సరిహద్దుల్లో లేజర్ గోడలు: అడుగడుగునా నిఘా

Written By:

ఇండియా సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. అటు చూస్తే పాకిస్తన్... ఇటు చూస్తే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అణుక్షణం ఎప్పుడు దాడి చేద్దామా అని రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన దేశం సరిహద్దుల్లో భద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అందులో భాగంగానే దేశ సరిహద్దుల్లో లేజ గోడల ఏర్పాటుకు రంగం సిద్ధమయింది. మరి లేజర్ గోడల్ల వల్ల ఉపయోగం ఏంటీ అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పఠాన్కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో

పఠాన్కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్తో సరిహద్దుల్లో నిఘావ్యవస్థపై భారత్ మరింత దృష్టి సారించింది. పాక్ నుంచి ముష్కరుల చొరబాట్లకు అడ్డుకట్ట వేయడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండో-పాక్ బోర్డర్ త్వరలో లేజర్ గోడలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

దాదాపు 40 ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల

దాదాపు 40 ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల దగ్గర వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయి. పంజాబ్లో నదుల ప్రవాహం కారణంగా సరిహద్దుల్లో కంచె రక్షణలేని 40 కి పైగా ప్రాంతాల్లో 'లేజర్ గోడ (లేజర్ వాల్స్)' లను ఏర్పాటుచేయనున్నట్లు హోంమంత్రిత్వశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

లేజర్ టెక్నాలజీ సాయంతో సరిహద్దులో

లేజర్ టెక్నాలజీ సాయంతో సరిహద్దులో కదలికలను తెలుసుకునేందుకు అవకాశముంది. ఈ గోడల దగ్గర ఎలాంటి పరికరాలు, మనుషులు ఉన్నా ... డిటెక్టర్ డివైజ్ కనిపెడుతుంది. ఈ విషయం వెంటనే భద్రతా సిబ్బందికి చేరి వారు అలర్టయ్యే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం 5 చోట్ల లేజర్ వాల్స్ ఉన్నప్పటికీ

ప్రస్తుతం 5 చోట్ల లేజర్ వాల్స్ ఉన్నప్పటికీ .. ఇటీవల జరిగిన పఠాన్కోట్ దాడుల్లో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడిన ప్రాంతంలో లేజర్ వాల్స్ లేవు. పఠాన్కోట్లో దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు బమియాల్లోని ఉజ్ నది గుండా భారత్లోకి చొరబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ప్రాంతంలో ఇంతకుముందు లేజర్ నిఘా రక్షణ లేదు.

దీంతో టెర్రరిస్టులు వచ్చిన విషయాన్ని అధికారులు

దీంతో టెర్రరిస్టులు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. ఆ ప్రాంతంలో ఉన్న కెమెరా కూడా ఉగ్రవాదుల కదలికలను రికార్డు చేయలేకపోయింది. దీంతో అన్ని సరిహద్దుల దగ్గర లేజర్ గోడలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

పఠాన్కోట్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన

పఠాన్కోట్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో గతవారం బీఎస్ఎఫ్ సదరు ప్రాంతంలో లేజర్ నిఘా సదుపాయం కల్పించింది. 'లేజర్ గోడ' వ్యవస్థలో లేజర్ ఉత్పత్తి స్థానం (సోర్స్) శోధక పరికరం (డిటెక్టర్) ఉంటాయి.

నదీ ప్రవాహానికి ఇరువైపులా వీటిని

నదీ ప్రవాహానికి ఇరువైపులా వీటిని ఏర్పాటుచేస్తారు. నదిలో పడవ ద్వారా రాత్రిళ్లు కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మత్తుపదార్థాల అక్రమ రవాణాను కూడా అడ్డుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఎలాంటి హద్దులూ లేని నదీతీరంలో

ఎలాంటి హద్దులూ లేని నదీతీరంలో ఉన్న ఆయా ప్రాంతాలన్నీ పంజాబ్లోనే ఉండడం గమనార్హం. సరిహద్దు భద్రతా దళం లేజర్ గోడల టెక్నాలజీని రూపొందించింది. తద్వారా పాకిస్థాన్ నుంచి వచ్చి చొరబడే ముష్కర మూకలకు అక్కడే 'హద్దు'లు గీసేయాలని భావిస్తోంది.

ఇప్పటికిప్పుడు ఆ ప్రాంతాల్లోని 40 నుంచి 60 చోట్

ఇప్పటికిప్పుడు ఆ ప్రాంతాల్లోని 40 నుంచి 60 చోట్ల ఈ గోడ కాని గోడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడి హద్దులు దాటాలని ప్రయత్నించే వారిని లేజర్ గోడల ద్వారా గుర్తిస్తారు. అందు కోసం ఓ డిటెక్టర్ను లేజర్ లైట్ కు అనుసంధానిస్తారు.

ఇక చొరబాట్లకు ప్రయత్నించే సందర్భంలో

ఇక చొరబాట్లకు ప్రయత్నించే సందర్భంలో భద్రతా దళాలను అప్రమత్తం చేసేందుకు గానూ దానికి ఏర్పాటు చేసిన సైరెన్ మోగుతుంది. ఇక్కడ హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write advanced tech Laser walls for riverine areas of India-Pakistan border soon
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot