Home
News

1.5TB అదనపు డేటా మరియు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లో డిస్కౌంటులతో ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ప్రస్తుతం ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు చందాదారులకు కాలక్రమేణా మరింత ఆకర్షణీయంగా మారాయి. జియోఫైబర్ వచ్చిన తరువాత పోటీ మరీ ఎక్కువ అయింది. కనెక్షన్ల విషయంలో కూడా చందాదారులకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎంపికల సంఖ్య మరింతగా పెరిగాయి.

బ్రాడ్‌బ్యాండ్

ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు చాలా మంది తమ ప్లాన్‌లతో చందాదారులను ఆకట్టుకోవడానికి వారి ప్లాన్‌లలో బండిల్ చేసిన OTT యాప్ లను అందిస్తున్నారు. చాలా కాలం నుండి భారతి ఎయిర్‌టెల్ దాని ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ చందాను ఉచితంగా అందిస్తున్నది. ఇప్పుడు యాక్ట్ ఫైబర్ నెట్ ఆపరేటర్ కూడా నెట్‌ఫ్లిక్స్ చందాను అందిస్తున్నది.

 

 

ACT ఫైబర్నెట్

ఏదేమైనా ACT ఫైబర్నెట్ దేశంలోని ప్రధాన బ్రాడ్బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. చందాదారులకు ACT ఫైబర్నెట్ నుండి సరైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లతో వారికి నెట్‌ఫ్లిక్స్ చందాపై కొద్దిగా తగ్గింపును అందిస్తోంది. ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లలో దాని ప్లాన్‌లతో 40 Mbps నుండి 1Gbps వేగంతో ప్లాన్‌లను కలిగి ఉన్నాయి.

 

 

ACT ఫైబర్నెట్ ప్లాన్‌ల వివరాలు

ACT ఫైబర్నెట్ ప్లాన్‌ల వివరాలు

చందాదారులకు తగినంత వేగంతో పాటు నెట్‌ఫ్లిక్స్ చందాను అందించే ACT ఫైబర్నెట్ ప్లాన్‌లలో చందాదారులకు అందుబాటులో ఉన్న అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లలో మొదటిది ACT బ్లేజ్. ఈ ప్లాన్ చందాదారులకు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో నెలకు 450GB డేటాను అందిస్తుంది. చందాదారులు 6 నెలలు లేదా 12 నెలల చందా కోసం రీఛార్జ్ చేస్తే అదనంగా 1500GB డేటాను కూడా ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ యొక్క నెలవారీ అద్దె రూ.1,059. ఈ ప్లాన్‌తో చందాదారులు వారి నెలవారీ నెట్‌ఫ్లిక్స్ కనెక్షన్‌లో రూ.50 తగ్గింపును పొందుతారు.

 

 

ACT స్టోర్మ్ ప్లాన్

ACT స్టోర్మ్ ప్లాన్

ACT ఫైబర్నెట్ అందిస్తున్న ప్లాన్‌లలో ACT స్టోర్మ్ ప్లాన్ 150 Mbps వేగంతో నెలకు 650GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఆరు నెలల వార్షిక చందాపై 1500GB అదనపు డేటాను అందిస్తుంది. ACT ఫైబర్‌నెట్ యొక్క ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర నెలకు 1,159 రూపాయలు. ఈ ప్లాన్ ప్రతి నెలా నెట్‌ఫ్లిక్స్ చందాపై రూ.50 తగ్గింపును ఇస్తుంది.

 

 

ACT లైటింగ్  ప్లాన్ వివరాలు

ACT లైటింగ్ ప్లాన్ వివరాలు

నెలవారీ నెట్‌ఫ్లిక్స్ చందాపై తగ్గింపును అందిస్తున్న ACT తదుపరి ప్లాన్ లలో మొదటిది ACT లైటింగ్ ప్లాన్ ఇది 200 Mbps వేగంతో నెలకు 800GB డేటాను అందిస్తుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క అద్దె విలువ నెలకు రూ.1,399. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ మీద రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ACT ఇంక్రిడబుల్ ప్లాన్

ACT ఇంక్రిడబుల్ ప్లాన్

రెండవది ACT ఇంక్రిడబుల్ ప్లాన్ 250 ఎమ్‌బిపిఎస్ వేగంతో నెలకు 1000GB డేటాను అందిస్తుంది. ACT ఫైబర్నెట్ ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ను నెలకు 1,999 రూపాయల ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ చందాలో రూ.150 వరకు క్యాష్‌బ్యాక్ ను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌ల యొక్క 6నెలల చందా మీద 1500GB అదనపు డేటాను పొందవచ్చు.

 

 

ACT GIGA ప్లాన్‌లలో అత్యధిక నెట్‌ఫ్లిక్స్ సేవింగ్స్

ACT GIGA ప్లాన్‌లలో అత్యధిక నెట్‌ఫ్లిక్స్ సేవింగ్స్

చివరగా నెట్‌ఫ్లిక్స్ చందాలో మీకు ఎక్కువ డిస్కౌంటును అందిస్తున్నది రూ.5,999ల ACT గిగా ప్లాన్. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ చందా మీద సుమారు రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ ను పొందుతారు. ఈ ప్లాన్ 1 Gbps వేగంతో నెలకు 3500GB డేటాను అందిస్తుంది. చందాదారులు ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడానికి మొదట వారు ఈ ప్లాన్ లకు ACT ఫైబర్నెట్ నుండి సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది.

Best Mobiles in India

English summary
ACT Fibernet Offers 1.5TB Extra Data Alongside Huge Discounts on Netflix Subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X