Home
News

Adobe FireFly AI Video మోడల్‌ ఆవిష్కరణ.. ఎలా పనిచేస్తుంది.. ప్రత్యేకతలు ఏంటి?

అడాబ్‌ (Adobe) ఇటీవల ప్రకటన చేసిన విధంగానే ఏఐ వీడియో జనరేటర్‌ ను ఆవిష్కరించింది. ఈ ఫైర్‌ఫ్లై వీడియో మోడల్‌ (Adobe Firefly AI Video Model) ప్రస్తుతం పబ్లిక్‌ బీటా వెర్షన్‌లో కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది. అడాబ్‌లో ప్రస్తుతం ఇమేజ్‌ మోడల్‌, వెక్టార్‌ మోడల్‌, డిజైన్‌ మోడల్‌ వంటి AI జనరేటివ్‌ మోడల్స్‌ను కలిగి ఉంది. తాజాగా ఫైర్‌ఫ్లై వీడియో మోడల్‌ ను ఆవిష్కరించింది. ఈ వీడియో మోడల్‌ 100 కి పైగా భాషల్లో టెక్ట్స్‌ ప్రాంప్ట్‌ లను సపోర్టు చేస్తుంది. మరియు వాణిజ్య పరమైన అవసరాలు సహా అద్భుతమైన కంటెంట్‌ కోసం ఉపయోగించుకోవచ్చు.

అడాబ్‌ ఫైర్‌ఫ్లై AI మోడల్‌ కొత్త టూల్స్‌ ను కలిగి ఉంటుంది. ప్రీమియర్‌ ప్రో.. పుటేజీని పెంచుకొనేందుకు మరియు ఇమేజ్‌, టెక్ట్స్‌ ప్రాంప్ట్స్‌ నుంచి వీడియోలను రూపొందించవచ్చు. ప్రీమియర్‌ ప్రో జనరేటివ్‌ ఎక్స్‌టెండ్‌ టూల్‌ ప్రస్తుతం బీటా వెర్షన్‌ లో ఉంది. దీని ద్వారా 24 FPS వద్ద 720P లేదా 1080P వద్ద రెండు సెకెన్లపాటు వీడియోను పొడిగించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ రీటేక్‌ అవసరాన్ని తగ్గిస్తుంది.

Adobe firefly AI video generator

దీంతోపాటు ఈ ఫీచర్‌ (Adobe Latest Tools) ద్వారా ఆడియోను మెరుగుపరచవచ్చు. మరియు సౌండ్‌ ఎఫెక్ట్‌ లను గరిష్ఠంగా 10 సెకన్లపాటు పొడిగించవచ్చు. దీంతోపాటు టెక్ట్స్‌ టూ వీడియో, ఇమేజ్‌ టూ వీడియో వంటి రెండు వీడియో జనరేషన్‌ టూల్స్‌ వెబ్‌ లో లాంచ్‌ అవుతున్నాయి. ఫైర్‌ఫై వెబ్‌ యాప్‌ లో పబ్లిక్‌ బీటా వెర్షన్‌ లో అందుబాటులో ఉన్నాయి.

ఓపెన్‌ ఏఐ సొరా, రన్‌వే తరహాలోనే టెక్స్ట్‌ టూ వీడియో ఫీచర్‌ పనిచేస్తుంది. ఈ ఫీచర్‌ లో టెక్స్ట్‌ ద్వారా 3D యానిమేషన్‌, మోషన్‌ తరహా స్టైల్‌ లో వీడియోలను రూపొందించవచ్చు. దీంతోపాటు కెమెరా కంట్రోల్స్‌ను వినియోగించి, ఈ వీడియోలను మరింత మెరుగుపరచవచ్చు.

ఇమేజ్‌ టూ వీడియో జనరేషన్‌ ఫీచర్‌ లో అవుట్‌పుట్‌పై ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటుంది. రిఫరెన్స్‌ ఇమేజ్‌తోపాటు టెక్స్ట్‌ ప్రాంప్ట్స్‌ను అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌ చాలా ఉపయోగపడుతుందని సంస్థ చెబుతోంది. అయితే ప్రస్తుత వీడియో ఎడిటింగ్‌ టెక్నాలజీలో ఇమేజ్‌ టూ వీడియో ఫీచర్‌ ఒక కీలక ముందడుగుగా చెబుతోంది.

జనరేటివ్‌ ఎక్స్టేండ్, ఇమేజ్‌ టూ వీడియో, టెక్ట్స్‌ టూ వీడియో సుమారుగా 90 సెకన్ల లో వీడియోను రూపొందిస్తాయి. ఈ విధానాన్ని మరింత వేగంగా పూర్తి చేసేలా ఆడాబ్‌ టర్బో మోడ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్‌లు వాణిజ్య అవసరాలకు సురక్షితమైనవిగా పేర్కొంది. అయితే వీటికి కొన్ని పరిమితులు ఉన్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం ఫైర్‌ఫ్లై వీడియో మోడల్‌ పబ్లిక్ బీటా వెర్షన్‌ అడాబ్‌ అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకొనేందుకు waitlist లో చేరాల్సి ఉంటుంది. బీటా వెర్షన్‌ లో ఉచితంగా వినియోగించుకోవచ్చు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే సమయంలో వీటి ధరలు సహా ఇతర వివరాలను వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Adobe firefly AI video generator introduced in public beta version full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X