Home
News

హీరోయిన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్

ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం వచ్చిన దగ్గర నుంచి కాలు కింద పెట్టకుండానే అన్నీ మనకు ఇంటికే వస్తున్నాయి. జస్ట్ ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే చాలు నేరుగా మన ఇంటికే ఏ వస్తువైనా వచ్చి చేరుతోంది.

ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం వచ్చిన దగ్గర నుంచి కాలు కింద పెట్టకుండానే అన్నీ మనకు ఇంటికే వస్తున్నాయి. జస్ట్ ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే చాలు నేరుగా మన ఇంటికే ఏ వస్తువైనా వచ్చి చేరుతోంది. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని చాలామంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా మోసపోతున్న వారిలో సామాన్యులే ఉన్నారనుకుంటే పొరపాటు. సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇలా మోసపోయిన సెలబ్రిటీల జాబితాలోకి తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా చేరింది. ఆమె ఎలా మోసపోయిందంటే..

హెడ్‌ఫోన్స్ ఆర్డర్

హెడ్‌ఫోన్స్ ఆర్డర్

ఈ ముద్దుగుమ్మ ఎంతో ముచ్చటపడి ఆన్‌లైన్లో ‘బోస్' హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేసింది. అయితే ఇంటికి వచ్చిన ఆ డెలివరీని తెరిచి చూసి ఒక్కసారిగా షాకైంది. బయటకు ప్యాకింగ్ బాగానే ఉన్నా.. తెరిచి చూస్తే హెడ్‌ఫోన్స్‌కు బదులు తుప్పుపట్టిన పెద్ద బోల్ట్ ఉంది.

ట్వీట్టర్లో బోల్ట్ ఫొటో

ట్వీట్టర్లో బోల్ట్ ఫొటో

దీంతో ఆగ్రహానికి గురైన సోనాక్షి సిన్హా ఆ బోల్ట్ ఫొటోను ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. ఎవరైనా 18,000 ఖర్చుపెట్టి ఈ తుప్పు ముక్కను కొనుక్కుంటారా? (అయితే ఇది స్టీల్‌దే అనుకోండి). ఆందోళన వద్దు. ఇది నేనే అమ్మేస్తా. అయితే, అమేజాన్‌లో కాకుండా నేరుగా అంటూ సెటైర్ వేసింది.

మరో ట్వీట్‌

ఆ తర్వాత మరో ట్వీట్‌లో ‘‘హే అమేజాన్ ఇండియా.. నేను బోస్ హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే ఏం వచ్చిందో చూడు. ప్యాకింగ్ అంతా బాగానే ఉంది. విప్పి చూస్తే ఇది కనిపించింది. మీ కస్టమర్ సర్వీస్ కూడా సాయం చేయడం లేదు'' అని పేర్కొంది.

అమెజాన్ ఇండియా స్పందన

సోనాక్షికి ఎదురైన సమస్యపై అమెజాన్ ఇండియా స్పందించింది. ఓహ్.. ఇది దారుణం. మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. మా సపోర్ట్ టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది. మేము మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తామని ట్వీట్ చేసింది.

 

 

జొమాటో డెలివరీ బాయ్‌

జొమాటో డెలివరీ బాయ్‌

ఇదిలా ఉంటే ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ.. జొమాటో డెలివరీ బాయ్‌ ఒకరు కస్టమర్‌ ఆర్డ్‌ర్‌ చేసిన ఫుడ్‌ని కొద్దిగా తిని.. తిరిగి ప్యాక్‌ చేసి డెలివరీ చేశాడు. అయితే సదరు డెలివరీ బాయ్‌ నిర్వాకం అంతా అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. ఇంటర్నెట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది.

 

 

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన నమ్రత

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన నమ్రత

ఈ వీడియో చూసిన నెటిజన్లు జొమాటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కోప్పడిన వారిలో టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఉన్నారు.ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన నమ్రత.. ‘ఇంత పేరున్న ఫుడ్‌ డెలివరీ సంస్థ పనితీరు చూసి నేను చాలా షాక్‌కి గురయ్యాను. ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవారు కనీస శుభ్రతను ఆశిస్తారు.

 

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలంటేనే భయం

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలంటేనే భయం

కానీ ఈ వీడియో చూసిన తరువాత ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలంటేనే భయం వేస్తోంది. నా పిల్లలను ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయనివ్వను.. మీకూ ఇదే చెప్తున్న' అంటూ కామెంట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను లక్షల మంది చూశారు.

Best Mobiles in India

English summary
Sonakshi Sinha receives iron piece instead of headphones; people call Amazon ‘impartial’ More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X