Ultra High Speed ఇంట‌ర్నెట్ కోసం బెస్ట్ ప్లాన్స్ ఇవే.. ఇది చ‌ద‌వండి!

|

భార‌త దేశంలో ఇటీవ‌లి కాలంలో బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. కార‌ణం ఏదైనా కావ‌చ్చు.. ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ల వినియోగం మాత్రం పెరిగింది. అయితే, దేశంలోని ఇంట‌ర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP లు) యూజ‌ర్ల అవసరాలకు ఆధారంగా చేసుకుని అందుకు త‌గ్గ‌ట్టు ధ‌ర‌ల్లో త‌గిన వేగంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తారు.

broadband

ప్రతి ఆపరేటర్ ఇతర ప్రయోజనాలతో పాటు Ultra High Speed యాక్సెస్‌ను అందించే హై-ఎండ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని కూడా అందిస్తారు. ఈ అల్ట్రా హై స్పీడ్‌ ప్లాన్‌లు అనేక డివైజ్‌ల‌ను ఏకకాలంలో మరియు సజావుగా కనెక్ట్ చేయడానికి స‌హ‌క‌రించ‌డంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు మ‌నం దేశంలో బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీసు అందిస్తున్న అగ్ర కంపెనీల నుంచి అందుబాటులో ఉన్న అల్ట్రా హై స్పీడ్ 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు, వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఈ 1జీబీపీఎస్ ప్లాన్ క‌లిగిన స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల జాబితాలో ACT, Jio, ఎయిర్‌టెల్ కంపెనీలు జాబితా చేశాం. మీరు కూడా ఈ అల్ట్రా హై స్పీడ్ ప్లాన్ పై ఆస‌క్తిగా ఉంటే.. ఈ ఆర్టిక‌ల్ చ‌ద‌వండి.

టాటా ప్లే ఫైబర్ 1 Gbps ప్లాన్:

టాటా ప్లే ఫైబర్ 1 Gbps ప్లాన్:

టాటా స్కై పేరును ఇటీవల టాటా ప్లే ఫైబర్‌గా మార్చారు, కానీ ప్లాన్‌లు మాత్రం య‌థావిథిగా ఉన్నాయి. టాటా ప్లే ఫైబర్ నుండి ప్రీమియం అపరిమిత 1 Gbps వేగ‌వంత‌మైన నెట్ అందించే ప్లాన్ ఖ‌రీదు నెలకు రూ.3,600 ఉంది.

ఇదే ప్లాన్‌ను వినియోగదారులు మూడు నెలల కాలానికి తీసుకోవాలంటే.. రూ.10,800 అవుతుంది. ఆరు నెలల కాలవ్యవధి కోసం రూ.19,800గా నిర్ణ‌యించారు. ఇక ఏడాది వ్యాలిడిటీతో 1జీబీపీఎస్ ప్లాన్ పొందాలంటే.. రూ.36,000 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది ప్లాన్ ఎంచుకోవ‌డం ద్వారా రూ.7,200 ఆదా చేసుకోవచ్చు. ఈ ఇంటర్నెట్ ప్యాకేజీతో, వినియోగదారులకు 3300GB లేదా 3.3TB ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా అందించబడుతుంది. ఆ తర్వాత, వేగం 3 Mbpsకి తగ్గింది.

Airtel Xstream ఫైబర్ 1 Gbps ప్లాన్:

Airtel Xstream ఫైబర్ 1 Gbps ప్లాన్:

Airtel నుండి 1 Gbps అపరిమిత డేటా ప్లాన్ ను ఇన్ఫినిటీ ప్యాకేజీ గా చెప్ప‌వ‌చ్చు. "ఇన్ఫినిటీ" ప్యాకేజీని కోసం, వినియోగదారులు Airtel Xstream ఫైబర్ కనెక్షన్‌ని పొందవచ్చు. ఎయిర్‌టెల్ నుంచి ఈ 1 Gbps హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని పొంద‌డానికి నెలకు రూ.3,999 ఖర్చవుతుంది. FUP డేటా 3500GB లేదా 3.5TB పొంద‌వ‌చ్చు.

Wynk మ్యూజిక్‌కి యాక్సెస్‌తో పాటు, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన OTT సేవలకు సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొంద‌వ‌చ్చు. Airtel యొక్క FTTH టెక్నాలజీ హై-స్పీడ్ డౌన్‌లోడ్‌లను అందిస్తుంది మరియు ఏకకాలంలో 60 డివైజ్‌ల వరకు కనెక్ట్ చేయగలదు.

JioFiber 1 Gbps ప్లాన్‌:

JioFiber 1 Gbps ప్లాన్‌:

JioFiber నుంచి 1 Gbps సేవల కోసం వివిధ డేటా కేటాయింపులతో రెండు ప్లాన్‌లను అందిస్తున్నారు. JioFiber నుంచి 1 Gbps ప్రారంభ ప్లాన్ 30 రోజుల వ్యవధికి రూ.3,999 గా నిర్ణ‌యించారు. త‌ద్వారా 3.3TB లేదా 3300GB FUP డేటా పరిమితితో 1 Gbps ఇంటర్నెట్ వేగాన్ని పొంద‌వ‌చ్చు. అదేవిధంగా, JioFiber నుంచి 1 Gbps క‌లిగిన మ‌రో ప్యాకేజీ ధర రూ.8,499 గా ఉంది. ఇది కూడా 30 రోజుల చెల్లుబాటు వ్యవధికి 6600GB మొత్తం డేటాను కలిగి ఉంటుంది. ఈ రెండు ప్లాన్‌లు అపరిమిత కాలింగ్ మరియు 1 Gbps అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ స్పీడ్‌ని కలిగి ఉంటాయి.

అదనంగా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+, హాట్‌స్టార్ మరియు పదమూడు ఇతర సేవలతో సహా పలు రకాల OTT సేవలకు Jio యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్యాకేజీతో చేర్చబడిన Amazon Prime వీడియోకు ఒక సంవత్సరం గడువు తేదీ వర్తిస్తుంది.

ACT 1 Gbps ప్లాన్‌:

ACT 1 Gbps ప్లాన్‌:

"ACT GIGA" ప్యాక్‌గా పిలువబడే 1000 Mbps అపరిమిత డేటా ప్యాకేజీని బెంగళూరుకు చెందిన ISP అందిస్తోంది. నెలవారీ రుసుము రూ.5,999తో, వినియోగదారులు ప్రొవైడర్ నుండి ACT GIGA ప్యాక్‌ని కొనుగోలు చేయవచ్చు. FUP డేటా పరిమితులు లేని ఈ ACT ప్లాన్‌తో వినియోగదారులు నిజమైన అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. ACT నుంచి 1 Gbps ప్లాన్ వినియోగదారులకు Zee5, Sony Liv, ACT TV 4K మరియు ఇతర సేవలకు ఉచిత ట్రయల్‌తో సహా అనేక OTT సేవలకు యాక్సెస్ కూడా మంజూరు చేస్తుంది.

Best Mobiles in India

English summary
ACT, JioFiber, Tata Play Fiber and Airtel Xstream Fiber Top Tier Ultra High Speed Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X