సౌత్ ఇండియా చిత్రసీమలోకి అడుగుపెట్టనున్న ఎడోబ్‌ సిస్టమ్స్‌

Posted By: Super

సౌత్ ఇండియా చిత్రసీమలోకి అడుగుపెట్టనున్న ఎడోబ్‌ సిస్టమ్స్‌

హైదరాబాద్: ఎడోబ్‌ సిస్టమ్స్‌ దక్షిణాదిలో తమ క్రియేటివ్‌ సూట్‌ 5.5 (సిఎస్‌ 5.5) అమ్మకాలను మరింతగా పెం చుకోవడానికి దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. అమ్మకాల వృద్ధి కోసం దక్షిణాది చిత్ర, బ్రాడ్‌కాస్టింగ్‌ పరిశ్రమ, క్రియేటివ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఇండస్ట్రీ, ఐటి, కెపిఓ, ఐటి ఆధారి త రంగాలు, డెవలపర్‌ కమ్యూనిటీ 4 కీలక విభాగాలను గుర్తించింది. విభిన్న కార్యక్ర మాలతో భాగస్వామ్య పక్షాలకు సహకారం అందించ నుంది. ఈ క్రమంలోనే మంగళ వారం హైదరా బాద్‌లో తమ సిఎస్‌ 5.5ను లాంఛనంగా ఆవిష్క రించడం తోపా టు ఓ రోడ్‌షోను కూడా ఏర్పాటు చేసింది.

దాదాపు 300 మంది వినియోగదారులు ఈ రోడ్‌షోకు హాజరయ్యా రు. దక్షిణాదిలో దాదాపు 50వరకు భాగస్వామ్య పక్షాలను కలి గిన ఎడోబ్‌ తమ భాగస్వామ్యపక్షాల కొరకు ప్రత్యే మైన కార్యక్రమాలను రూపొందించింది. వీటి ద్వారా సిఎస్‌ 5.5 ఉత్పత్తులను త్వరితగతిన అమ్మే వీలుంటుంది. ఈ కార్య క్రమాల్లో ‘ఎర్లీ ఎడాప్టర్‌ ఇన్‌సెంటివ్‌ ప్రోగ్రామ్‌’ సర్టిఫికేష న్‌ ఇన్సెంటివ్‌ ప్రోగ్రామ్‌, జాయింట్‌ గోటు మా ర్కెట్‌ ప్రోగ్రామ్‌, టెక్నికల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. యువలతో సృజనాత్మకతను పెంపొందించడంకోసం విద్యార్ధులు, టీచర్ల కోసం అత్యధిక రాయితీలను అందిస్తూ ప్రత్యేక మైన ధరలను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ధర లు సాధారణ సిఎస్‌ 5.5 ఉత్పత్తుల ధరలతో పోలిస్తే దాదాపు 90శాతం రాయితీ కల్పించి నట్లు అవుతుంది. సాధారణంగా ఎడోబ్‌ సిఎస్‌ 5.5 వెబ్‌ ప్రీమియం సూట్‌ 1,07,065 రూ పాయలకు లభిస్తుంది.

అదే సాఫ్ట్‌వేర్‌ స్టూడెంట్‌ ఎడిషన్‌ను కేవలం రూ.6999 కి (పన్నులు అదనం) అందిస్తోంది. సిఎస్‌ 5.5 ను ఆవిష్క రించిన సందర్భంగా ఎడోబ్‌ సిస్టమ్స్‌ కంట్రీ మార్కెటింగ్‌ మేనేజర్‌ ప్రభజీత్‌ సింగ్‌ మాట్లాడుతూ సిఎస్‌ 5.5 ద్వారా ఎడోబ్‌ మార్కెట్లో సరికొత్త ఇన్నోవేషన్‌కు ఆస్కారం కల్పిం చినట్లయిందని చెప్పారు. ఆయా పరికరాలకు అవసరమై న కంటెంట్‌ను కూడా రూపొందించడంలో మార్పులు చో టు చేసుకోనున్నాయని చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot