టెలికాం స్పెక్ట్రమ్ రేస్‌లోకి ప్రవేశించనున్న అదానీ గ్రూప్!! జియో, ఎయిర్‌టెల్, Viలకు పోటీ తప్పదా...

|

ఇండియాలోని బిలియనీర్ లలో ముఖేష్ అంబానీ మరియు గౌతమ్ అదానీలు ప్రముఖంగా ఉన్నారు. వీరు దేశంలో వివిధ రకాల వ్యాపారాలను చేస్తూ తమ యొక్క సంపదను పెంచుకుంటున్నారు. దేశంలో టెలికాం రంగంలో ముందు నుంచి సునీల్ భారతీ మిట్టల్ ఎయిర్‌టెల్‌ పేరుతో కొనుసాగుతున్నారు. తరువాత రిలయన్స్ జియో పేరుతో ముఖేష్ అంబానీ కూడా టెలికాం రంగంలోకి ప్రవేశించారు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థ కూడా టెలికాం స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి రేసులోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. ఇదే కనుక నిజమయితే ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ జియో మరియు టెలికాం జార్ సునీల్ భారతీ మిట్టల్ యొక్క ఎయిర్‌టెల్‌కు తీవ్రమైన పోటీ ఉంటుంది అని కొన్ని నిఘా వర్గాలు తెలిపాయి.

 

అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ

జూలై 26న జరగబోయే ఐదవ తరం లేదా అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి 5G టెలికాం సేవలను అందించగల సామర్థ్యం గల ఎయిర్‌వేవ్‌ల వేలంలో పాల్గొనే దరఖాస్తులలో నాలుగు అప్లికేషన్‌లు వేయబడ్డాయి. టెలికాం రంగంలోని మూడు ప్రైవేట్ ప్లేయర్‌లు ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా దరఖాస్తు చేసుకున్నట్లు ఈ విషయంపై అవగాహన ఉన్న మూడు వర్గాలు తెలిపాయి. మిగిలిన నాల్గవ దరఖాస్తుదారు అదానీ గ్రూప్ కావడం విశేషం. ఈ గ్రూప్ ఇటీవల నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (NLD) మరియు ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ILD) లైసెన్స్‌లను పొందినట్లు కొన్ని నిఘా వర్గాలు తెలిపాయి. కానీ ఇది స్వతంత్రంగా ఇంకా ధృవీకరించబడలేదు. కానీ అదానీ గ్రూప్‌కు చేసిన ఇమెయిల్ మరియు ఫోన్ కాల్‌లకు ఎటువంటి ప్రతిస్పందనను పొందలేదు.

బ్యాండ్‌-విడ్త్

వేలం సమయపాలన ప్రకారం దరఖాస్తుదారుల యాజమాన్య వివరాలను జూలై 12న ప్రచురించాలి మరియు బిడ్డర్‌లను అప్పుడు తెలుసుకోవాలి. జూలై 26, 2022న ప్రారంభమయ్యే వేలం సమయంలో మొత్తం 72,097.85 MHz స్పెక్ట్రమ్ విలువ రూ. 4.3 లక్షల కోట్లు బ్లాక్‌లో ఉంచబడతాయి. స్పెక్ట్రమ్ విలువ వివిధ బ్యాండ్‌-విడ్త్ విభాగాలలో ఉంటుంది. ఇందులో లెస్ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మిడ్(3300 MHz) మరియు హై (26 GHz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ కోసం వేలం నిర్వహించబడుతుంది.

అంబానీ VS అదానీ
 

అంబానీ VS అదానీ

గుజరాత్‌కు చెందిన అంబానీ మరియు అదానీలు ఇద్దరు కూడా ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ముఖాముఖిగా తలపడలేదు. అంబానీ గ్రూప్ ఇప్పటివరకు చమురు మరియు పెట్రోకెమికల్స్ వ్యాపారం నుండి టెలికాం మరియు రిటైల్‌లోకి విస్తరించింది. అలాగే అదానీ గ్రూప్ ఓడరేవుల విభాగం నుండి బొగ్గు, ఇంధన పంపిణీ మరియు విమానయాన విభాగాలలో విస్తరించింది. అదానీ గ్రూప్ ఇటీవలి నెలల్లో పెట్రోకెమికల్స్‌లోకి ప్రవేశించడానికి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ అప్‌స్ట్రీమ్ కార్యకలాపాలకు సంబందించిన వ్యాపారంను ముందే ప్రారంభించారు.

అంబానీ

అంబానీ కూడా సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఫ్యూయల్ సెల్స్ కోసం గిగా ఫ్యాక్టరీలతో తన కొత్త ఎనర్జీ బిజినెస్ కోసం బహుళ-బిలియన్ డాలర్ల ప్లాన్ లను ఇటీవల ప్రకటించారు. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించనున్నట్టు గతంలో అదానీ ప్రకటించడమే కాకుండా హైడ్రోజన్ అంబిషన్స్ లను కూడా ఆవిష్కరించారు. ఇక ఇప్పుడు జులై 26న జరిగే 5G వేలంలో అదానీ గ్రూప్ పాల్గొంటే కనుక అంబానీతో ప్రత్యక్షంగా పోటీ పడడం ఇదే తొలిసారి అవుతుంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా

సెక్టార్ రెగ్యులేటర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సు చేసిన రిజర్వ్ ధరల వద్ద 5G వేలంపాటలను క్యాబినెట్ గత నెలలో ఆమోదించింది. మొబైల్ సేవల కోసం 5G స్పెక్ట్రమ్ విక్రయానికి సంబంధించి ఫ్లోర్ ధరలో దాదాపు 39 శాతం కోత విధించాలని రెగ్యులేటర్ సిఫార్సు చేసింది. స్పెక్ట్రమ్ ఉపయోగించుకునే హక్కు యొక్క చెల్లుబాటు 20 సంవత్సరాల వరకు ఉంటుంది. మొత్తంమీ రాబోయే వేలంలో బిడ్డర్‌లకు చెల్లింపు నిబంధనలు సడలించబడ్డాయి. మొట్టమొదటిసారిగా బిడ్డర్లు ముందస్తు చెల్లింపు చేయవలసిన అవసరం లేదు.

బిడ్డర్‌లు

స్పెక్ట్రమ్ కోసం పేమెంట్స్ 20 సమాన వార్షిక వాయిదాలలో ప్రతి సంవత్సరం ప్రారంభంలో ముందుగానే చెల్లించడానికి అనుమతిస్తుంది. ఈ సడలింపు నగదు ప్రవాహ అవసరాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా ఈ రంగంలో వ్యాపార వ్యయాన్ని కూడా తగ్గిస్తుంది. బిడ్డర్‌లు 10 సంవత్సరాల తర్వాత బ్యాలెన్స్ వాయిదాలకు సంబంధించి భవిష్యత్తు బాధ్యతలు లేకుండా స్పెక్ట్రమ్‌ను సరెండర్ చేసే అవకాశం ఇవ్వబడుతుంది. ఈ వేలంలో పొందిన స్పెక్ట్రమ్‌కు SUC (స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు) విధించబడదు.

5G స్పెక్ట్రమ్‌

తొమ్మిది ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలోని 5G స్పెక్ట్రమ్‌ను టెలికాం ఆపరేటర్‌లకు వేలం వేయగా టెక్ సంస్థలు తమ క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్‌వర్క్ కోసం 5G స్పెక్ట్రమ్‌ను తీసుకోవడానికి అనుమతించబడతాయని టెలికాం డిపార్ట్‌మెంట్ జారీ చేసిన నోటీసు ఇన్విటింగ్ అప్లికేషన్స్ తెలిపింది. టెక్ కంపెనీలకు స్పెక్ట్రమ్ యొక్క ప్రత్యక్ష కేటాయింపు డిమాండ్ అధ్యయనం మరియు అటువంటి కేటాయింపు యొక్క ధర మరియు పద్ధతులు వంటి అంశాలపై సెక్టార్ రెగ్యులేటర్ TRAI యొక్క సిఫార్సును అనుసరిస్తుందని బిడ్ డాక్యుమెంట్ పేర్కొంది.

డిపార్ట్‌మెంట్

ప్రైవేట్ నెట్‌వర్క్‌లపై నిర్ణయం టెలికాం డిపార్ట్‌మెంట్ ద్వారా నేరుగా 5G స్పెక్ట్రమ్ కేటాయింపుతో పాటుగా ప్రైవేట్ క్యాప్టివ్ నెట్‌వర్క్‌లను సెటప్ చేయడానికి స్వతంత్ర సంస్థలను అనుమతించినట్లయితే TSPల (టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు) వ్యాపార కేసును వాదిస్తూ వచ్చిన టెల్కోస్‌లకు ఇది ఊరటనిస్తుంది.

Best Mobiles in India

English summary
Adani Group Planning to Enter Telecom Spectrum Race: Here are The Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X