Home
News

మొబైల్‌ యూజర్లు షాక్ మీద షాక్‌లు ఇస్తున్న నెట్‌వర్క్‌లు.. మొన్న జియో, నేడు ఎయిర్‌టెల్‌..!

భారత్‌లో ప్రైవేటు టెలికాం సంస్థలు గత సంవత్సరం యూజర్లకు భారీ టారిఫ్‌లు విధించి గట్టి షాక్‌ ఇచ్చాయి. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన యూజర్లు ఇతర నెట్‌వర్స్‌కు పోర్టింగ్‌ అయ్యారు. అనంతరం కొంత కాలం ఊపసమనం కోసం యూజర్లను ఆకట్టుకొనేందుకు ఈ సంస్థలు కొన్ని చర్యలు తీసుకున్నాయి. అయితే ఈ సంవత్సరం చివర్లో మరోసారి టారిఫ్‌లు పెంచబోతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.

ఇవాళ్టి నుంచే ఎయిర్‌టెల్‌ నిర్ణయం అమల్లోకి :
ARPU పెంచుకోవడంలో భాగంగా మరోసారి ధరల మోత మోగనుందనే వార్తలొచ్చాయి. అయితే అంతకంటే ముందే జియో, ఎయిర్‌టెల్ సంస్థలు యూజర్లకు గట్టి షాక్‌ ఇచ్చాయి. రోజువారీ డేటాను అందించే ఎంట్రీ లెవల్ ప్లాన్‌లను తొలగించాయి. రెండు రోజుల ముందు జియో తన నిర్ణయాన్ని ప్రకటన చేయగా... ఎయిర్‌లెట్ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది.

airtel also discontinued rs249 prepaid recharge Plan

ఇప్పటికే జియో కీలక నిర్ణయం :
జియో (Jio) తన రోజుకు 1GB డేటాను అందించే రూ.249 రీఛార్జ్‌ ప్లాన్‌ను తొలగించింది. ఈ ప్లాన్‌లో ఇది వరకు రోజువారీ 1GB డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS అందించేది. ఇటీవలే ఈ ప్లాన్‌ను తొలగించింది. దీంతోపాటు రోజువారీ 1GB ప్లాన్‌లను పూర్తిగా తొలగించినట్లయింది.

రోజువారీ డేటా కావాలంటే :
జియో వెబ్‌సైట్‌ ఆధారంగా రోజువారీ 1GB డేటా అందించే ప్లాన్‌లను పూర్తిగా నిలిపేసింది. ప్రస్తుతం యూజర్లు రోజువారీ డేటా ప్లాన్‌ కావాలంటే కనీసం రూ.299 తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో రోజువారీ 1.5GB డేటాను పొందుతారు. అన్‌లిమిటెడ్ కాలింగ్‌, రోజువారీ SMS లను కూడా పొందవచ్చు.

తాజాగా ఎయిర్‌టెల్ :
అయితే జియో తరహాలోనే ఎయిర్‌టెల్ కూడా షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ రూ.249 రీఛార్జ్‌ ప్లాన్‌ను తొలగించింది. ఇవాళ్టి నుంచే ఎయిర్‌టెల్‌ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో ఈ ప్లాన్‌కు సెర్చ్‌ చేసినప్పుడు ప్లాన్‌ను మూసివేసినట్లు నోట్ కనిపిస్తోంది.

ఫలితంగా ఎయిర్‌టెల్‌ (Airtel) యూజర్లు రోజువారీ డేటా ప్లాన్‌ల కోసం కనిష్ఠంగా రూ.299 తో రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాల్స్‌ తోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 1.5GB డేటాను పొందుతారు.

అయితే మరో ప్రైవేటు టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా (VI) మాత్రం ఇప్పటి వరకు ఈ తరహాలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. VI కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో కూడా రీఛార్జ్‌ టారిఫ్‌ల పెంపు నిర్ణయాలు ఒకరి తర్వాత ఒకరు వెల్లడించారు.

ఎంట్రీ లెవల్‌ ధరల్లో ఉన్న 1GB డేటా రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించడం వల్ల యూజర్లు కచ్చితంగా రోజువారీ 1.5GB డేటాను అందించే ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రైవేటు టెలికాం నెట్‌వర్క్‌లకు ARPU పెరగనుంది. దీంతోపాటు ఈ సంవత్సరం చివర్లో టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
After Jio, airtel also discontinued rs249 prepaid recharge Plan full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X