Home
News

ప్రైవేట్ టెల్కోలు బడ్జెట్ ధరలో అందించే సరసమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు...

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను రెండింటినీ అందిస్తున్నారు. ప్రీపెయిడ్ ప్లాన్‌లు అనేవి మీ బడ్జెట్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అయితే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు మరియు బండిల్ సబ్‌స్క్రిప్షన్‌లతో వస్తుంది. అయినప్పటికీ టెల్కోలు సరసమైన ధరలలో కూడా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇవి తక్కువ ధర ట్యాగ్‌లోనే అధిక మొత్తంలో డేటాను అందిస్తాయి. అంతేకాకుండా టెల్కోలు వ్యక్తిగత వినియోగదారులకు అలాగే కుటుంబ కనెక్షన్‌లకు ఒకే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా అనే మూడు ప్రధాన టెల్కోలు అందించే అత్యంత సరసమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో బడ్జెట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో బడ్జెట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొన్ని అద్భుతమైన అదనపు ప్రయోజనాలతో బడ్జెట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. టెల్కో నుండి లభించే అత్యంత సరసమైన ఆఫర్లలో రూ.199 ధర ట్యాగ్‌తో వస్తుంది. జియో నెలకు రూ.199 ధర లభించే ప్లాన్ తో మొత్తం 25GB డేటాను అందిస్తుంది. 25GB డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులు ఒక GBకి రూ.20 చొప్పున ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్ అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే జియో నుండి అత్యంత ప్రజాదరణ పొందిన సరసమైన ప్లాన్ మాత్రం రూ.399. రూ.399 ధర వద్ద లభించే జియో యొక్క ప్లాన్ నెలకు మొత్తంగా 75GB డేటాను అందిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులు రూ.10/GBకి ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. ప్యాక్ 200GB డేటా రోల్‌ఓవర్‌తో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS లను అందిస్తుంది. దీనితో పాటు ఈ ప్లాన్‌తో బహుళ OTT సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది. వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్ కొన్ని జియో అప్లికేషన్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌తో కూడా వస్తుంది.

భారతీ ఎయిర్‌టెల్ సరసమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ సరసమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ సంస్థ అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు దేశంలోని అత్యంత సమర్థవంతమైన నెట్‌వర్క్‌లలో ఒకటి. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా బలమైన నెట్ వర్క్ ను కలిగి ఉన్న కలిగి ఉన్న ఎయిర్‌టెల్ అనేక అద్భుతమైన ప్రయోజనాలతో 4G ప్లాన్‌లను అందిస్తుంది. టెల్కో అందించే చౌకైన ప్లాన్ ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్ రూ.399 ధర వద్ద లభిస్తుంది. రూ. 399 ధర ట్యాగ్‌తో లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ అపరిమిత కాల్‌లతో పాటు 200GB వరకు రోల్‌ఓవర్‌తో 40GB నెలవారీ డేటాను అందిస్తుంది. అపరిమిత కాల్‌లలో లోకల్, STD మరియు రోమింగ్ ఉన్నాయి. దీనితో పాటు వినియోగదారులు రోజుకు 100 SMSలను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 1 సాధారణ సిమ్‌ను మాత్రమే పొందుతారు. ఇది ఎయిర్‌టెల్ నుండి చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అయినప్పటికీ టెలికాం ప్లాన్‌తో కొన్ని ఎయిర్‌టెల్ థాంక్స్ రివార్డ్‌లను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్-స్ట్రీమ్ యాప్ ప్రీమియం మరియు వింక్ అలాగే జగ్గర్‌నాట్ పుస్తకాలతో పాటు వినియోగదారులు షా అకాడమీకి ఒక సంవత్సరం యాక్సెస్‌ను పొందవచ్చు.

వోడాఫోన్ ఐడియా బడ్జెట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా బడ్జెట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా లేదా Vi వ్యక్తిగత కనెక్షన్‌లు అలాగే కుటుంబ కనెక్షన్‌లు రెండింటికీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. వ్యక్తిగత వినియోగదారులు Vi నుండి సరసమైన మరియు బెస్ట్ సెల్లర్ ప్లాన్‌ని రూ. 399 ధర వద్ద పొందవచ్చు. ఈ ప్లాన్ 200GB రోల్‌ఓవర్ డేటాతో పాటు నెలకు 40GB డేటాను అలాగే నెలకు 100 SMSలను అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో పాటు Vi Movies మరియు TVకి కూడా యాక్సెస్ పొందుతారు. దీనితో పాటు Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఇందులో ఇద్దరు సభ్యులకు కనెక్షన్‌లను అందించే చౌకైన ప్లాన్ రూ.699 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రాథమిక కనెక్షన్‌లతో పాటు సెకండరీ కనెక్షన్‌లకు 40GBతో మొత్తం 80GB డేటాను అందిస్తుంది. వినియోగదారులు నెలకు 3000 SMSలతో పాటు 200GB వరకు రోల్‌ఓవర్ డేటాను పొందవచ్చు. అపరిమిత స్థానిక, STD మరియు జాతీయ రోమింగ్ వాయిస్ కాల్‌లతో పాటు ఈ ప్లాన్‌తో పాటు వచ్చే ఏకైక అదనపు ప్రయోజనం Vi Movies మరియు TVకి యాక్సెస్.

Best Mobiles in India

English summary
Affordable Postpaid Plans From Private Telcos At Budget Prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X