Home
News

Airtel ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 200 Mbps ప్లాన్ ACT ఫైబర్‌నెట్ కన్నా మెరుగ్గా ఉందా??

ACT ఫైబర్నెట్ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని ప్రధాన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో (ISP లు) ఒకటిగా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి మరిన్ని పెద్ద పెద్ద నగరాలతో పాటుగా భారతదేశంలోని పలు నగరాల్లో ఈ సంస్థ తన వ్యాపారాన్ని విస్తరించింది. ACT ఫైబర్‌నెట్ కంపెనీ తన యొక్క వినియోగదారులకు స్టాండర్డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందించదు. ఈ కంపెనీ కొన్ని నగరాల్లో తక్కువ ధర వద్దనే కొన్ని ప్లాన్ లను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

ఇతర నగరాల్లో ఇదే ప్లాన్ కోసం వినియోగదారుల వద్ద నుండి ఎక్కువ వసూలు చేస్తుంది. భారతి ఎయిర్‌టెల్ యొక్క ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఆర్మ్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ విషయంలో ఇలా లేదు. ఈ రెండు కంపెనీలు 200Mbps వేగంతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. వాస్తవానికి వినియోగదారులు రెండు సంస్థల వద్ద నుండి ఒకే ధర వద్ద ఈ ప్లాన్లను పొందవచ్చు. అయితే ఏ ఆపరేటర్‌ ఎక్కువ ఆఫర్లను అందిస్తున్నది అన్న విషయం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ACT ఫైబర్‌నెట్ 200 Mbps ప్లాన్

ACT ఫైబర్‌నెట్ 200 Mbps ప్లాన్

ACT ఫైబర్‌నెట్ సంస్థ రూ.999 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు 200 Mbps వేగాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ అహ్మదాబాద్ సర్కిల్‌లో అందుబాటులో ఉంది. అయితే భారతదేశంలోని ఇతర నగరాల్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉండకపోవచ్చని గమనించండి. కంపెనీ వినియోగదారులకు 3.3TB లేదా 3,300GB FUP డేటాను ప్లాన్‌తో అందిస్తుంది. FUP డేటా తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 2 Mbps కి పడిపోతుంది. ఈ ప్లాన్ 6 నెలలు మరియు 12 నెలల లాంగ్ టర్మ్ వాలిడిటీతో కూడా అందుబాటులో ఉంది. 6 నెలల వాలిడిటీలో ప్లాన్ యొక్క నెలవారి ధర రూ.856 కాగా 12 నెలల వాలిడిటీ కాలంలో నెలవారీ ధర రూ.832 కు పడిపోతుంది. ఇది ZEE5 ప్రీమియం, సోనీలైవ్, హంగమా యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్  200 Mbps ప్లాన్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 200 Mbps ప్లాన్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.999 ధర వద్ద అందించే ప్లాన్ వినియోగదారులకు 200Mbps వేగంతో లభిస్తుంది. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో యూజర్లు అదే 3.3TB (3,333GB) FUP డేటా మరియు ఉచిత వాయిస్ కాలింగ్ కనెక్షన్ ను కూడా పొందుతారు. అలాగే వినియోగదారులు సంస్థ నుండి డిస్నీ + హాట్‌స్టార్ VIP, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరెన్నో OTT ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా ఎయిర్‌టెల్ థాంక్స్ యొక్క ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇందులో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, 1 సంవత్సరం షా అకాడమీ, వింక్ మ్యూజిక్ వంటి మరిన్ని ఉచిత చందాలు ఉన్నాయి.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ vs ACT ఫైబర్నెట్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ vs ACT ఫైబర్నెట్

పైన తెలిపిన వాటిలో ఏ ప్లాన్ మంచిదో అర్థం చేసుకోవడానికి వినియోగదారులు పైన తెలిపిన సమర్పణల వివరాలను చూడాలి. ఇన్స్టాలేషన్ ఖర్చు వలె కంపెనీలు వసూలు చేసే రౌటర్లకు సెక్యూరిటీ డిపాజిట్ వంటివి మరిన్ని ఉంటాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇన్‌స్టాలేషన్ కోసం ఏమీ వసూలు చేయదు. వినియోగదారుడు కనీసం 3 నెలల ప్లాన్ ను ఎంచుకుంటే కనుక రౌటర్ కూడా ఉచితంగా అందించబడుతుంది. ఇంకా ఎయిర్‌టెల్ ప్రణాళికతో ఎక్కువ OTT ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క 200 Mbps ప్లాన్ ACT ఫైబర్నెట్ యొక్క 200 Mbps ప్లాన్ కంటే మెరుగ్గా ఉంది.

Best Mobiles in India

English summary
ACT Fibernet vs Airtel Broadband: Best Choice of 200 Mbps Broadband Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X