ACT ఫైబర్‌నెట్ దసరా క్యాష్‌బ్యాక్ ఆఫర్!! త్వరపడండి మిస్ అవ్వకండి...
ఇండియాలో అతిపెద్ద వైర్డు బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ గా పేరును పొందిన ACT ఫైబర్‌నెట్ ప్రస్తుతం తన వినియోగదారులకు ప్రత్యేకమైన దసరా క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు తమ తదుపరి రీఛార్జిలో రూ.100 ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్ ను పొందుతారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) యొక్క వెబ్‌సైట్ ప్రకారం ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఎంచుకున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై మాత్రమే వర్తిస్తుంది అని గమనించాలి. 100 Mbps స్పీడ్ మరియు దానికంటే అధిక వేగంతో గల ప్లాన్ లను ఎంచుకునే వినియోగదారుల కోసం మాత్రమే ACT బ్రాడ్‌బ్యాండ్ ఈ దసరా ఆఫర్ అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ACT ఫైబర్‌నెట్ దసరా క్యాష్‌బ్యాక్ ఆఫర్
ACT ఫైబర్‌నెట్ యొక్క వినియోగదారులకు ప్రస్తుతం వారి యొక్క తదుపరి రీఛార్జిలో రూ.100 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దీని కోసం వినియోగదారులు ‘ACT100' అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో పేర్కొన్న నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఈ ఆఫర్ 2020 అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 27 అర్ధరాత్రి వరకు మాత్రమే చెల్లుతుందని కంపెనీ ప్రత్యేకంగా తెలిపింది.

ACT ఫైబర్‌నెట్ దసరా క్యాష్‌బ్యాక్ పొందే విధానం
ACT ఫైబర్‌నెట్ దసరా క్యాష్‌బ్యాక్ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారులు వారి తదుపరి ప్లాన్ ను నేరుగా ACT వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఏదైనా మూడవ పార్టీ వెబ్‌సైట్ లేదా పేమెంట్ ప్లాట్‌ఫాం ద్వారా రీఛార్జ్ చేయడం ద్వారా ఆఫర్ యొక్క ప్రోమో కోడ్‌ను నమోదు చేయడానికి వినియోగదారులను అనుమతించదు కావున క్యాష్‌బ్యాక్ ను పొందడానికి ACT వెబ్‌సైట్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే ఈ ఆఫర్ 100Mbps మరియు అంతకంటే ఎక్కువ వేగంతో నడిచే ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులకు మాత్రమే వారి తదుపరి రీఛార్జిలో రూ.100 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ACT క్యాష్‌బ్యాక్ రీడీమ్ చేసే విధానం
ACT ఫైబర్‌నెట్ దసరా క్యాష్‌బ్యాక్ ఆఫర్ యొక్క ప్రయోజనాలను మీరు రీడీమ్ చేసుకోవడానికి ISP యొక్క వెబ్‌సైట్ ద్వారా మీ ACT అకౌంటుకు లాగిన్ అవ్వవలసి ఉంటుంది. తరువాత 100 Mbps లేదా అంతకంటే ఎక్కువ వేగాన్ని అందించే ఏదైనా ప్లాన్‌ను ఎంచుకోండి. ‘బయ్ నౌ' ఎంపికపై క్లిక్ చేయండి. ఆఫర్ యొక్క ‘ACT100' ప్రోమో కోడ్‌ను నమోదు చేసి ‘ప్రాసెస్ టూ పే' ఎంపికపై క్లిక్ చేయండి. విజయవంతమైన చెల్లింపు తరువాత, వినియోగదారు ISP నుండి రూ .100 యొక్క తక్షణ క్యాష్‌బ్యాక్ పొందటానికి అర్హులు అవుతారు.


Click it and Unblock the Notifications








