అమెజాన్ ఇండియాలో జియో ఫీచర్ ఫోన్...అమ్మకానికి రెడీ!

By Madhavi Lagishetty
|

రిలయన్స్ జియో ఫోన్. దేశవ్యాప్తంగా ఉచిత డేటాతో సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు జియో ఫీచర్ ఫోన్లను కూడా అమ్మకానికి ఉంచిందన్న సంగతి తెలిసిందే. 15వందల రూపాయల రిఫండబుల్ డిపాజిట్ తో ఈ ఫోన్ను సొంతం చేసుకునేందుకు జనాలు ఎగబడుతున్నారు.

 
అమెజాన్ ఇండియాలో జియో ఫీచర్ ఫోన్...అమ్మకానికి రెడీ!

యూజర్లు భారీగా ఎగబడుతుండటంతో ...అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో జియో ఫీచర్ ఫోన్ను అమ్మకానికి రెడీగా ఉంచింది. అంతేకాదు కొన్ని గంటల్లో అధిక ధర ఉన్న ట్యాగును అమెజాన్ ఇండియా తొలగించింది.

ఆన్ లైన్ రిటైల్లో 1,745రూపాయలతోపాటు అదనపు డెలివరీ ఛార్జ్ 49 రూపాయలు ఉంటుంది. ఈ డివైసుకు చెల్లించాల్సిన మొత్తం 1,794రూపాయలు. ఈ పరికరాన్ని 1,500రూపాయలకు సెక్యూరిటీ డిపాజిట్ తో కొన్ని నిబంధనలు మరియు షరతులతో డిపాజిట్ మొత్తాన్ని మూడు సంవత్సరాల తర్వాత వినియోగదారులకు తిరిగి చెల్లించబడుతుంది.

గ్యాడ్జెట్ గీక్ బిజినెస్ సొల్యూషన్ అనే సంస్థ జియో ఫీచర్ ఫోన్ అమ్మకాలను చేపడుతోంది. అయితే అమెజాన్ లో లిస్టింగ్ ఈ రేటింగ్ తక్కువగా ఉందని తేలింది. అధికారిక అమ్మకాల్లో ఉన్న సదుపాయాలు అమెజాన్లో కొనుగోలు చేయడం వల్ల అందుబాటులో ఉంటాయో లేదోనన్న అనుమానంతో యూజర్లు ఈ ఫోన్ను కొనుగోలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.

జియోఫోన్ దాదాపు అన్ని మేజర్ రిటైలర్ స్టోర్స్ లో అందుబాటులో ఉంది. ఫీచర్ ఫోన్ కొనాలనే ఆసక్తి ఉన్న వినియోగదారులు ...దానిని కొనడానికి దగ్గరలో ఉన్న స్టోర్లో సంప్రదించవచ్చు. జియోఫోన్ను కొనేటప్పుడు యూజర్లు కొత్త జియో సిమ్ కార్డును తీసుకోవడానికి 153రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అమెజాన్ ఇండియా నుంచి జియోఫోన్ను కొంటున్నప్పటికీ కొనుగోలుదారులు జియో 4జి సిమ్ కార్డును పొందాలంటే...మీకు దగ్గరలో ఉన్న జియో స్టోరోలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

రూ. 46 వేల శాంసంగ్ Galaxy S7 స్మార్ట్‌ఫోన్ రూ. 8999కే సొంతం చేసుకునే అవకాశం !రూ. 46 వేల శాంసంగ్ Galaxy S7 స్మార్ట్‌ఫోన్ రూ. 8999కే సొంతం చేసుకునే అవకాశం !

ఎక్కువ ధర ట్యాగ్ తప్ప, అమెజాన్ ఇండియాలోని జియోఫోన్ జాబితా ఈ డివైసు డ్యుయల్ సిమ్ తో వస్తుంది. వినియోగదారులు ఈ ఫోన్లో ఏ ఇతర నెట్ వర్క్ కు సంబంధించిన సిమ్ కార్డును అయినా సరే వాడుకోవచ్చు. అయితే జియోఫోన్ కు సంబంధించి సిమ్ స్లాట్(మోడల్ సంఖ్య F90M) ను కలిగి ఉండదు. క్యారియర్ లాక్ చేసిన డివైసుతో మాత్రమే జియో 4జి సిమ్ కార్డుతో పనిచేస్తుంది. అమెజాన్ ఇండియాలో జియోఫోన్ లిస్టింగ్ ప్రామాణికతను అనుమానం వ్యక్తం చేస్తుంది.

అమెజాన్ కు ముందు, జియోఫోన్ను OLXలో కొంత మంది వినియోగదారులు చూశారు. అంతేకాదు కొంతమంది వినియోగదారులు జియోఫోన్ను విక్రయించడానికి అన్ లైన్ క్లాసిఫైడ్స్ ఫ్లాట్ ఫాంను సెలక్ట్ చేసుకున్నారు. రిలయన్స్ జియో మరియు సంస్థ నిబంధనలు మరియు షరతులు డివైసును కొనుగోలుదారులు ఇతరులకు విక్రయించడానికి ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది.

Best Mobiles in India

English summary
The Reliance JioPhone is now listed on the online retailer Amazon India at a relatively higher price point of Rs. 1,745 and an additional delivery charge of Rs. 49. The JioPhone listing on Amazon India claims that the device is a dual SIM model and that users can use any SIM card but that is not the case.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X