UPDATE : ఆ వార్తలను ఖండించిన జియో.. ఆ ప్లాన్ అందుబాటులోనే ఉంది!
Jio Rs799 Recharge Plan UPDATE (జులై 21, 1.50 PM IST) : జియో రూ.249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తరహాలోనే రూ.799 రీఛార్జ్ ప్లాన్‌ను తొలగించినట్లు వస్తున్న వార్తలను జియో తాజాగా ఖండించింది. రూ.799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులోనే ఉందని స్పష్టం చేసింది. అన్ని ప్లాట్‌ఫామ్స్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది.
--------------------------------------------------------------------------------------------------
Jio Rs799 Recharge Plan : ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ యూజర్లకు వరుస షాక్‌లు ఇస్తోంది. ఇటీవలే ఎంట్రీ లెవల్ ప్లాన్ ను ఎత్తేసిన జియో మరో ప్లాన్ ను తాజూగా తొలగించింది. యూజర్ల నుంచి సగటు ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగానే ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్ కూడా ఇటీవలే రూ.249 ప్లాన్ ను నిలిపివేసింది.
రెండు రోజుల ముందే :
జియో ఇటీవల రూ.249 రీఛార్జ్ ప్లాన్ ను తొలగించింది. ఈ ప్లాన్ లో గతంలో రోజువారీ 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను అందించేది. మరియు ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండేది. ఈ ప్లాన్ తొలగింపుతో జియోలో రోజువారీ 1GB డేటా అందించే ప్లాన్ లను పూర్తిగా నిలిపివేసినట్లు అయింది.

రోజువారీ డేటా కావాలంటే :
జియోలో రోజువారీ డేటా కావాలని భావిస్తున్న యూజర్లు కచ్చితంగా రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 84 రోజుల వ్యాలిడిటీని ఇచ్చే రూ.799 రీఛార్జ్ ప్లాన్ ను నిలిపేసింది.
తాజాగా ఈ ప్లాన్ తొలగింపు :
జియో రూ.799 ప్లాన్ లో ఇప్పటి వరకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ 100 SMS లు మరియు ప్రతి రోజు 1.5GB డేటాను పొందుతున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేది. ఇదే ప్రయోజనాలు కావాలంటే ఇక నుంచి రూ.889 ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే రూ.889 ప్లాన్‌లో జియోసావన్ ప్రో కూడా అదనంగా అందిస్తోంది.
ఎయిర్‌టెల్ కూడా :
జియో తన రోజువారీ 1GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్ రూ.249 ను తొలగించిన తర్వాత రోజునే ఎయిర్‌టెల్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. రోజువారీ 1GB డేటాను అందించే రూ.249 ప్లాన్ ను తొలగించింది. రోజువారీ డేటా కావాలంటే రూ.299 లేదా ఆపై రీఛార్జ్ లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్లాన్‌ల తొలగింపు వెనుక ఉన్న కారణం ఇదేనా?
యూజర్ల నుంచి వస్తున్న సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంలో భాగంగానే ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వోడాఫోన్ ఐడియా, BSNL ఇటీవల కాలంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అయితే వోడాఫోన్ ఐడియా కూడా జియో, ఎయిర్‌టెల్ ఐడియా బాటలో నడిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ సంవత్సరం చివల్లో మరోసారి?
ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (VI) గత సంవత్సరం జులై నెలలో భారీగా రీఛార్జ్ ప్లాన్ ల ధరలను పెంచాయి. అయితే ఈ సంవత్సరం చివల్లో కూడా మరోసారి ధరల పెంపు ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అంతకు ముందే బేస్ ప్లాన్‌లను టెలికాం సంస్థలు తొలగించాయి. అయితే BSNL మాత్రం ఇప్పట్లో టారిఫ్‌ల పెంపు ఉండదని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications








