25 కోట్ల కంప్యూటర్లను ముంచేసిన మరో వైరస్

వన్నాక్రై ర్యాన్సమ్‌వేర్ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరకుంటున్న ఇంటర్నెట్ ప్రపంచానికి మరో సమస్య వచ్చిపడింది. 'Fireball' పేరుతో సరికొత్త మాల్వేర్‌ను సెక్యూరిటీ రిసెర్చర్లు కొనుగొన్నారు. చాప క్రింద నీరులా వ్యాపిస్తోన్న ఈ మాల్వేర్ కంప్యూటర్‌లోకి చొరబడిన వెంటనే యూజర్ ఉపయోగించే బ్రౌజర్‌ను తన కంట్రోల్‌లోకి తీసేసుకుని డీఫాల్ట్‌గా ఉన్న సెర్చ్ ఇంజిన్‌ను మార్చేస్తుంది.

25 కోట్ల కంప్యూటర్లను ముంచేసిన మరో వైరస్

ప్రముఖ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫైర్‌బాల్ మాల్వేర్ యూజర్ డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌ను మార్చటం ద్వారా వారి వెబ్ ట్రాఫిక్‌ను ట్రాక్ చేయగలుగుతుంది. బాధితుడి కంప్యూటర్‌లోకి ప్రమాదకర ఫైళ్లను కూడా ఈ మాల్వేర్ జొప్పింగలదని చెక్ పాయింట్ రిసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.

25 కోట్ల కంప్యూటర్లను ముంచేసిన మరో వైరస్

ఈ మాల్వేర్ ఉచ్చులో 25 కోట్ల కంప్యూటర్లు సునాయాశంగా చిక్కుకుని ఉండొచ్చని చెక్ పాయింట్ రిసెర్చ్ టీమ్ హెడ్ మయ హొరోవిట్జ్ తెలిపారు. ఈ మాల్వేర్ వెనుక చైనా హ్యాకర్లు ఉన్నట్లు చెక్ పాయింట్ రిసెర్చ్ అభిప్రాయపడుతోంది. యాడ్వేర్‌లా యాక్ట్ చేయగలిగే ఈ ఫైర్‌బాల్ మాల్వేర్ దొడ్డిదారిన కంప్యూటర్లలోకి చొరబడుతోంది. యాంటీ మాల్వేర్ ప్రోగ్రామ్‌లను కంప్యూటర్‌లలో తరచూ రన్ చేస్తుండటం ద్వారా 'Fireball' ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

English summary
After WannaCry, India Hit By New ‘Fireball’ Malware!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting