేక ప్రాంతాలలో తన యొక్క సేవలను అందిస్తోంది. దాదాపు అన్ని నగరాల్లో ఈ సంస్థ 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను అందిస్తున్నది.

ACT ఫైబర్నెట్ ఉచిత AHA ప్రీమియం సబ్స్క్రిప్షన్

ACT ఫైబర్నెట్ ఉచిత AHA ప్రీమియం సబ్స్క్రిప్షన్

ACT ఫైబర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇటీవల కాకినాడ మరియు రాజమండ్రి నగరాల్లో తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది. ACT తన మొబైల్ యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా AHA స్ట్రీమింగ్ సర్వీస్ సభ్యత్వాన్ని పొందటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. AHA అనేది తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన కంటెంట్‌ను అందించడంపై దృష్టి సారించిన ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీస్. ACT సర్వీస్ ప్రొవైడర్ AHA కి ఉచిత ప్రీమియం సభ్యత్వాన్ని అందించడం లేదని గమనించండి. ఇది ACT ఫైబర్నెట్ బిల్లు నుండి AHA కు సభ్యత్వాన్ని పొందటానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

ACT ఫైబర్నెట్ OTT ప్లాట్‌ఫామ్‌ల ఉచిత సబ్స్క్రిప్షన్

ACT ఫైబర్నెట్ OTT ప్లాట్‌ఫామ్‌ల ఉచిత సబ్స్క్రిప్షన్

ACT ఫైబర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పటికే తన వినియోగదారుల కోసం ZEE5, SonyLIV, Hungama వంటి వివిధ OTT ప్లాట్‌ఫామ్‌ల సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నది. ఈ OTT ప్లాట్‌ఫామ్‌ల యొక్క ఉచిత సబ్స్క్రిప్షన్ కొన్ని ప్లాన్ల మీద మాత్రమే అందిస్తున్నాయి. అలాగే ఇవి నెలకు 500 రూపాయల వరకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తాయి.

Best Mobiles in India

English summary
ACT Fibernet Diwali Cashback Offer Rs 100 on 100 Mbps and Above Broadband Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X