ఎన్ని గంటలపాటు వినియోగించాక AC ని కచ్చితంగా సర్వీసింగ్ చేయించాలి.. లేకుంటే ఏం జరుగుతుంది..?
గతంతో పోలిస్తే వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పట్టణాలు, నగరాలు సహా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఏసీలు, ఎయిర్‌కూలర్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అయితే ఏసీల వినియోగించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే విద్యుత్ ఛార్జీలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణం అయ్యే అవకాశం ఉంది.
క్రమం తప్పకుండా ఏసీ సర్వీసింగ్ :
ఏసీలు (Air Conditioner) ఉపయోగించే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు.. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. సర్వీసింగ్ వల్ల ఎయిర్ కండిషనర్ (AC) సరైన పనితీరు కనబరచడంతోపాటు విద్యుత్ ఛార్జీలు కూడా నియంత్రణలోనే ఉంటాయి.

సర్వీసింగ్ పై శ్రద్ద వహించరు! :
కొంత మంది AC లను రోజులో ఎక్కువ గంటల పాటు వినియోగిస్తుంటారు. అయితే సర్వీసింగ్ పై సరిగ్గా దృష్టిసారించరు. ఇలాంటి సందర్భాల్లో ఏసీలు ఎక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. మరియు కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా కారణం అవుతాయి.
600- 700 గంటల వినియోగం :
నిపుణుల సూచనల ఆధారంగా ప్రతి 600 నుంచి 700 గంటలకు ఒకసారి AC ను సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి దీనిపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ గంటలపాటు ఎయిర్ కండిషనర్‌ను వినియోగించాక.. గ్యాస్ లీకేజీ, కంప్రెషర్ పనితీరు, ఫిల్టర్‌లను తప్పకుండా తనిఖీ చేయాలి. ఎటువంటి డ్యామేజీని గుర్తించినా వెంటనే సర్వీసింగ్ చేయించాలి.
ఎక్కువ గంటల వినియోగం అనంతరం గ్యాస్ లీకేజీ సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు నిరంతరంగా ఏసీలను 10 నుంచి 12 గంటలపాటు వినియోగిస్తుంటారు. దీని వల్ల కంప్రెషర్ త్వరగా డ్యామేజీ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎయిర్ కండిషనర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా ఎయిర్ ఫ్లో సక్రమంగా ఉంటుంది.
24 డిగ్రీల వద్ద :
ఏసీలను 24 డిగ్రీల వద్ద ఉపయోగించే అలవాటు చేసుకోవాలి. లేకుంటే విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొంత మంది ఏసీ ఇన్‌డోర్ యూనిట్లను సీలింగ్ కు సమీపంలో అమర్చుతుంటారు. దీని వల్ల ఏసీ సరైన పనితీరు కనబరచదు. గదిలో సుమారుగా 7- 8 అడుగుల ఎత్తులో అమర్చుకోవాలి.
అలాగే ఏసీ ఇన్‌డోర్ యూనిట్‌ను ఎంత భద్రంగా చూసుకుంటామో.. అవుట్‌డోర్ యూనిట్ విషయంలో అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ దుమ్ము, దూళి, చెత్త చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు సూర్యకిరణాలు నేరుగా అవుట్‌డోర్ యూనిట్‌పై పడకుండా చూసుకోవాలి.
ఏసీ పనితీరును నిరంతరం గమనిస్తుండాలి. పనితీరులో ఎటువంటి మార్పులు గమనించినా, ఎటువంటి డ్యామేజీలను గుర్తించినా.. వెంటనే సర్వీసింగ్ చేయించాలి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఏసీలను వినియోగించాలని భావిస్తే.. ముందుగా పూర్తిస్థాయిలో సర్వీసింగ్ చేయించాలి. ఎటువంటి సమస్య లేకున్నా ప్రతి 600 నుంచి 700 మధ్య కచ్చితంగా సర్వీసింగ్ చేయించాలి.
చిన్నారుల గదుల్లో ఏసీలను వినియోగిస్తుంటే మాత్రం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారుల శరీరంపై వస్త్రాన్ని కప్పి ఉంచాలి. మరియు ఎక్కువ సమయం పాటు ఏసీ లో చిన్నారులను ఉంటే.. కొన్నిసార్లు అనారోగ్యం బారినపడే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








