ట్విట్టర్ ఓకే.. ఇక ఫేస్‌బుక్‌లో ఎకౌంట్: పీఎంఓ

Posted By: Staff

ట్విట్టర్ ఓకే.. ఇక ఫేస్‌బుక్‌లో ఎకౌంట్: పీఎంఓ

న్యూఢిల్లీ: రెండు వారాల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో ఖాతాని తెరిచిన విషయం అందరికి తెలిసిందే. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్  ట్విట్టర్‌ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్న ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) తాజాగా సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్‌ ఫేస్‌‌బుక్‌లో ఖాతా తెరిచే పనిలో పూర్తిగా నిమగ్నమైంది. ఈ విషయాన్ని పీఎంఓ అధికారులు వెల్లడించారు.

సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ తమ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. ఈ తతంగాన్ని చూసుకునేందుకు పీఎంఓలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని సమాచారం. సమాచార ప్రసారాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఈ కార్యాలయం సిబ్బంది తోడ్పడుతుంది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ తమకు పూర్తిగా కొత్తదని.. అన్ని సదుపాయాలు సమకూర్చుకోవటానికి కొంత సమ యం పడుతుందని వారు అన్నారు.

ఐతే ఆపదలో ఉన్న ఫిర్యాదుదారులకు ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తుందని అధికారులు వెల్లడించారు. ఫేస్‌బుక్‌లో ప్రస్తుతం పీఎంఓ పేరిట ఉన్న ఖాతా అధికారికమైంది కాదు. దీనిని అభిమానులు నిర్వహిస్తున్నారు. జనవరి 23న ప్రారంభమైన @PMOIndia పేరుతో ఉన్న ఈ ట్విట్టర్ ఎకౌంట్‌లో ముఖ్యమైన న్యూస్, ఈవెంట్స్‌ని ప్రధానమంత్రి ఆఫీసు నుండి ట్వీట్ చేయనున్నారు. అమెరికా వైట్ హౌస్(@whitehouse) తరహాలో ఈ ఎకౌంట్‌ని వినియోగించనున్నామని అన్నారు.

ప్రముఖ ఇంగ్లీషు ఛానల్ బిబిసికి ప్రధానమంత్రి ఆఫీసు ఇచ్చిన ఇంటర్యూలో ట్విట్టర్ ఎకౌంట్‌ని ప్రారంభించడానికి గల కారణాలను వెలిబుచ్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఎల్లప్పుడూ పనిలో బిజీగా ఉంటుంది. మన్మోహాన్ సింగ్ ఒక సంవత్సరంలో 30-45 ట్రిప్పులకు వెళుతుంటారు. వీటికి సబంధించిన సమాచారం ప్రజలకు తెలియడం లేదు. ఈ ట్విట్టర్ ఖాతా వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందజేస్తుంది. ఈ ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి దేశంలో ఉన్న యువతకు తన సందేశాలు అందచేయవచ్చుననే ఉద్దేశ్యంతో ప్రారంభించామని అన్నారు.

ప్రపంచంలో ఉన్న అందరి లీడర్స్ మాదరి కాకుండా, మన్మోహాన్ ఎప్పుడూ మీడియాతో తక్కువగా మాట్లాడుతుంటే విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ట్విట్టర్ ఎకౌంట్‌ని ప్రధాని మన్మోహాన్ టీమ్ నిర్వహిస్తుంది. ట్విట్టర్‌లో ఎకౌంట్‌ని ప్రారంభించిన ఒక్కరోజులోనే 9,000 మంది ఫాలోవర్స్ దీనిని ఫాలో అవుతున్నారు.

భారతదేశ ప్రధాని ట్విట్టర్ ఎకౌంట్‌ని ఫాలో అవ్వాలని అనుకున్న వన్ ఇండియా పాఠకులు ఈ లింక్ ద్వారా http://twitter.com/PMOIndia ఫాలో అవ్వొచ్చు. ఇండియాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 1.8 మిలియన్ ఫాలోవర్స్‌తో  మొదటి స్దానంలో ఉన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot