ఐఫోన్ 17 సిరీస్ విడుదల అనంతరం.. ఆపిల్ గత సంవత్సరం తరహా నిర్ణయం తీసుకుంటుందా?
ఆపిల్ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఐఫోన్ 17 సిరీస్ ను (iPhone 17 Series) సెప్టెంబర్ 9 వ తేదీ రాత్రి 10:30 IST విడుదల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పింది. ఆపిల్ పార్క్ లో ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. దీంతోపాటు మరిన్ని గ్యాడ్జెట్స్ విడుదల కానున్నాయి.
భారీగా ధర తగ్గనుందా? :
ఐఫోన్ 17 సిరీస్ విడుదల అనంతరం ప్రస్తుతం ఉన్న ఐఫోన్ ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతోపాటు కొన్ని మోడల్స్ విక్రయాలు నిలిచిపోనున్నాయి. గత సంవత్సరం కూడా ఇదే తరహా పరిణామాలు జరిగాయి. అప్పటికే ఉన్న ఐఫోన్ మోడల్స్ ధరలను భారీగా తగ్గించింది.

రూ.10 వేల చొప్పున ధర తగ్గనుందా? :
గత సంవత్సరం ఐఫోన్ 16 సిరీస్ విడుదల అనంతరం.. ఐఫోన్ 15 సిరీస్, ఐఫోన్ 14 ధరలను భారీగా తగ్గాయి. ఈ సంవత్సరం కూడా ఐఫోన్ 17 సిరీస్ విడుదల అనంతరం ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 16 సిరీస్ ధరలు రూ.10,000 చొప్పున తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రకటన వస్తుందా?
దీంతోపాటు ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్ ధరలకు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఆపిల్ మాత్రం ఇప్పటి వరకు ధరల తగ్గింపుపై ఎటువంటి ప్రకటన చేయలేదు. గత సంవత్సరం కూడా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే.. కొత్త సిరీస్ ఐఫోన్ ల విడుదల అనంతరం, పాత సిరీస్ ల ధరల తగ్గింపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
గతంలో ఏం జరిగింది :
ఐఫోన్ పాత సిరీస్ స్మార్ట్‌ఫోన్ ల ధరల తగ్గింపుతోపాటు ప్రో మోడల్స్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అనంతరం.. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్ ను అధికారికంగా నిలిపివేసింది. ఈ సంవత్సరం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
థర్డ్‌పార్టీ ప్లాట్‌ఫాంలలో :
ఐఫోన్ 17 సిరీస్ విడుదల అనంతరం ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ ను అధికారికంగా నిలిపివేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రో మోడల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ప్లాట్‌ఫాం ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేక ట్యాగ్‌లైన్ :
ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ ను Awe Dropping ట్యాగ్‌లైన్‌తో నిర్వహిస్తోంది. దీని ఆధారంగా సాధారణ అప్‌డేట్స్ కంటే అనేక ప్రత్యేకతలను ఉండే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 9 వ తేదీ రాత్రి 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియా కుపెర్టినోలోని ఆపిల్ పార్క్‌లో ఈవెంట్ జరుగుతుంది. అధికారిక ప్లాట్‌ఫాంల ద్వారా లైవ్ వీక్షించవచ్చు.


Click it and Unblock the Notifications








