హైదరాబాద్ ACT ఫైబర్నెట్ యూజర్లకు భారీ ఆఫర్!! 2 రోజులు మాత్రమే

|

ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) ACT ఫైబర్నెట్ హైదరాబాద్ నగరంలో ఉన్న తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా మరొక ఆఫర్‌ను విడుదల చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా ACT ఫైబర్‌నెట్ కొత్త కస్టమర్‌లు ఐదు నెలల చెల్లుబాటుతో రీఛార్జ్ చేసుకున్న వారికి అదనంగా ఒక నెలపాటు ఉచిత సేవలను పొందవచ్చు. అయితే ఈ 30 రోజుల ఉచిత సర్వీస్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎంచుకున్న కొన్ని ప్లాన్ లపై మాత్రమే చెల్లుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగమైన ప్లాన్ ల గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ACT ఫైబర్నెట్ లిమిటెడ్ పీరియడ్ అదనపు సర్వీస్ ఆఫర్
 

ACT ఫైబర్నెట్ లిమిటెడ్ పీరియడ్ అదనపు సర్వీస్ ఆఫర్

హైదరాబాద్‌లోని ACT ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లు ఆరు నెలల నుండి 24 నెలల వరకు పొందడానికి లాంగ్ టర్మ్ ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థ సాధారణంగా ఆరు నెలల ప్లాన్ కోసం 5.5 నెలల చందా ఆఫర్‌ను అందిస్తుంది. అయితే పరిమిత కాల ఆఫర్ మరొక 48 గంటలలోపు ముగుస్తుంది. ఈ ఆఫర్ లో భాగంగా వినియోగదారులకు ఐదు నెలల ఖర్చుతో ఆరు నెలల సేవలను పొందవచ్చు. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు ACT ఫైబర్‌నెట్ వెబ్‌సైట్‌లో కొత్త కనెక్షన్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 10, 2021 తో ఈ ఆఫర్ ముగుస్తుంది మరియు ఇది హైదరాబాద్‌లో మాత్రమే వర్తిస్తుందని గమనించండి.

హైదరాబాద్‌లో ACT ఫైబర్నెట్ ప్లాన్‌లు

హైదరాబాద్‌లో ACT ఫైబర్నెట్ ప్లాన్‌లు

హైదరాబాద్‌లో ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల విషయానికి వస్తే వాటిలో ఆరు ఉన్నాయి. ఇవి 500 రూపాయల నుండి ప్రారంభమై 5,999 రూపాయల వరకు ఉన్నాయి. A-Max 500 ప్లాన్ 500GB వరకు 40 Mbps వేగంతో అందిస్తుంది. A-మాక్స్ 700 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ నెలకు రూ.700 ధర వద్ద 75 Mbps వేగంతో 1TB ఎఫ్‌యుపి పరిమితిని అందిస్తుంది. అలాగే ప్రసిద్ధ A-Max 1075 ప్లాన్ 150 Mbps వేగంతో 2TB FUP డేటాను అందిస్తుంది.

ACT ఫైబర్నెట్

కొన్ని వారాల క్రితం ACT ఫైబర్నెట్ A- మాక్స్ 1325 మరియు ఇన్క్రెడిబుల్ 1999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను సవరించింది. ఇవి ప్రస్తుతం అపరిమిత డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. రూ.1,325 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 300Mbps వేగంతో రాగా, రూ.1,999 ప్లాన్ 400Mbps వేగంతో లభిస్తుంది. రూ.5,999 ధర వద్ద లభించే హై-ఎండ్ ACT గిగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 1Gbps వేగంతో 6TB ఎఫ్‌యుపి పరిమితి డేటాను అందిస్తుంది.

బ్రాడ్‌బ్యాండ్
 

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ఉచిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తున్న జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వంటి ఇతర ISP ల మాదిరిగా ACT ఫైబర్‌నెట్‌కు అలాంటి కాలింగ్‌ సర్వీస్ ఏమి లేదు. కొన్ని ACT ఫైబర్నెట్ ప్లాన్ లు నెట్‌ఫ్లిక్స్ చందాపై రూ.500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి. అలాగే కొన్ని ప్లాన్ లు నెలకు రూ.99 విలువైన ZEE5 ప్రీమియం సభ్యత్వాన్ని కూడా ఉచితంగా అందిస్తోంది. ACT ఫైబర్నెట్ కస్టమర్లు అసలు చందా ధరలను చెల్లించడం ద్వారా AHA వీడియో, హంగమా ప్లే వంటి యాడ్-ఆన్‌లకు కూడా సభ్యత్వాన్ని పొందవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
ACT Fibernet Providing One Month of Free Service on Long-Term Subscription

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X