పాత ధరకే, రెట్టింపు డేటా.. ఆంధ్రప్రదేశ్‌లో ACT Fibernet సంచలనం

భారతదేశపు అతిపెద్ద నాన్-టెల్కో అలానే వైరుడ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో మూడవ అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ACT Fibernet ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లోని తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లకు సంబంధించి రెట్టింపు డేటాను అనౌన్స్ చేసింది. యాక్ట్ ఫైబర్‌నెట్ సర్వీసు వైజాగ్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, ఏలూరు ఇంకా గుంటూరు ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆఫర్ చేస్తోంది.

Read More : Redmi Note 5A వచ్చేసింది, సేల్ ఈ రోజు నుంచే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు..

యాక్ట్ ఫైబర్‌నెట్ సర్వీసు వైజాగ్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, ఏలూరు ఇంకా గుంటూరు ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆఫర్ చేస్తోంది. మార్కెట్లో పదుల సంఖ్యలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అందుబాటులో ఉన్నప్పటికి ACT Fibernetకు ఉన్న క్రేజే వేరు.

ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ రెట్టింపు..

దేశవ్యాప్తంగా తక్కువ ధరకే హై-స్పీడ్ డేటా ప్యాక్‌లను అందిస్తోన్న ACT Fibernet తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తమ కస్టమర్స్ కోసం ఫెయిర్ యూసేజ్ పాలసీని రెట్టింపు చేస్తూ, ఏ విధమైన అదనపు ఛార్జీలు తీసుకోకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్యాక్‌లకే డేటా లిమిట్‌ను రెట్టింపు చేసింది. అప్‌లోడ్ ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్స్‌ను, డౌన్‌లోడ్ ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్స్‌ను కలిపి ఆ మొత్తం డేటాను నెలవారీ డేటా లిమిట్‌గా ACT Fibernet అందిస్తోంది.

వైజాగ్ ఏరియాలో..

వైజాగ్ ఏరియాలో ACT Fibernet తన ప్లాన్‌లకు సంబంధించిన ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్‌ను రెట్టింపు చేసింది. ఈ క్రమంలో ACT Sliver ప్లాన్ FUP లిమిట్ కాస్తా 140జీబికి పెంచబడింది. గతంలో ఈ ప్లాన్ 70జీబి మాత్రమే ఫెయిర్ యూసేజ్ పాలసీ క్రింద లభించేది. మరొక ప్లాన్ ACT Goldలో భాగంగా FUP లిమిట్‌ను 200జీబికి పెంచారు. గతంలో ఈ ప్లాన్ పై 100జీబి FUP లిమిట్ మాత్రమే లభించేది. ఇదే సమయంలో ACT Diamond ప్లాన్ FUP లిమిట్‌ను 125జీబి నుంచి 250జీబికి, ACT Platinum ప్లాన్ డేటా ప్లాన్‌ను 175జీబి నుంచి 350జీబికి ACT Fibernet అప్‌గ్రేడ్ చేసింది.

విజయవాడ, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో

ఇదే సమయలో విజయవాడ, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లోనూ ACT Fibernet తన రిటైల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లకు సంబంధించిన డేటా లిమిట్‌ను రెట్టింపు చేసింది. ఈ ఏరియాల్లో ACT Sliver ప్లాన్ FUP లిమిట్ కాస్తా 150జీబికి రెట్టింపు చేయబడింది. గతంలో 70జీబి మాత్రమే లభించేది. మరొక ప్లాన్ ACT Goldలో భాగంగా FUP లిమిట్‌ను 250జీబికి పెంచారు. గతంలో ఈ ప్లాన్ పై 125జీబి FUP లిమిట్ మాత్రమే లభించేది. ACT Diamond ప్లాన్ పై గతంలో ఉన్న 150జీబి ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్‌ను 300జీబికి రెట్టింపు చేయటం జరిగింది.

నెల్లూరు ఏరియాలో...

నెల్లూరు ఏరియాలో ACT Fibernet సర్వీసులను వినియోగించుకుంటోన్న యూజర్లు ACT Sliver ప్లాన్ పై ఇక నుంచి 80జీబి వరకు ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్‌ను పొందవచ్చు. గతంలో ఈ ప్లాన్ పై FUP లిమిట్ 40జీబి వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇదే సమయంలో ACT Gold ప్లాన్‌లో భాగంగా FUP లిమిట్‌ను 50జీబి నుంచి 100జీబికి రెట్టింపు చేసారు. ACT Diamond ప్లాన్‌లో ఉన్న యూజర్లు ఇక పై 150జీబి వరకు ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్‌ను ఆస్వాదించే వీలుంటుంది. ACT Platinum యూజర్లు 250జీబి వరకు FUP లిమిట్‌ను లిమిట్‌ను పొందవచ్చేు. ACT Titanium యూజర్లు 350జీబి వరకు FUP లిమిట్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

తిరుపుతి సర్కిల్‌లో..

ఇక తిరుపతి ప్రాంతంలోని ACT Fibernet యూజర్లు ACT Sliver ప్లాన్ పై 100 జీబి వరకు ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్‌ను పొందే వీలుంటుంది. ACT Gold ప్లాన్‌లో భాగంగా FUP లిమిట్‌ను 90 జీబి నుంచి 180జీబికి రెట్టింపు చేసారు.  ACT Diamond ప్లాన్‌లో ఉన్న యూజర్లు 250జీబి వరకు FUP లిమిట్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ACT Fibernet increases data limit of all plans at no extra cost. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot