జియో సీక్రెట్ ఆపరేషన్, గ్రాండ్ ఎంట్రీ కోసం వెయిటింగ్..

By Hazarath
|

టెలికం మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తించిన జియో ఇప్పుడు మళ్ళీ మరో రంగంలో ప్రకంపనలు రేకెత్తించబోతోందని వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. భారత ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజాలకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ కామర్స్ రంగంలో జియో మరో సునామిని తీసుకొచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

 

అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీరో 5, ధర రూ. 17,999అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీరో 5, ధర రూ. 17,999

ఈ కామర్స్ రంగంలో సత్తా చాటేందుకు రెడీ

ఈ కామర్స్ రంగంలో సత్తా చాటేందుకు రెడీ

జియో తనకున్న విస్తారమైన నెట్‌వర్క్‌, మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లతో ఈ కామర్స్ రంగంలో సత్తా చాటేందుకు రెడీ అవుతుందోని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

డిజిటల్‌ కూపన్లను..

డిజిటల్‌ కూపన్లను..

ప్రస్తుతం ఈ కంపెనీ వీధుల్లో ఉండే స్టోర్లు లేదా కిరణా షాపులతో కలిసి పనిచేస్తుందని, జియో మనీ ప్లాట్‌ఫామ్‌ లేదా టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా డిజిటల్‌ కూపన్లను వాడుకుని పక్కనే ఉన్న దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేలా ఆపరేషనల్‌ మోడల్‌ను సిద్ధంచేస్తుందని తెలిసింది.

పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం..

పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం..

ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌ సిటీల్లో పలు స్టోర్లకు, దిగ్గజ బ్రాండులకు కల్పిస్తోంది.అక్కడ విజయవంతం అయితే వచ్చే ఏడాది దేశమంతటా దీన్ని ఆవిష్కరించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

132 మిలియన్‌ మంది సబ్‌స్క్రైబర్లు..
 

132 మిలియన్‌ మంది సబ్‌స్క్రైబర్లు..

జియోకి ఇప్పుడు 132 మిలియన్‌ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని అంచనా..వీరితో ఈ కంపెనీ ఆన్‌లైన్‌ టూ ఆఫ్‌లైన్‌ ఈ కామర్స్‌లోకి ప్రవేశిస్తే, ఇక పేమెంట్‌ కంపెనీలు పేటీఎం, ఫోన్‌పే లాంటివి కూడా ఇతర సంస్థలతో డీల్ కుదుర్చుకోవాల్సిందేనని తెలుస్తోంది.

రిలయన్స్‌ జియో ఇంకా ఎటువంటి కామెంట్‌ ..

రిలయన్స్‌ జియో ఇంకా ఎటువంటి కామెంట్‌ ..

కాగా ఆన్‌లైన్‌-టూ-ఆఫ్‌లైన్‌ బిజినెస్‌ మోడల్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు రిలయన్స్‌ జియో ఇంకా ఎటువంటి కామెంట్‌ చేయలేదు.

మొత్తం రిటైల్‌ ఇండస్ట్రీ..

మొత్తం రిటైల్‌ ఇండస్ట్రీ..

మొత్తం రిటైల్‌ ఇండస్ట్రీ ఇప్పుడు దాదాపు 650 బిలియన్‌ డాలర్ల విలువ కలిగి ఉందని అంచనా.. ఇందులో ఈ కామర్స్ 3-4 శాతం, షాపర్స్‌ స్టాప్‌, బిగ్‌ బజార్‌ లాంటి సంస్థలు 8 శాతం కాగా మిగతా 88 శాతం వరకు చిన్నదుకాణాలు కలిగి ఉన్నాయి.

జియో ఈకామర్స్‌ మోడల్‌..

జియో ఈకామర్స్‌ మోడల్‌..

అయితే జియో ఈకామర్స్‌ మోడల్‌ ఇంకా ఖరారు చేయలేదని, పైలెట్‌ ప్రాజెక్ట్‌ నుంచి పలు ఇన్‌పుట్‌లు సేకరించిన తర్వాత దీనిలో మార్పులు చేసి తుది రూపకల్పన చేస్తామని జియో ఎగ్జిక్యూటివ్‌ మీడియాకి చెప్పినట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
After changing telecom's face forever, Jio now sets sights on a grand entry in ecommerce Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X