పోర్న్ బ్యాన్ తరువాత జియో మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది!

భారత్‌లో పోర్న్ బ్యాన్ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోర్న్ కంటెంట్‌ను దొడ్డిదారిన అందించే ఉద్దేశ్యంతో వందల సంఖ్యలో వీపీఎన్ ఇంకా ప్రాక్సి వెబ్‌సైట్స్ పుట్టుకొస్తున్నాయి

|

భారత్‌లో పోర్న్ బ్యాన్ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోర్న్ కంటెంట్‌ను దొడ్డిదారిన అందించే ఉద్దేశ్యంతో వందల సంఖ్యలో వీపీఎన్ ఇంకా ప్రాక్సి వెబ్‌సైట్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ విధమైన సైట్‌ల పై ఎటువంటి నిఘా లేకపోవటంతో బ్యాన్‌ను తుంగలోకి తొక్కి అడ్డుఅదుపు లేకుండా పోర్న్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వీపీఎన్ ఇంకా ప్రాక్సి వెబ్‌సైట్స్‌కు త్వరలోనే చెక్ పెట్టబోతున్నాయి.

దిగ్గజాలకు షియోమి భారీ షాక్, రూ. 13 వేలకే 48 ఎంపి కెమెరా ఫోన్దిగ్గజాలకు షియోమి భారీ షాక్, రూ. 13 వేలకే 48 ఎంపి కెమెరా ఫోన్

రిలయన్స్ జియో త్వరలోనే...

రిలయన్స్ జియో త్వరలోనే...

రెడ్డిట్ ఫ్లాట్‌ఫామ్‌లో హల్‌చల్ చేస్తోన్న ఓ రిపోర్ట్ ప్రకారం భారతదేశపు మూడవ అతిపెద్ద టెలికమ్ ఆపరేటర్‌గా గుర్తింపుతెచ్చుకున్న రిలయన్స్ జియో త్వరలోనే ఇటువంటి వీపీఎన్ ఇంకా ప్రాక్సి వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు సిద్థమవుతోంది. వాస్తవానికి ప్రాక్సి వెబ్‌సైట్స్ అనేవి ఇంటర్నెట్ నిబంధనలను అతిక్రమించటంతో పాటు జియోగ్రాఫికల్ లొకేషన్‌ను గోప్యంగా ఉంచుతాయి.

ఇలా చేస్తోన్న వెబ్‌సైట్‌ల జాబితాలో...

ఇలా చేస్తోన్న వెబ్‌సైట్‌ల జాబితాలో...

ఇలా చేస్తోన్న వెబ్‌సైట్‌ల జాబితాలో ప్రాక్సీసైట్.కామ్(proxysite.com), హైడ్.మి (hide.me), కేప్రాక్సీ.కామ్ (kproxy.com), హైడెస్టర్.కామ్ (hidester.com), అనానిమస్.ఓఆర్‌జి (anonymouse.org), జెండ్2.కామ్ (zend2.com), whoer.net, మెగాప్రాక్సీ.కామ్ (megaproxy.com), వీపీఎన్‌బుక్.కామ్ (vpnbook.com) వంటి వెబ్‌సైట్‌లు ఉన్నాయి.

Alpha-Grizzly పేరుతో ఉన్న రెడ్డిట్ యూజర్....

Alpha-Grizzly పేరుతో ఉన్న రెడ్డిట్ యూజర్....

Alpha-Grizzly పేరుతో ఉన్న రెడ్డిట్ యూజర్ ఆ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం రిలయన్స్ జియో ఇప్పటికే hide.me, whoer.net, vpnbook.com వంటి వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేసింది. ‘‘ఈ నిర్ణయం చాలా దారుణం. ఇప్పటి వాళ్లు hide.me, whoer.net, vpnbook.comను బ్లాక్ చేసేసారు. అయితే కొన్ని కొన్ని సార్లు httpsను ఉపయోగించటం ద్వారా సమస్య పరిష్కారమవుతోంది. ఇప్పుడు నా ప్రశ్నేంటంటే తరువాత బ్యాన్ అయ్యేది ఏది? ఇప్పటికే వాళ్లు పోర్న్ బ్యాన్ చేసారు, వీటితో పాటు సాధారణ వెబ్‌సైట్‌లైన behance.net, collegehumor.comలను కూడా బ్యాన్ చేసారంటూ ఈ పోస్టులో సదరు యూజర్ వాపోయారు.

పలువురు రెడ్డిట్ యూజర్లు...

పలువురు రెడ్డిట్ యూజర్లు...

ఆల్ఫా-గ్రిజ్జిలితో పాటు పలువురు రెడ్డిట్ యూజర్లు పోస్ట్ చేసిన వివరాల ప్రకారం రిలయన్స్ జియో టొరెంట్ ఇండెక్సింగ్ వెబ్‌సైట్‌లతో పాటు మల్టీహోస్ట్ ప్లాట్‌ఫామ్‌లను కూడా బ్లాక్ చేస్తోంది. అడల్ట్ కంటెంట్ యాక్సిస్‌ నిలిపివేయాలంటూ, ఉత్తరాఖండ్ హైకోర్ట్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో, ఆఘమేఘాల మీద స్పందించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ ఇటీవల 827 పోర్న్ వెబ్‌సైట్‌ల పై కొరడా జులుపించింది. తక్షణమే వీటిని బ్లాక్ చేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయాలు తెలిసిందే.

Best Mobiles in India

English summary
After porn ban, Reliance Jio blocks VPNs and proxy websites: Reports.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X