జియోకి సవాల్ : యాక్ట్ ఫైబర్ నెట్ నుంచి 100జిబి ఉచిత డేటా

|

దేశీయ బ్రాడ్ బ్యాండ్ రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జియో బ్రాడ్ బ్యాండ్ ప్రవేశంతో దేశీయ బ్రాడ్ బ్యాండ్ దిగ్గజాలు కస్టమర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉచిత డేటా సునామితో టెలికం రంగంలో ప్రకంపనలు సృష్టించి రిలయన్స్ జియో అదే ఊపును బ్రాడ్ బ్యాండ్ రంగంలో కొనసాగించేందుకు వ్యూహా రచన చేస్తోంది.

జియోకి సవాల్ : యాక్ట్ ఫైబర్ నెట్  నుంచి 100జిబి ఉచిత డేటా

 

ఈ వ్యూహాన్ని పసిగట్టిన కంపెనీలు దానికంటే ముందుగానే ఆఫర్లను ప్రకటిస్ూ పోతున్నాయ. ఇందులో భాగంగానే యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారుల కోసం ఉచిత డేటాను అందిస్తోంది. యాక్ట్ అందిస్తున్న ఉచిత డేటా వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

కార్యకలాపాల విస్తరణకు..

కార్యకలాపాల విస్తరణకు..

యాక్ట్ ఫైబర్‌నెట్ ఇప్పుడు కార్యకలాపాల విస్తరణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 3వ అతిపెద్ద సబ్‌స్క్రైబర్‌గా ఉంది. అయినప్పటికీ కూడా ప్రస్తుత కస్టమర్లను కాపాడుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను అందిస్తోంది.

100 జీబీ అదనపు డేటా

100 జీబీ అదనపు డేటా

ఈ నేపథ్యంలోనే యాక్ట్ బోనస్ డేటా ఆఫర్‌ను ఆవిష్కరించింది. 100 జీబీ అదనపు డేటాను ప్రతి నెల కస్టమర్లకు అందిస్తోంది. మే నెల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బోనస్ డేటా ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవాలని భావించే కస్టమర్లు యాక్ట్ ఫైబర్‌నెట్ మొబైల్ యాప్ ద్వారా సేవలు పొందొచ్చు.

ఫిబ్రవరిలోనే
 

ఫిబ్రవరిలోనే

ఇదిలా ఉంటే యాక్ట్ ఫైబర్ నెట్ అదనపు బోనస్ ఇవ్వడం ఫిబ్రవరిలోనే ప్రారంభించింది. దాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తోంది. యూజర్లు వారి అకౌంట్‌లో బోనస్ డేటా చెక్ చేసుకోవడానికి యాక్ట్ ఫైబర్‌నెట్ మొబైల్ యాప్‌లోని ఫ్లెక్సీ బైట్స్ ప్లస్ సెక్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

రిలయన్స్ గిగాఫైబర్ ముప్పు

రిలయన్స్ గిగాఫైబర్ ముప్పు

రిలయన్స్ గిగాఫైబర్ త్వరలో రానున్న నేపథ్యంలో ఇప్పుడు యాక్ట్ కు పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఇందులో భాగంగానే ఈ కంపెనీ భవిష్యత్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలాంటి ఆఫర్లను ప్రకటిస్తుందనేది ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా డేటా క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకురావొచ్చనే అంచనాలున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Jio GigaFiber effect: ACT Fibernet offers 100GB free data to its broadband subscribers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X